Daily Archives: జూలై 4, 2015

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 271-భారీ బడ్జెట్ తో భారీ హనుమాన్ –అంగల్లు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

271-భారీ బడ్జెట్ తో భారీ హనుమాన్ –అంగల్లు

చిత్తూరు జిల్లా మదన పల్లి దగ్గర  అంగల్లు గ్రామం లో 6కోట్ల రూపాయల ఖర్చు తో24అడుగుల  భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించారు . ఆరు కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్ట్ ను సంకల్పించింది అతి సామాన్యుడైన వ్యక్తీ శ్రీ కోసూరి విశ్వనాధం .ఆయన తాతగారుశ్రీ రాజ రత్నం పిళ్లే ,తండ్రి పరమ శివం పిళ్లేలు దగ్గరలోనే ఉన్న రిషీవాలీ స్కూలు నిర్మాణం పనులు చేసేవారు.విశ్వనాధం మోటారు పంపుల డీలర్ .  పదేళ్ళ క్రితమే విశ్వనాధం గారికి శ్రీ ఆంజనేయ దేవాలయం నిర్మించాలనే సంకల్పం కలిగింది .అనంతపురం హైవే రోడ్ లో ఒక ఎకరం స్థలం కొన్నాడు .

రియల్ ఎస్టేట్ బూమ్ బాగా ఉండటం తో కొన్న స్థలం లో కొంత స్థలాన్ని చాలా ఎక్కువ రేటుకు అమ్మి ఆడబ్బుతో తన దేవాలయ నిర్మాణ కల సార్ధకం చేసుకోవాలనుకొన్నాడు .పడుకున్నా కూర్చున్నా నిద్రిస్తున్నా అదే ఆలోచన .అప్పటి నుంచి మద్యం, మాంసం, తాగుడు ,సిగరెట్ వగైరా చెడు అలవాట్లను మానేశాడు  ఉప్పు కూడా ఆహార పదార్ధాలలో వేసుకో కుండానే తినేవాడు .అదొక పవిత్ర వ్రతం లాగా ఆచరించాడు .మనసు కల్మష రహితమై పవిత్రమై దైవ కార్యానికి శరీరం ,మనసు సిద్ధమైనాయి ..

2005 జూన్ లో ఈ ప్రాజెక్ట్ పని ప్రారంభమైంది .దగ్గరలో చిన్న తిప్ప సముద్రం గ్రామం లో ఉన్న కొండ పైన ఉన్న 300 అడుగుల ,130 టన్నుల బరువున్న రాయిని విగ్రహం కోసం ఎంపిక చేశారు .దాన్ని కావలసిన సైజు కు తెచ్చేందుకు చిత్రిక పట్టి బరువును 80 టన్నులకు తగ్గించారు .శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం 24అడుగులపోడవు 8 అడుగుల వెడల్పు ఉండేట్లు చెక్కించారు .విగ్రహ పద్మ  పీఠం అయిదు అడుగులు .దానిపైన మరో అయిదడుగుల ఎత్తుపీఠం పైన ఆంజనేయ విగ్రహం ఉంటుంది .దీనికింద పదకొండు అడుగుల లోతు లో కాంక్రీట్ దిమ్మ దానిపై ఇవన్నీ అమర్చారు .ఇంత భారీ విగ్రహ నిర్మాణం లో ఎక్కడా ఒక చిన్న క్రాక్ కూడా రాక పోవటం అందర్నీ ఆశ్చర్య  చకితుల్ని చేసి శిల్పాచార్యుని ప్రతిభను అందరూ మెచ్చుకొన్నారు .దైవ కటాక్షం కూడా తోడ్పడిందని విశ్వాసం . . లో బెడ్ ట్రైలర్ మీద విగ్రహాన్ని రెండు హై కేపాసిటి .క్రేన్ ల సహాయంతోమేఇరవై తొమ్మిదిన  అంగల్లు చేర్చారు .

తమిళనాడు  కుంభకోణ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రమణి అయ్యర్ ‘’స్వర్ణ పంచముఖి తంత్రం ‘’శ్రద్ధగా తయారు చేసి ఇచ్చారు .దాన్ని విగ్రహ పీఠం కింద అమర్చి శక్తి చేకూర్చారు .తమిళనాడు లోని మాయ వరం నుండి తెచ్చిన ‘’అష్ట బంధనం’’ తో జూన్ ఇరవై ఏడున  కీటకాలు లోనికి ప్రవేశించకుండా ఖాళీలను పూడ్చారు .భద్రాచలానికి చెందిన డెబ్భై ఏళ్ళ వయో వృద్దు  శ్రీ వెంకట స్వామి తన భక్తబృందం తో వచ్చి శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేశారు  .ఆలయ నిర్మాణానికి 18కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు .అప్పటికే ఆరు కోట్లు ఖర్చు చేసి విగ్రహం నిర్మించి  ప్రతిస్టిం చిన  నిర్మాత విశ్వనాధం గారు  అంత డబ్బు ఎలా సమకూరుతుందో నని ఆవేదన చెందుతున్నారు . .దాతలెవరైనా ధన సహాయం చేయ దలిస్తే -9-94406 50038 నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించ వలసినదిగా  తెలియ జేశారు .

 

The huge Hanuman statue is ready for consecration at Angallu near Madanapalle.

 

172- శ్రీ భక్త హనుమాన్ –మదురై

తమిళనాడు లో మదురై లో మీనాక్షి సుందరేశ్వర ఆలయం జగత్ ప్రసిద్ధి చెందింది .విజయనగర చక్ర వర్తులకాలం లో ఈ నగర ప్రాభవం మహా గొప్పగా ఉండేది .కృష్ణ దేవరాయల రాజ గురువు వ్యాస రాయలవారు వందలాది ఆన్జేయ విగ్రహాలు ప్రతిష్టించారని చెప్పుకొన్నాం .ఇవి మధ్వ మఠఆధ్వర్యం లో నిర్వహింప బడుతాయి .’’ముఖ్య ప్రాణవర్ ‘’అని హనుమను పిలుచుకొంటారు .మదురైలో ‘’కృష్ణ రాయ  తెప్పాకులం’’ ఒడ్డున శ్రీ వ్యాస రాయ ప్రతిష్టిత శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహమూ ఆలయమూ ఉన్నాయి .గర్భ గృహం చిన్నదిగా ఉండి  దానికి అనుసంధానంగా ఉన్న పెద్ద హాలు ఒకప్పుడు యాత్రికుల సత్రం లా ఉపయోగపడేది . దీనిని మద్వ మఠంవారు నిర్వహిస్తున్నారు .1903లో దేవాలయాన్ని పునరుద్ధరించి పెంచి నిర్మింఛి మహా కుంభాభిషేకం చేశారు . తర్వాత ఏడాది స్థానిక బ్రాహ్మణ సంఘం వారు విశాలమైన హాలు నిర్మించారు దీనిలో భజనలు ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నారు .1988మే నెల ఆరున  సెంధిల్ అంటే మురుగన్ అంటే కుమారస్వామి విగ్రహాన్ని అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించారు .తర్వాత మూడు అంతస్తుల రాజ గోపురం ,నూతన విమానం నిర్మింఛి కుంభాభిషేకం చేశారు .ఇప్పుడుశ్రీ ఆంజనేయ  ఆలయం సర్వసౌకర్యాలతో విస్తరిల్లి ఆకర్షణగా నిలిచింది .భక్తుల ,దాతల సాయం తో ఫ్లోరింగ్ వగైరాలు కల్పించారు .

మదురై ఆంజనేయ స్వామి ప్రత్యేకత

శ్రీ ఆంజనేయ దేవాలయం రోడ్డు మీదకే కనిపిస్తుంది .స్వామి అంజలి హస్తం తో నిలబడి దర్శన మిస్తాడు .విగ్రహం రెండున్నర అడుగుల ఎత్తు మాత్రమె ఉండి భక్తుల మనోభీష్ట సిద్ధి కలిగిస్తుంది .స్వామి విశాల కనుదోయి భక్తులనందర్నీ పర్య వేక్షిస్తున్నట్లు గా గోచరిస్తుంది  .భక్తుల కోరికలను వినటానికి ,వాటిని తన రామునికి నివేదించటానికి వీలుగా స్వామి చెవులు రిక్కిం చుకొని సావదానం గా  ఉంటాయి .మద్వ సంప్రదాయం లో హనుమ ముకుళిత హస్తాలతో ఎక్కడా ఉండడు .ఇక్కడే అలా కనిపిస్తాడు .సాధారణం గా వ్యాస రాయ ప్రతిష్టిత హనుమాన్ విగ్రహాలు అర్ధ శిల తో తోక చివర చిన్న గంట తో ఉంటాయి .ఇక్కడ అవేవీ కనిపించవు .అదే ఆశ్చర్యం .బహుశా కాలక్రమం లో అసలు శిల దెబ్బ తింటే తీసేసి దాని స్థానం లో ఈ  కొత్త శిలపై విగ్రహాన్ని చెక్కి ప్రతిష్టించి ఉంటారని అంటారు . కాని ఇన్ని తేడాలు విగ్రహం లో ఉన్నామధ్వమత సంప్రదాయం అంటే ద్వైత సంప్రదాయం లోనే వ్యాస రాయలకాలం నుండి నేటివరకూ పూజాదికాలు స్వామికి జరుగుతూనే ఉన్నాయి .

Hanuman temple, Krishnaraya teppakulam, Madurai

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-15-ఉయ్యూరు