దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 278-శ్రీ బెనకాన హళ్లి ఆంజనేయ దేవాలయం –దేవగిరి

దర్శనీయ  ఆంజనేయ  దేవాలయాలు -2

278-శ్రీ బెనకాన హళ్లి ఆంజనేయ దేవాలయం –దేవగిరి

ఆంద్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దేవగిరి గ్రామానికి దగ్గరలో శ్రీ బెనకాన హళ్లి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది .ఇది మహిమాన్విత క్షేత్రం. వ్యాస రాయ ప్రాతిష్టితం.  అంటే సుమారు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఆలయం .మంగళ శనివారాలలో పూజలు బాగా జరుగుతాయి .శ్రావణ కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలుంటాయి .శ్రావణ మాసం మూడవ వారం లో ‘’జెల్ది ‘’అనే కార్య క్రమాన్ని కన్నుల పండువుగా చేస్తారు .అన్నదానమూ ఉంటుంది .వేల సంఖ్యలో  భక్తులు పాల్గొని తరిస్తారు .ఈసమయం లో కర్నాటక భక్తుల  సంఖ్య బాగాఎక్కువ .

మార్గ శిర శుద్ధ త్రయోదశినాడు శ్రీ హనుమద్ వ్రతాన్ని చేస్తారు .వైశాఖ బహుళ దశమి నాడు శ్రీ హనుమజ్జయంతిని వైభవోపేతం గా నిర్వహిస్తారు .ఆలయం చుట్టూ వరి పండే పొలాలున్నాయి .తుంగ భాద్రానదికాలువ ఆలయం ముందే ఉండటం తో దీని పవిత్రత  ద్విగుణీక్రుతమైంది .ఆహ్లాదమైన వాతావరణం లో ఆలయం ఉండటం తో భక్తులు మానసిక ప్రశాంతతను పొందుతారు .హనుమాలయానికి నైరుతిలో శ్రీ కొల్హాపురీ దేవి ఆలయం తప్పక దర్శించాలి .పడమర పురాతన శివాలయం ఉన్నది .ఆగ్నేయం లో శమీ వృక్షం ,నాగ విగ్రహాలున్నాయి .ఈ ఆంజనేయ దేవాలయం లో పంచ రాత్ర ఆగమ విధానం లో పూజాదికాలు జరుగుతాయి .

 

Inline image 5Inline image 6

 

279–పంచముఖి హనుమాన్ దేవాలయం –కటక్

ఒరిస్సా లో కటకం అని పూర్వం పిలువ బడిన కటక్ లోని  కన్నగార్ లో  శ్రీ పంచముఖి ఆంజనేయ దేవాలయం ఉన్నది .కతాజోది నదీ తీరం లో ఉన్నది .వందేళ్ళ చరిత్ర ఉన్న ఆలయం . ఆంజనేయుని తో బాటు  శ్రీరామ సీతా లక్ష్మణ స్వాముల విగ్రహాలూ ఉన్నాయి .మహి రావణ సంహారానికి హనుమ పంచ ముఖాలతో ఉన్నాడని మనకు  తెలిసిన విషయమే .పంచముఖి హనుమాన్ స్తోత్రం చదువుతూ స్వామిని దర్శిస్తే సకల మనోరదాలు ఈరేడుతాయి .

‘’పంచాస్య చూత మనేక విచిత్ర వీర్యం –శ్రీ శంఖ చక్ర రమణీయ భుజాగ్రదేశం

పీతాంబరం మకర కుండల నూపురాంగం –ధ్యాయేతి తం కపివరం హృది భావనం

. 280-సంకట మోచన హనుమాన్ దేవాలయం –భద్రక్

ఒరిస్సాలో భద్రక్ వద్దవాసుదేవ పూర్ లోని  శ్రీ సంకట మోచన హనుమాన్ దేవాలయం బాగా ప్రసిద్ధమైనది .అక్కడే పల్లి హనుమాన్ మందిరం కూడా దర్శనీయ దేవాలయమే .

Inline image 3  Inline image 4

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.