-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 169-సఖీ రూప హనుమాన్ –ఝాన్సి

-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

169-సఖీ రూప హనుమాన్ –ఝాన్సి

మధ్య ప్రదేశ్ లో చారిత్రిక నగరం ఝాన్సీ లో సఖి రూపం లో శ్రీ ఆంజనేయ స్వామి దర్శన మిస్తాడు అందుకనే సఖి రూప హనుమాన్ అనే పేరొచ్చ్చింది .మిధిలా నగరం లో సీతా రాములను దాసీ లేక సఖి వేషం వేసుకొని ఒక ఉద్యానవనం లో హనుమ కలిపాదట .అదీ దీనికి నేపధ్యం అందుకే సఖి హనుమాన్ అయ్యాడు ఒళ్లంతా ఆడవేషమే .శ్రీరాముడు మెచ్చి ఒక పత్రం మీద అతన్ని ప్రశంసిస్తూర్ ఆసిన వాక్యాలు ఈ హనుమ నడుం దగ్గరకట్ట బడి ఉండటం విశేషం .దీనికె శ్రీ 1008సఖి కె హనుమాన్ అనికూడా పేరు నిలువునామాలతో స్వామి బూరెల బుగ్గలతో త లపాగా తో తమాషాగా కనిపిస్తాడు   
Inline image 1

270-కోరంటి హనుమాన్ దేవాలయం –గుల్బర్గా

కర్నాటక లో గుల్బర్గా లో అబుల్ కలాం హాస్టల్ దగ్గర శ్రీ కోరంటిహనుమాన్ దేవాలయం ఒకప్పుడు చాలా చిన్నది ఇప్పుడు బహు దొడ్డది ఐంది శని మంగళ వారాలలో కాలేజి విద్యార్ధులు విశేషంగా దర్శిస్తారు .దోడ్డప్ప అప్ప ఇంజినీరంగ్ కాలేజి దగ్గారున్న ఈ అలయాన్ని 1957లో నిర్మించారు .

 

Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట  దుర్గాప్రసాద్-30-6-15

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 268-తలకిందు (ఉల్టా )వీర హనుమాన్ –సాల్వర్

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

268-తలకిందు (ఉల్టా )వీర హనుమాన్ –సాల్వర్

మధ్య ప్రదేశ్ రాజధాని ఉజ్జయినికి 15కిలో మీటర్ల దూరం లో,ఇండోర్ కు 30కిలో మీటర్ల దూరం లో  ఉన్న సాల్వార్ లో తలక్రిందులుగా అంటే ఉల్టాగా ఉన్న శ్రీ వీర హనుమాన్ విగ్రహం ఉంది. అందుకే దీనికి ఉల్టా హనుమాన్ అంటారు .స్వామికి చిన్న కోవెల ఉన్నది .ఆంజనేయస్వామి విగ్రహం లో ముఖ భాగం మాత్రమె కనిపించటం మరో విశేషం .ఈ ఆలయం అతి ప్రాచీనమైనదని రామాయణ కాలం లో అంటే త్రేతాయుగం నటి ఆలయం అని స్థానికులు ఘనంగా చెబుతారు .అహిరావణుడు రామ లక్ష్మణులను బంధించి పాతాల లోకానికి తీసుకు వెళ్ళిన ప్రదేశం ఇదే నని అందరి నమ్మకంఈ ద్వారం గుండానే ఆంజనేయస్వామి పాతాళానికి వెళ్లి వారిద్దరినీ విడిపించుకొని తీసుకు వచ్చాడని స్థల పురాణం లో ఉంది .ఈ ఆలయం చాలా మహిమాన్వితైనది .ఆలయం చుట్టూ అనేక మహర్షుల మందిరాలున్నాయి. వారందరూ ఇక్కడికి వచ్చితపస్సు చేసినట్లు అనిపిస్తుంది .ఈ మందిరాలే దాదాపు పన్నెండు వందల ఏళ్ళ నాటివని చరిత్ర చెబుతోంది .ఆలయ ప్రాంగణం లో మర్రి ,వేప , పారిజాత వ్రుక్షాలున్నాయి .అవికాక అతిపురాతన పారిజాత వృక్షాలు రెండు ఇక్కడ ఉండటం మరో విచిత్రం .ఈ పారిజాత వృక్షం లో శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు .పారిజాత వ్రుక్షాలమీద వేలాది రామ  చిలుకలు కూర్చుని ఉండి ఆశ్చర్యం కలిగిస్తాయి .ఒకానొక బ్రాహ్మణుడు రామ చిలుక రూపం దాల్చాడని పురాణ కధనం.వీరహనుమాన్ చిలుక రూపంగా మారి గోస్వామి తులసీదాసు కు వాహనమై శ్రీరామ దర్శనం చేయించాడని అందరికి పురాణ చరిత్ర . .

శ్రీ ఉల్టా   వీర హనుమాన్ ఆలయం లో శ్రీ సీతా,రామ ,లక్ష్మణ ,పార్వతీదేవి విగ్రహాలున్నాయి .ప్రతి మంగళవారం ఉల్టా హనుమాన్ విగ్రహానికి ‘’నారింజ రంగు పూత ‘’పూస్తారు ఇది మరో ప్రత్యేకత .మూడు వారాలకొకసారి ఉల్టా హనుమాన్ ను సందర్శిస్తే సీదా గా కోరికలు నెరవేరతాయని భక్త జన విశ్వాసం .ఉల్టా స్వామిని వేలాది భక్తులు దర్శించి మనోభీష్టిని పొందుతారు.

దీనికి ఫోటోలను ఎటాచ్ చేశాను చూడండి .

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-15-ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 264—గయలో ఆంజనేయ దేవాలయాలు

— దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

264—గయలో ఆంజనేయ దేవాలయాలు

బీహార్ లోని ప్రసిద్ధ యాత్రాస్థలం గయా లో శ్రీ ఆంజనేయ దేవాలయాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకొందాం .అందులో మొదటగా చెప్ప దగినది మహా వీర్ మందిరం లోని సంకట మోచన్ హనుమాన్   దీనినే హనుమాన్ మందిర్ అంటారు  .ఎప్పుడూ భక్తుల రద్దీతో ఆలయం ఉంటుంది .మహావీరమందిరం అతి పురాతనమైనది అలాగే హనుమాన్ మందిరం కూడా .మంగళ శనివారాలలో భక్తుల సంఖ్య అసంఖ్యాకం గా ఉంటుంది .శ్రీరామ నవమి నాడు మహావీర్ ,సంకతమోచన్ హనుమాన్ లను దర్శించే క్యూ కనీసం కిలోమీటర్ పొడవు ఉంటుంది .

Mahavir Mandir.jpg

265-102 అడుగుల ఆగార హనుమాన్ దేవాలయం –బెంగళూర్

కర్నాటక లోని  బెంగళూర్ లో ఆగ్నేయ భాగం లో అందమైన ఆగారా సరస్సు ఉంది దాని దగ్గరే శ్రీ ఆగారా ఆంజనేయ స్వామి 102అడుగుల భారీ విగ్రహం ఉంది .ఇటీవల ఏర్పడినదే .ఇక్కడే ఉన్న జగన్నాధ స్వామి దేవాలయమూ దర్శించ తగినదే .ఈ రెండు ఆలయాలు చిన్నవే కాని బయటఉన్న  హనుమ విగ్రహం బృహత్తర రూపం .స్వామి పద్మం లో నిలబడి తూర్పు ముఖంగా ఉండటం ప్రత్యేకత .  .ఉదయం పూట స్వామి ముఖం దీదీప్యమానంగా ,మధ్యాహ్నం వెనుకభాగం కాంతి వంతంగా కనిపిస్తుంది .ప్రక్కనే నాగదేవతలు ఉంటారు .ఈ భారీ హనుమాన్ ముందున్న చిన్న దేవాలయాన్ని ‘’సీతారామ భక్త హనుమంత దేవాలయం ‘’అనిపిలుస్తారు .భారీ విగ్రహం వెనుక మరో ఆంజనేయ దేవాలయం ఉంది .

hanuman-front-2  hanuman-front-temple

hanuman-back-temple

 

 

266-కార్య సిద్ధి హనుమాన్ –మైసూర్

కర్నాటక లోని మైసూర్ లో 41 అడుగుల ఏక శీలా  శ్రీ కార్య సిద్ధి హనుమాన్ విగ్రహాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 26-12-2012న  ఆవిష్కరించారు .విగ్రహం తయారీకి రెండు కోట్లు ఖర్చయింది విగ్రహ శిల ఆంద్ర ప్రదేశ్ లోని పులివెందల దగ్గరున్న మేల్లెల గ్రామం కు చెందినది అక్కడే సగం పైగా విగ్రహ నిర్మాణం చేయించి 90 చక్రాల భారీ వాహనం పై ఇక్కడికి తెచ్చి విగ్రహం పూర్తిగా మలిచారు .ముఖ్య స్థపతి శ్రీ సుబ్రహ్మణ్య ఆచార నేతృత్వం లో శిల్పులు పది నెలలు కష్టించి తయారు చేశారు . అష్ట దళ ఆకారం ఉన్న వేదికపై శ్రీ కార్య సిద్ధి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు  విగ్రహం 200 టన్నుల బరువు ఉంది .

The 41-ft. statue will be consecrated on the Sri Ganapathi Sachidananda Ashram premises on December 26.— Photo: M.A. SRIRAM

267- శ్రీ కోటే ఆంజనేయస్వామి దేవాలయం –షిమోగా

కర్ణాటకలో కేలడి వంశానికి చెందిన  .శివప్పనాయకుడు 16 వ శతాబ్దం లో పాలించిన ప్రదేశమే షిమోగా లేక శివ మొగ్గ .ఇక్కడే పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది .ఇదే కోటే హనుమాన్ ఆలయం .దీని చరిత్ర త్రేతా యుగం నాటిది. రామాయణం తో సంబంధం ఉంది. హనుమ సంజీవిని పర్వతం  తెచ్చే కద తో ముడిపడి ఉంది .ఇది పెద్ద దేవాలయం భారీ సింహ ద్వారం ఉంది .తుంగా నది తీరం లో ఆలయం ఉంటుంది .ఇక్కడ దూర్వాస మహర్షి తపస్సు చేశాడు .అందుకనే దీన్ని ‘’దూర్వాస క్షేత్రం’’ అంటారు .Inline image 1

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 262-శ్రీ గేజేటేడ్ హనుమాన్ దేవాలయం –జై సల్మీర్

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

262-శ్రీ గేజేటేడ్  హనుమాన్ దేవాలయం –జై సల్మీర్

రాజస్థాన్ లో  అందమైన పట్టణం జై సల్మీర్ .అక్కడ పాత పవర్ హౌస్ లోపల  శ్రీ గెజేటేడ్ ఆంజనేయ దేవాలయం ఉన్నది .ఇది హనుమాన్ సర్కిల్ కు అతి సమీపం లో ఉంది .ఆలయ పునర్ నిర్మాణం  భారీ ఎత్తున జరుగుతోంది

Image result for hanuman temple at jaisalmer

ఇది పాత దేవాలయం

263-పంకీ హనుమాన్ దేవాలయం –కాన్పూర్

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో భాగమైన పంకిలో ఉన్న హనుమాన్ దేవాలయం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది .చాలా ఎత్తు  మీద ఉన్న ఈ ఆలయం కు వెళ్ళాలంటే కస్టపడి వెళ్ళాల్సిందే .ప్రస్తుతం  పెద్ద పెద్ద కు౦భాలతో  భారీ నగిషీలతో ఆలయ నిర్మాణం జరుగుతో౦ది .ఆలయానికి సుమారు 400 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది .మహాంత్ శ్రీ శ్రీ 1008పురుషోత్తం దాస్ మహారాజ్ ఈ ఆలయాన్ని మొదట గుర్తించారు .కన్హాపూర్ గా పిలువ బడే నేటి కాన్పూర్ పట్టణ నిర్మాణాన్ని ప్రారంభించిన రాజా హిందూ సింగ్ కాలం కంటే పూర్వపు ఆలయం ఇది.ఒకప్పుడు పురుషోత్తం మహా రాజ్ గారు చిత్ర కూటం లో పర్యటిస్తూ ఇటువైపువచ్చి ఇక్కడ ఒక రాయికి కాలుతగిలి తూలీ పడ బోయారు .తీరా చూస్తె అది శ్రీ ఆంజనేయ స్వామి .స్వామి మహిమగా దీన్ని భావించి తనతోబాటు ఆ విగ్రహాన్ని తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు .బండీ మీద ఎక్కించి తీసుకోస్తుండగా ఈ ప్రాంతానికి రాగానే ఎడ్లకు విగ్రహం బాగా బరువనిపించి అడుగులు నెమ్మదిగా వేస్తున్నాయి. గ్రహించిన మహంత్ ఆ రాత్రికి అక్కడ విశ్రమించారు .మహంత్ కు ఆంజనేయ స్వామి దివ్య లీల అని తెలిసి స్వామికి ఇక్కడే ప్రతిష్ట చేయటం ఇస్టమని  అర్ధం చేసుకొని  అందరి సహాయం తో విగ్రహాన్ని బండీ మీద నుంచి  అక్కడే ప్రతిష్ట చేశారు మహంత్ .ఈ ప్రదేశమే పంకి .ఇది బితూర్ లోని  వాల్మీకి ఆశ్రమానికి దగ్గరలోనే ఉంది .

భక్తులు ఈ హనుమాన్ నే పూజించేవారు. కాలక్రమం లో చిన్న దేవాలయం ఏర్పడింది .ఇదే పంకి హనుమాలయం .ఇప్పుడు చాలా ప్రసిద్ధ ఆలయం గా పేరు పొందింది .స్వామికి నివేది౦చుకొన్న కోర్కెలన్నీ తీరుతాయి అనే భావం బల పడింది .క్రమేపీ దేశం లోని భక్తులంతా పంకి హనుమాన్ ను దర్శించి తమ పాప పంకి లాన్ని దూరం చేసుకొంటున్నారు .ఉత్తర భారత దేశం లో ఈ ఆలయానికి ఒక విశిష్ట స్థానమేర్పడింది .ఇక్కడ విద్యుత్ఉత్పత్తి కేంద్రం వచ్చింది.గన్ ఫాక్టరీ కూడా  రావటం తో పంకి వైభవం అనేక రెట్లు పెరిగింది .

Inline image 1   Inline image 2Inline image 3

సశేషం

మీ- గబ్బిట  దుర్గా ప్రసాద్ -24-6-15-ఉయ్యూరు

 

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 259-శ్రీ బాలాజీ హనుమాన్ మందిరం –రాజ కోట్

—  దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

259-శ్రీ బాలాజీ హనుమాన్ మందిరం –రాజ కోట్

గుజరాత్ రాష్ట్రం లోని రాజ కోట్ లో భూపేంద్ర నగర్ లో శ్రీ బాలాజీ హనుమాన్ మందిరం ఉంది .ఇందులో హనుమ బాల హనుమగా అనేక భంగిమలలో ఎక్కడా లేని విధం గా కనిపిస్తాడు .ఎడమ చేయి కిందికి ఉండి కుడి చేయి పైకెత్తి  శిరసు దగ్గర గదా దారి గా కనిపిస్తాడు .విగ్రహం చుట్టూ చిన్న చిన్న ఆంజనేయ మూర్తులు ,పాదాలకింద రాక్షసి జుట్టు పట్టుకొన్నట్లు ఉంటాడు .స్వామికి వివిధ రకాల స్వీట్ల నైవేద్యం పెడతారు ఆహార్యం కూడా వింతగా ఉంటుంది .నుదుట బొట్టు తో మీసాలతో తలపై వెండి కిరీటం తో దర్శన మిస్తాడు బాలాజీ హనుమాన్ .డాలు  కత్తీ  గదా లను అలంకారం చేసినప్పుడు పెడతారు

260- దాబోదియా హనుమాన్ దేవాలయం –గాంధీనగర్

గుజరాత్ రాజధాని గాంధీ నగరానికి 18కిలో మీటర్ల దూరం లో దాబోదా వద్ద హనుమాన్ దేవాలయాన్ని దాబోదియా హనుమాన్ దేవాలయం అంటారు .ఈ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది .చాలాకాలంగా ఉన్న విడాకుల వివాదం స్వామి దర్శనం తో నిలిచిపోతుంది .కుటుంబం లో అశాంతి ఉంటె ,ఆడ పిల్లకు పెళ్లి కాక పోతే  స్వామికి మొక్కుకొని దర్శిస్తే అన్నీ సవ్టంగా అయిపోతాయి .వివాహం ఆలస్యమౌతున్న అబ్బాయి రెండు శనివారాలు ఈ హనుమాన్ ను దర్శిస్తే వెంటనే అనుకూల వతి అయిన అమ్మాయి తో పెళ్లి అయిపోతుంది అని నమ్మకం .పిల్లలు విపరీత వింత ఆకారాలలో జన్మిస్తే ఈ ఆంజనేయ స్వామి వరుస దర్శనాలతో ఆ వక్ర్తతలన్నీ సర్దుకుంటాయి అని విశ్వాసం .

 

Image result for hanuman temple gandhinagar -gujarat

261-ఖేదపతి హనుమాన్ దేవాలయం –గ్వాలియర్

మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లోని గాంధీనగర లో  సర్వ సిద్ధి శ్రీ ఖేదపతి హనుమాన్ మందిరం ప్రసిద్ధమైనది .ఈ ప్రాంతం లో ఎన్నో దేవాలయాలు ఉన్నా ఈ హనుమాన్ కున్న ప్రశస్తి ఎవరికీ లేదు .బాగా రద్దీ గా ఉండే నగర౦  మధ్య లో ఈ ఆలయం ఉంది .సింధూర శారీరి అయిన ఈ హనుమాన్ దర్శనం ఒక అలౌకికానుభావం అని అనిపిస్తుంది .స్వామి విశాలమైన కనులలో కరుణ జాలువారుతుంటుంది .స్వామి శిరసుపై ఉన్న రత్న ఖచిత రజత కిరీటం మరింత శోభాయ మానం గా ఉంటుంది .విలువైన ఆభరణాలు దుస్తులతో స్వామి మెరిసి పోతూ ఉంటాడు .

గ్వాలియర్ లోని ఈ ఖేదపతి హనుమానాలయ నిర్మాణం జరిగి 1000 ఏళ్ళు అయినట్లు చా రిత్రాకాదారాలున్నాయి .మొదట్లో ఈ హనుమా ఆలయం ఒక రావి చెట్టు కింద ఉండేది తరువాత భక్తులు విశాల మైన ప్రాంగణం లో అందమైన పెద్ద ఆలయాన్ని నిర్మించారు .నిత్యం వేలాది భక్తుల సందర్శనం తో ఆలయం కిట కిట లాడుతుంది .హనుమాలయం ప్రక్కనేసీతా  రామ లక్ష్మణ విగ్రహాలనూ ప్రతిష్టించారు .హనుమ  పాదాల చెంత కూర్చుంటే ఎంతో ప్రశాంత త లభిస్తుంది .ఇప్పుడు ఇది ఒక టెంపుల్ కాంప్లెక్స్ గా పరిణామం చెందింది

Inline image 2

Visit to 1000 year old Khedapati Temple in Gwalior (14)

.Visit to 1000 year old Khedapati Temple in Gwalior (23)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-15 –ఉయ్యూరు

 

 

 

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 258-శ్రీ జయ వీర హనుమాన్ దేవాలయం –మదురై

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

258-శ్రీ  జయ వీర  హనుమాన్  దేవాలయం –మదురై

నదిలో దొరికిన హనుమ

తమిళనాడు లోని దేవాలయ నగరమైన మదురైలో  శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి దేవాలయం జగత్ప్రసిద్ధమైనది .మదురైకి సమీపం లో సిమ్మకాల్ లో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ప్రాముఖ్యమైనది .అక్కడ కుజాంత ఆనంద స్వామి అనే యోగి ఉండేవారు .ఆయనను మీనాక్షీ అమ్మవారి కుమారుడుగా అందరూ భావించేవారు .అందుకే ‘’కుజంత ‘’స్వామి అనే పేరొచ్చింది ఆయనకు తమిళం లో కుజాంతం అంటే పిల్లాడు అని అర్ధం .వైగై నదికి ఉప నది అయిన కృతమాల నది ఒడ్డున కుటీరం నిర్మించుకొని ఆయన ఉండేవారు .జపం తో జీవితాన్ని ధన్యం చేసుకొనేవారు .ఆయన అవసారాలను కనిపెట్టి స్థానికులు కుజంత స్వామికి అన్నీ అమర్చే వారు .ఒక రోజు ఆ గ్రామస్తులందరి కలలో శ్రీ ఆంజనేయ స్వామి దర్శన మిచ్చి తాను కృతమాల నదిలో ఉన్నానని తనను బయటికి తీసి ప్రతిష్టించి ఆలయం నిర్మించమని కోరాడు .

విగ్రహ ప్రతిష్ట తర్వాత పెరుగుతున్న చెట్టు

వారికి ఏమీ పాలు కాక కుజంత స్వామికి విన్న వించారు .ఆయన వారు స్వామి సాక్షాత్కారం పొంది ధన్యులయ్యారని  చెప్పి ,వారందరిని స్వామి వారికి తాను ఉన్నానని చెప్పిన చోటికి వెళ్లి నదిలో వెతికారు .మొదటగా శ్రీ నరసింహ స్వామి విగ్రహం లభించింది .ఆ తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి ,శ్రీ లక్ష్మి ,శ్రీ గణేష్ ,గరుడ విగ్రహాలు దొరికాయి .స్వామి ఆజ్ఞ తో స్వామీజీ నేతృత్వం తో ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని‘’ఎలుప్పై చెట్టు ‘’(స్థాలవృక్షం )క్రింద స్వామీజీ ప్రతిష్టించారు . అక్కడే దొరికిన మిగిలిన విగ్రహాలనూ ప్రతిష్టించారు .అప్పటి నుంచి ఆ చెట్టు బాగా ఎదగటం ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది .

ఆలయ సముదాయం

ఈ రోజు ఆలయం చాలా పెద్దగా ఉంది .విశాలమైన గర్భ గృహం పెద్ద దర్వాజా ఆకర్షణీయం గా కనిపిస్తాయి .ఆలయం డోమ్ మీద శ్రీరామ దర్బార్ చూడ ముచ్చటగా ఉంటుంది .గర్భ గృహం లో బయటి చెట్టు భాగం లోపలి వచ్చి ఉంటుంది దానికిండానే ఆంజనేయ స్వామి విగ్రహం దర్శన మిస్తుంది .స్వామికి కుడి వైపున యోగ నరసింహ స్వామి ,లక్ష్మీదేవి గరుడ విగ్రహాలుంటాయి .రెండు గణపతి విగ్రహాలు గర్భ గుడి గోడలకు దగ్గరగా ప్రతిస్తింప బడ్డాయి .ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి .ఆలయ ఆవరణలో విష్ణు, దుర్గా ,సుదర్శన స్వాముల ఆలయాలున్నాయి .పెరుగుతున్న స్థాల వృక్షం కింద  శ్రీ జయ వీర ఆంజనేయ స్వామి మహా వైభవం గా ఉంటాడు .

జయ వీర హనుమాన్ ప్రత్యేకత

శ్రీ జయ వీర హనుమాన్ రెండున్నర అడుగుల ఎత్తు విగ్రహం .ఎడమ చేయి పై కెత్తి నట్లుంది .దానిలో సంజీవిని పర్వతాన్ని కలిగి ఉంటాడు .కుడి చేయి తొడపై ఆనించి గదా దారిగా ఉంటాడు .నడుముకున్న బెల్టు నుండి  కత్తి వేలాడుతూ ఉంటుంది .తోకకు చివర చిన్న కొండ ముడి వేయ బడి ఉండటం విచిత్రం .దానిపైన ఒక గంట కట్టబడి ఉంటుంది .ఆయన నిలుచున్న భంగిమ చూస్తుంటే శ్రీ రాముడి ఆజ్ఞ వినగానే ముందుకు ఉరికి ,ఆయన భక్తుల ,తన భక్తుల కోరికలుతీర్చటానికి బయలు దేరుతున్నట్లు అనిపిస్తుంది . కనులలో దీర్ఘ కటాక్షం గోచరిస్తుంది .

అభిషేకం చేయగానే వృద్ధ మూర్తిగా మారటం

అభిషేకం చేయగానే స్వామి ‘’వృద్ధ మూర్తి’’ గా దర్శన మివ్వటం ఒక గొప్ప వింత .జూలై ఆగస్ట్ లలో మొదటగా కనిపించిన నరసింహ స్వామి ఉత్సవాలు 15 రోజులు ఘనం గా నిర్వహిస్తారు .అన్ని రోజుల్లో ఆంజనేయస్వామికి రోజుకొక అలంకారం చేస్తారు.అందులో ‘’వృద్ధ వేష అలంకారం’’ కూడా ఉండటం మరో విశేషం .ఆంజనేయ స్వామి ప్రక్కన గరుడ స్వామి కూడా ఉండటం ఇంకొక ప్రత్యేకత .ఈ ఆలయం శివ కేశవులకు భేదం లేదని తెలియ జెప్పే గొప్ప సంస్కృతికి నిలయం .

Sri Jaya Veera Anjaneya, Simmakal, MaduraiSri Jaya Veera Anjaneya Temple, Simmakal, Madurai

సశేషం

మీ –గబ్బిట దుర్గా రసాద్ -23-6-15 –ఉయ్యూరు

 

 

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 257 – నది నీటిలో దొరికిన 6 అడుగుల ఆంజనేయ విగ్రహం –పూనే

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

257 – నది నీటిలో దొరికిన 6 అడుగుల ఆంజనేయ విగ్రహం –పూనే

మహారాష్ట్రలోని పూనే లో మూతా నదిలో సంగం బ్రిడ్జి దగ్గర  నానాపేట్ లో 2010నవంబర్ నెల లో 250 ఏళ్ళ 6 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం లభించింది .జవహర్ లాల్ నెహ్రు నేషనల్ అర్బన్ రెన్యూవల్ ప్రాజెక్ట్ కింద పూనే మునిసిపల్ కార్పోరేషన్ వారు ఈ నదిని శుభ్రం చేస్తుంటే ఈ భారీ హనుమాన్ విగ్రహం దొరికింది .పొడవు ఆరు అడుగులు ఉంటె వెడల్పు మూడున్నర అడుగులు ఉంది .పురావస్తు శాఖకు చెందిన అధికారులు పరీక్షించి ఈ విగ్రహం  250సంవత్సరాలకు పూర్వపు విగ్రాహం అని తేల్చారు .ఈ విగ్రహం నది నీటిలో,  పది అడుగుల లోతున పూడిక లో ఉండి పోయింది .మూతా నది ఒడ్డున అనేక ప్రాచీన దేవాలయాలున్నాయి.ఇలాంటి భారీ ఆంజనేయ విగ్రహాలు పూనే లో ఆరు ఉన్నాయని చెప్పారు .పాషాణ్ లోని సోమేశ్వర దేవాలయం లో అచ్చం గా ఇలాంటి విగ్రహమే ఒకటి ఉందట . కాని ఇప్పుడు చెప్పుకొన్న మూతానది లో దొరికిన హనుమాన్ విగ్రహం ఈ ఆరు విగ్రహాలలో అత్యంత సుందరమైన విగ్రహం గా తెలియ జేశారు .ఈ మారుతి కుడి వైపుకు తిరిగి ఉంటాడు .చాతీమీద బాకు ఉంటుంది .తోక చివర గంట ఉంటుంది శంఖాన్ని కూడా ధరించి ఉంటాడు .ఈ విశేషాలను బట్టి ఈ హనుమాన్ ను యుద్ధ సైనికులు ధైర్యోత్సాహాలకోసం  అర్చి౦చేవారని అంటున్నారు .ఇలాంటి విగ్రహాలు సాధారణం గా రాజుల కోటలలో ఉంటాయి .గణేష్ ఖిండి లో ‘’చతుశ్రుంగి’’దేవాలయం లో అచ్చంగా ఇలాంటి ఆంజనేయ విగ్రహమే ఉంది .

Inline image 1

సశేషం 

మీ-గబ్బిట  దుర్గా ప్రసాద్ -23-6-15 –  ఉయ్యూరు