Category Archives: Uncategorized

ఉసిరి చెట్టు కింద అభిషేకం ,సత్యనారాయణ వ్రతం 

ఉసిరి చెట్టు కింద అభిషేకం ,సత్యనారాయణ వ్రతం

 ఉయ్యూరులో మా పెరటి లోని ఉసిరిచెట్టు కింద 16-11-17 గురువారం కార్తీక బహుళ త్రయోదశి నాడు ఉదయం 8 గంటలకు మా చే  శ్రీరుద్రాభిషేకం అనంతరం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక వన భోజనం ఏర్పాటు చేయబడినది -దుర్గాప్రసాద్
Inline image 5

— Inline image 2Inline image 3Inline image 4

ప్రకటనలు

6-12-15 ఆదివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో రెండవ రోజు శ్రీ సుందర కాండ పారాయణ మరియు శివాలయం లో శ్రీ జగదాంబా సమేత సోమేశ్వర స్వామి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యం లో వనభోజనాలు చిత్రమాలిక 

6-12-15 ఆదివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో రెండవ రోజు శ్రీ సుందర కాండ పారాయణ  మరియు శివాలయం లో శ్రీ జగదాంబా సమేత  సోమేశ్వర స్వామి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యం లో వనభోజనాలు చిత్రమాలిక

 

http://wp.me/p1jQnd-96e

బ్రహ్మతత్త్వ చైతన్య స్వరూపం

Added At : Sat, 03/21/2015 – 23:53

రామతాపనీయ ఉపనిషత్తులో ఈ కింది శ్లోకం ఉంది.
చిన్మయస్యాద్వితీయస్య నిష్కలస్యాశరీరిణ:|
ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూప కల్పనా||
అద్వితీయమైన బ్రహ్మతత్త్వం కేవలం చైతన్య స్వరూపమైనది, ఎలాంటి అవయవాలు, శరీరం లేనిది అయినా ఉపాసకులు తమ కోరికల సిద్ధికొరకు ఏదో ఒక రూపాన్ని కల్పిస్తారు అని దీని అర్థం. మరొక స్మృతిలో ఇలాంటి శ్లోకమే ఉంది.
అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృదిదైవతం|
ప్రతిమా స్థూలబుద్ధీనాం సర్వత్ర విదితాత్మనామ్‌||
ద్విజులందరూ అగ్నిని (యజ్ఞం)లో ఆరాధించేవారు. మునులు తమ బుద్ధిలోనే దేవుణ్ణి ధ్యానిస్తారు. మందబుద్ధి కలవారికి ఒక ప్రతిమ కావాలి. జ్ఞానులైతే సర్వత్రా బ్రహ్మనే చూస్తారు అని దీని అర్థం. దేవుని తత్త్వాన్ని ఆలోచించే ఓపిక లేక ఏదో కోరికలతో తృప్తిపడే మామూలు మనుషు లకు ఒక ప్రతిమ కావాలి. ఈ విధంగా విగ్రహాన్ని ఆరాధించడం అనే ఆచారం వచ్చింది.
విగ్రహం అంటే విశేషంగా గ్రహించడం అని అర్థం. దేవుణ్ణి గూర్చిన భావనే విగ్రహంగా మారుతుంది. ిఠ| d|శ ుౌ గుd శి|-ుప| షఠ| dు ుౌ గుd. ఇదొక ఆధ్యాత్మిక సాధనం.
ఉపనిషత్తుల్లో విగ్రహారాధన గూర్చి చెప్పలేదు. అంటే బహుశా ఇది తరువాతి కాలంలో లేదా ఇతర సంప్రదాయాలనుంచీనో వచ్చిన ఆచా రం. బుద్ధుడు క్రీ.పూ. 6వ శతాబ్దికి చెందిన వాడు. అలాగే వర్ధమాన జైనుడు కూడా. బుద్ధుడు కేవల విజ్ఞానవాదాన్ని చెప్పాడు. వైదిక ఆచారాల్ని, పూజిల్ని సమర్థించలేదు.
అయినా కాలరక్రమేణా బౌద్ధులే అతిపెద్ద బుద్ధ విగ్రహాన్ని స్థాపించడం చరిత్రలో చూడగలం (ఉదా హరణకు ఇటీవల ఆఫ్గనిస్తాన్‌లో ప్రపం చంలోనే మిక్కిలి పెద్దవైన బుద్ధస్తూపాల్ని తాలి బాన్లు ధ్వంసం చేయడం చూశాం.) అలాగే జైనులు కూడా అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించారు. (శ్రావణ బెళగొళ మొదలైనవి). ఈ ఆచారం బహుశా హిందువులపై ప్రభావం చూపి ఉండ వచ్చు.
మనుషులకన్న అపారమైన కోరికలు కూడా ఒక కారణం. శ్రీకృష్ణుడు నిర్మొహమాటంగా చెపుతాడు – కామై: తై: తై: హృతజ్ఞానా: ప్రపద్యంతేన్య దేవతా: పూజిస్తూ ఉంటారు అని అర్థం. ఒకరి పూజాగదిలో ఇరవై దేవతా చిత్రాలుంటే ఆ వ్యక్తి అన్ని కోరికలతో ముడిపడి ఉంటాడని అర్థం. కోరికల్ని క్రమక్రమంగా వదిలేయాలని వేదాంతం చెబుతుంది. అయినా నడిరేయి ఏ జాములోనైనా దేవుణ్ణి దిగి రమ్మని కోరడం, అమ్మవారు అయ్యవారి ఒడిలో పడుకొని ఉన్న సందర్భంలో కూడా ‘విభునకు నా మాట వినిపించమ్మా’ అని కోరడం మనిషి మనస్తత్వం.
సనాతన ధర్మం వీటిని ఖండించలేదు కాని ప్రతి సందర్భం లోనూ ఈ స్థాయి నుండి పైకి ఎదగాల్సి ఉందని మనిషికి చెబుతుంది. దేవుళ్ల కల్యాణాలు చేయడం చూస్తుంటాం. మామూలు మనిషికి అదంతా ఒక వినోదంగానూ, సమా జంలో అందరూ కలవడానికి ఒక సందర్భం గానూ కనిపిస్తుంది. కానీ పెళ్లి సమ యంలో దేవుడి స్వరూపాన్ని, అమ్మవారి స్వరూపాన్ని చెప్పే వర్ణనలు చూస్తే ఈ వినోదం వెనుక వేదాంత పర మైన బోధన ఉందని మనకు తెలు స్తుంది. అయ్య వారు అంటే శుద్ధచైతన్యమే.
అమ్మ వారు అంటే మాయాశక్తి. దీనివల్లనే సృష్టి ఏర్పడింది. శ్రీనివాసుడు అంటే లక్ష్మి (సంపద) అనే శక్తి కలవాడు. భూమిని పోషిస్తాడు కాబట్టి భూమి (భూదేవి) అతనికి భార్య అని చెప్పబడింది. ఇలాగే శివపార్వతీ కల్యాణం, లేదా మరే కల్యాణమైనా. వివిధ స్థాయిలో ఉన్నవారికి ఆయా స్థాయిల్లో అర్థం చేసుకొని ఆనందించే రీతిగా మన ఆచారాలు, పూజలు ఏర్పడ్డాయి.
ఏదో ఒకరకమైన ప్రతీక (ాాప శిు) ను పూజించడం అన్ని మతా ల్లోనూ చూస్తుంటాం. క్రైస్తవులు శిలువ గుర్తును పవిత్రంగా భావిస్తారు. ఇస్లాంలో మతగ్రంథాన్ని, మతానికి చెందిన ఎలాంటి ప్రతీకనైనా అతి పత్రంగా భావిస్తారు. వాటికి ఏ అపచారం జరిగినా అల్లకల్లోకం జరగడం చూస్తాం. కేవలం హిందుమతం వారినే విగ్రహారాధకులనడం చాలా తప్పు.
అవును పూజించడం -ఇది కూడా ఇతరులు మనల్ని హేళన చేసే విషయాల్లో ఒకటి. ఒకప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసే కాలంలో ఆవుపాలు, పెరుగు, నేయి యజ్ఞానికి అవసరమైన సంబరాలు. పురాణాల్లో అనేకచోట్ల గోపూజ చెప్పబడింది. దేవలోకంలో ఉన్న కామధేనువు అనే ఆవు కోరిన కోర్కెలన్నింటినీ తీర్చేదని పూజింపబడుతుంది. కాళి దాసు వ్రాసిన రఘువంశం అనే కావయంలో కూడా దిలీప మహారాజు ఈ కామధేనువు కూతుర్ని పూజించడం గమనిస్తాం.
ఆవును ఈ విధంగా ఒకపవిత్ర మూర్తిగా చూసే సంప్రదాయం ఏర్పడింది.ఆవునే కాకుండా సనాతన ధర్మంలో భూమిని, కొన్నిరకాల చెట్లని, పుట్టల్ని కూడా పూజిస్తాం. అనేక పురాణాల్లో వీటిని గూర్చిన కథలున్నాయి. ఉదయం లేచి నేలపై అడుగు పెట్టేట ప్పుడు భూమాతపై కాలు పెడుతున్నందుకు క్షమించమని సాంప్రదాయి కులు ఒక ప్రార్థన చేస్తూంటారు. నదీ స్నానం చేసేటప్పుడు ఆ నదిని తన శరీర మలంతో అప విత్రం చేస్తున్నందుకు క్షమించ మని కోరుతాం. ఇంటికి శంకుస్థాపన చేసే సమ యంలో భూమిని తవ్వుతున్నందుకు భూమాతను క్షమాపణ కోరుతాం. చివరకు చెట్టు నుండి కొమ్మను నరికే సందర్భంలో కూడా వేదం లోని ఒక మంత్రం ఉచ్చరిస్తూ దాన్ని నరికి యజ్ఞా నానికి వాడతారు. ప్రకృతిని గౌరవించడం భార తీయ సంప్రదాయంలో ఒక ముఖ్యవిషయం. గ్రామీణ ప్రాంతాల్లో ఈనాటికీ ఈ అలవాట్లను చూడగలం.

ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జనమదినోత్సవ వేడుక -ఉయ్యూరు శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం -10-1-15 శనివారం సాయంత్రం 6-30 గం లకు

 

ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జనమదినోత్సవ వేడుక -ఉయ్యూరు శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం -10-1-15 శనివారం సాయంత్రం 6-30 గం లకు

శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి , నూతన ఆంగ్ల సంవత్సరం -ఉత్తర ద్వారా దర్సనం, లడ్డూ పూజ

కృష్ణాజిల్లా ఉయ్యూరు లోని శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి , నూతన  ఆంగ్ల సంవత్సరం సందర్భంగా గురువారం నాడు స్వామి వార్లకు ఉత్తర ద్వారా దర్సనం, లడ్డూ పూజ ప్రత్యేకంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గబ్బిట  దుర్గాప్రసాద్ ,ప్రభావతి దంపతులు విశేష కార్యక్రమాలలో వేకువఝామున 4 గంటలు నుండి పాల్గొన్నారు. ఆలయానికి భక్తులు పోటెత్తారు .