దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 – 175-దత్త క్షేత్ర హనుమాన్ –కాలడి

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

175-దత్త క్షేత్ర హనుమాన్ –కాలడి

కేరళ రాష్ట్రం లో పవిత్ర పెరియార్ నదీ తీరం లో దత్త క్షేత్రం ఉంది .పెరియార్ నది ఎర్నాకులం జిల్లాలోని వచ్చిశివాలయం వద్ద రెండు నదులుగా విడిపోతుంది .పడమరకు ప్రవహిన్చేదాన్ని దేశోం నది అంటారు .దేశోం చాలా నిదానం గా ప్రక్రుతి దృశ్యాల మధ్య ప్రవహిస్తూ ఆనందాన్ని కల్గిస్తుంది .ఇక్కడ మహర్షులు అనేక యాగాలు చేసినట్లు తెలుస్తోంది ఇక్కడే శ్రీ దత్త క్షేత్రం ఉన్నది .

ఆలువా –అన్కమల్లి హైవే లో ఈ క్షేత్రం ఉన్నది .బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మకమైన శ్రీ సిద్ధ దత్తాత్రేయ స్వామి పరశురామునికి గురువు .1991లోశ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి   ఈ క్షేత్ర  నిర్మాణం చేశారు .ఇందులో శ్రీ మహా గణపతి విగ్రహాన్ని శ్రీ కార్య సిద్ధి హనుమాన్ విగ్రహాన్ని స్వామీజీ ప్రతిష్టించారు .


176-ఏక చక్ర పురం లేక బహుధాన్య అనే బోధన్ లో అనేక  ఆంజనేయలయాలు

బోధన్ అంటే ఒకప్పటి ఏక చక్ర పురమే .బహు ధాన్య అనేది బోధన్  గా మారింది .బహుధాన్య కాలడి అంటే అత్యంత విలువైన ధాన్య సమృద్ధి అని అర్ధం .ఇక్కడ ధాన్యపు పంట విస్తారం కనుక ఆ పేరు సార్ధక మయింది .మహా భారతం లో బకాసుర వధ కధ ఈ ఏక చక్ర పురం అనే బోధన్లోని రాకాసి పేటలోనే జరిగింది .ఇక్కడే పాండవులు బ్రాహ్మణ కుమారులుగా  మారు వేషం తో తల్లి కుంతీ దేవితోఒక బ్రాహ్మణ కుటుంబం వారి ఇంట అతిధులుగా ఉన్నారు . యాయవారం చేసి పాండవులు జీవించారు .నగరానికి దగ్గరలో ఒక కొండ గుహలో బకాసురుడు ఉండేవాడు .ఊరిమీదపడి విచక్షణా రహితం గా జనాన్ని తినేస్తుంటే ఊరిజనం వాడికి  రోజూ ఆహరం పంపే ఏర్పాటు చేసుకొన్నారు..తర్వాత భీముడు ఆహరం గా వెళ్ళటం వాడిని చంపేయటం నగరానికి భయం లేకుండా చేయటం మనకు తెలిసిన కధే .

నిజామాబాద్ జిల్లాలోని ఈ బోధన్  లో షుగర్ ఫాక్టరీ ఉంది  .ఇక్కడముఖ్య మైన దేవాలయం ఏక చక్రేశ్వర దేవాలయం .ఇందులోని శివలింగం అతిపెద్దది .దక్షిణ భారతం లో ఇంత పెద్దలింగం ఇంకా ఎక్కడా లేదు అంటారు .దానితో పాటు చాలా దేవాలయాలున్నాయి .ఇక్కడి రేణుకా  దేవి దేవాలయం పన్నెండు వందల సంవత్స రాల నాటిది .కార్తికేశ్వర ,నగరేశ్వర దేవాలయాలు ప్రసిద్ద్ధమైనవే .బొజ్జ గణపతి ,లక్ష్మీ వేంకటేశ్వరాలయం చూడ దగినవి.

బోధన్ లో అనేక ఆంజనేయ దేవాలయాలు ఉండటం ఒక ప్రత్యేకత . మైన్యం మారుతీహనుమాన్   ,హనుమాన్ టెకడి , ,భుజముని గుట్ట హనుమాన్ ,ఆనందహనుమాన్ ,పెద్ద హనుమాన్ ,దక్షిణ ముఖి హనుమాన్ ,కొండెంగ హనుమాన్ ,రామ మందిర హనుమాన్, లక్ష్మీ వెంకటేశ్వర మందిర హనుమాన్ దేవాలయాలు చారిత్రిక ప్రసిద్ధి చెందిన ఆలయాలు అందరు తప్పక దర్శించాల్సినవి .

 

 

Inline image 1Image result for hanuman temples in bodhan

 

177- శ్రీ అభయాంజనేయ దేవాలయం –భద్రాచలం

ఖమ్మం జిల్లా భద్రా చలం లో శ్రీ సీతా రామ మూర్తి వారి ఆలయం జగద్విఖ్యాతమైనది .భక్త రామదాసు నిర్మించిన ఆలయం .ఇక్కదేశ్రీ రామ పాడార వినడ భక్తుడు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది యాత్రికులు తప్పక దర్శించాలి .ఒక ట్రస్ట్ ఆధ్వర్యం లో 1998లఈఆలయమ్ నిర్మించబడింది .కళ్ళు చేదిరేమార్బుల్ ఫ్లోరింగ్ ఉంది .అనేక దేవీదేవతావిగ్రహాలను సహజ సుందరం గా నిర్మించారు .మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువ ఆ రోజు స్వామికి వడమాల వేస్తారు .శ్రీరామనవమి శ్రీ హనుమజ్జయంతి లను పెద్ద ఎత్తున నిర్వ హిస్తారు .సిమెంట్ తో కట్టిన దేవాలయం అయినప్పటికీ కొయ్య తో నిర్మించినంత సున్నితంగా ఆలయనిర్మాణం ఉండటం మరో వింత .అక్తోబర్ మార్చి దాకా ఆలయంచూడటానికి మంచి సమయం .

  Inline image 2

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-15- ఉయ్యూరు

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.