Author Archives: gdurgaprasad

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA

శ్రీ హనుమద్వ్రతం

ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి ఉన్న శ్రీ సువర్చ లాంజనేయ స్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ త్రయోదశి  శ్రీ హనుమద్వ్రతం సందర్భంగా 29-11-17 నుండి 1-12-17 వరకు త్రయా హ్నికం గా కార్యక్రమము నిర్వహింప బడుతోంది .భక్తులు విశేషంగాపూజా కార్యక్రమం లో పాల్గొని స్వామి వారల కృపకు పాత్రులు కావలసినదిగా మనవి

                  కార్య క్రమ వివరాలు
29-11-17 బుధవారం -ఉదయం 5 గం .లకుస్వామి వార్లకు స్నపన ,మన్యుసూక్తమ్ తో అభిషేకం ,నూతన వస్త్ర ధారణ
              ఉదయం -8 గం లకు గంధ సిందూరం ,చేమంతి పూలతో ప్రత్యేక పూజ
30-11-17 -గురువారం -ఉదయం 9 గం లకు -అరటి పండ్లు ,వివిధ ఫలాలతో విశేష అర్చన
1-12-17 శుక్రవారం -శ్రీ హనుమద్వ్రతము
              ఉదయం 9- గం -కు తమలపాకులతో ప్రత్యేక అర్చన అనంతరం
            పంపా కలశ ఆవాహన ,పంపా నదీ పూజ , 13 ముడుల తోరాలకు పూజ  ,  తోరధారణ

    శ్రీ హనుమద్వ్రతము -కథా విశేషాలు -నైవేద్యం, హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం

పూజా కార్యక్రమం లో పాల్గొన దలచిన భక్తులు అర్చక స్వామిని సంప్రదించ గలరు
                           గబ్బిట దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మ కర్త
                             మరియు భక్త బృందం

Inline image 1
ప్రకటనలు

 దర్శనీయ శివాలయాలు-111 –బాఘ్ నాధ దేవాలయం –బాగేశ్వర్

 దర్శనీయ శివాలయాలు-

111 –బాఘ్ నాధ దేవాలయం –బాగేశ్వర్

వ్యాఘ్ర నాద బాఘ్ నాధ అయి ఉంటుంది .వ్యాఘ్రం అంటే పులిరాజు .శివుడు పులి చర్మం ధరిస్తాడు కనుక వ్యాఘ్రేశ్వరుడు .ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధ హిల్ స్టేషన్  ఆల్మోరాకు 90 కిలోమీటర్ల దూరం లో బాగేశ్వార్ దేవాలయం ఉంది.శ్రావణ మాసం లో భక్తులు వచ్చి సందర్శింఛి కాపాడమని వేడుకొనే  క్షేత్రం ఇది .గోమతి ,సరయు నదుల సంగమ స్థాన ప్రదేశం లో  ఈ ఆలయం ఉంటుంది . ఇక్కడే దుర్గా ,దత్తాత్రేయ ,హనుమాన్ ,కాళికా ,గంగామాత ,పంచ౦ ఝు౦కార , తుంగ భైరవ ,విశ్వేశ్వరాలయాలున్నాయి .

112-బాలేశ్వర దేవాలయం –చంపావత్

ఉత్తరాఖండ్ రాష్ట్ర మధ్యభాగం లో పితోరవాత్ జిల్లా  కు 74 కిలో మీటర్లలో చంపావత్ నగరం లో బాలేశ్వర దేవాలయం ఉన్నది .ఈ దేవాలయం అతి ప్రాచీనకాలానికి అంటే క్రీశ 10 -12 శతాబ్దికాల౦ లో నిర్మించబడినట్లు తెలుస్తోంది .స్తంభాలు గోడలు తో కట్టబడింది .ఈ ఆలయ ప్రాంగణం లో రత్నేశ్వర ,చంపావతి దుర్గ ఆలయాలున్నాయి శివ రాత్రినాడు బాలేశ్వర దేవాలయం లో విశేష పూజా కార్యక్రమాలు భారీగా జరుగుతాయి .వేలాది భక్తులు సందర్శించి తరిస్తారు .

113-బిన్సార్ మహాదేవాలయం –చమోలి .

సముద్ర మట్టానికి 2,480  మీటర్ల ఎత్తున  చిక్కని దేవదారు వృక్షారణ్య  భాగం లో ఉత్తరాఖండ్ లోని చమోలీ లో బిన్సార్ మహా దేవాలయం సుందర ప్రకృతిలో ఉంది.ఆలయానికి 19 కిలో మీటర్లలో ఆహా అనిపించే రాణిఖేత్  రైల్వే స్టేషన్ ఉంది.స్థానిక కధనం ప్రకారం ఈ ఆలయం ఒకే ఒక్క రోజులో నిర్మింపబడింది .వైకుంఠ చతుర్దశి నాడు మహిళా భక్తులు ఈ ఆలయం సందర్శించి తమ సంతానానికి మంచిఆరోగ్యం కోసం  తమ కుటుంబానికి  సౌభాగ్యం కోసం పూజలు చేయటం ఇక్కడ విశేషం . పారిశుధ్యానికి కేంద్రంగా ఉంటుంది ఆలయం ,,ప్రాంగణం కూడా .

114-శివ గణనాధ ఆలయం –ఆల్మోరా

సముద్ర మట్టానికి 2,11 6 మీటర్ల ఎత్తులో ఆల్మోరాలో శివగణనాద దేవాలయం ఆల్మోరాకు 47కిలోమీటర్ల దూరం లో ఉంది .కార్తీక పౌర్ణమినాడు బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది .భక్తులు తప్పెట్లు తాళాలతో బాజా భజంత్రీలతో ఆలయం సందర్శిస్తారు

115-జాగేశ్వర దేవాలయం –ఆల్మోరా

2,500ఏళ్ళ అతి ప్రాచీన దేవాలయామే ఆల్మోరాలోని జాగేశ్వర దేవాలయం .వివిధ వంశాలకు చెందిన రాజుల  కాలాలో అభి వృద్ధి చెందిన దేవాలయం .ఆలయ శిల్ప నిర్మాణ ప్రతిభ ఆశ్చర్యం కలిగిస్తుంది .దీనిని అధ్యయనం చేయటానికే చాలా మంది వస్తారు .ఇది ఆలయ కాంప్లెక్స్ గా ఉంటుంది .జోగేశ్వర మహా శివ దేవాలయం తో పాటు,మృత్యుంజయేశ్వర,సూర్య ,చండికా ,కుబేర ,నవ దుర్గ ,నవగ్రహ దేవాలయాలూ ఉన్నాయి

116-మహా మృత్యుంజయ దేవాలయం –జాగేశ్వర్

అతిప్రాచీన మహా శివుని అతి ప్రసిద్ధ దేవాలయం మహా మృత్యుంజయ దేవాలయం .జాగేశ్వర దేవాలయానికి దగ్గరలోనే ఉంటుంది .ఇక్కడి శివలింగం అతి విచిత్రంగా ఉండటం ప్రత్యేకత .శివలింగం లో తెరచి ఉన్న శివ నేత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది .భక్తులు మృత్యుంజయ మంత్రాన్ని భక్తితో పఠిస్తూ  దర్శించి తమకు మృత్యువువలన ,ప్రమాదాలవలన ఇబ్బంది రాకుండా చేయమని ప్రార్ధిస్తారు .

117-ముక్తేశ్వర దేవాలయం –నైనిటాల్

సరస్సుల నగరం అని పిలువబడే నైనిటాల్ కు 51కిలో మీటర్ల దూరం లో ముక్తేశ్వర దేవాలయం ఉన్నది .ఈ ఆలయం ఉత్తరాఖండ్ లో కుమాన్ పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 2,286 మీటర్ల ఎత్తున ఉంది.ఆలయం చుట్టూ బ్రహ్మ విష్ణు ,నంది,గణేశ,పార్వతి విగ్రహాలున్నాయి .ఆలయానికి అతి సమీపం లోనే చౌలీకి జాలీ అనే రాక్ క్లైమ్బింగ్ సైట్ ఉంటుంది .

118 –పాతాళ భువనేశ్వరాలయం –పితోరగడ్

సున్నపురాయి గుహలయమే పాతాళ భువనేశ్వరాలయం .దీన్ని గురించి అనేక విచిత్ర కధలు గాధలు ప్రచారం లో ఉన్నాయి .పితోరగడ్ జిల్లా గంగోలి హాట్ కు 13 కిలోమీటర్లలో 13 50 మీటర్ల ఎత్తులో ఉన్న ఆలయ మిది .ఇక్కడే 33 కోట్ల మంది దేవతలు ఉంటారని విశ్వాసం .ఈ గుహాలయం 160 మీటర్ల పొడవు ,90 మీటర్ల లోతు ఉంటుంది .ఈ గుహాలయం లో లెక్కపెట్టటానికి వీలు లేనన్ని స్టాలిగ్ మైట్ శిలాకృతులు దర్శనమిస్తాయి .ఇక్కడే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి .అందులో కొన్ని –కాలభైరవుని నాలుక ,ఇంద్రుని ఐరావతం ,శివ జటాజూటం వంటివి అన్నమాట .తప్పక చూసి ఆశ్చర్యపోవాల్సిన ఆలయం .

119-సోమేశ్వర దేవాలయం –కౌసాని

ఉత్తరాఖండ్ లో కౌశాని హిల్ స్టేషన్ కు 11 కిలో మీటర్ల దూరం లో అందమైన ప్రక్ర్తి పరిసరాలున్న చిన్న పల్లె కౌశాని లో కౌశాని-ఆల్మోరా రోడ్డుపై సోమేశ్వరాలయం ఉన్నది.ఇక్కడి ప్రజులు దీనిని జ్యోతిర్లి౦గాల లో  ఒకటిగా విశ్వసిస్తారు .7 వశతాబ్ది ఆలయం .

120-త్రిజుగి నారాయణ దేవాలయం –రుద్రప్రయాగ

ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లా త్రిజుగి నారాయణ గ్రామం లో ఉన్న విష్ణు ఆలయమే త్రిజుగి నారాయణ దేవాలయం .ఇక్కడ విష్ణువుతోపాటు శివునీ పూజించటం విశేషం .ఇక్కడే ఉమామహేశ్వర కల్యాణం జరిగిందని అంటారు .ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది అదే ‘’అఖండ ధుని ‘’.అందుకే అఖండ ధుని దేవాలయం అని పిలుస్తారు .ఇక్కడి శివ పార్వతి కల్యాణం నాటి అగ్ని హోత్రం మూడు యుగాలుగా వెలుగుతూనే ఉండటం విశేషం .త్రిజుగి అంటే మూడు యుగాలు .ఆలయానికి దగ్గరలో ఉన్న జలపాతం చుట్టు  ప్రక్కల మూడు సరస్సులను నింపి పంటలకు సహకరిస్తోంది .

   సశేషం

   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-17 –ఉయ్యూరు

వ్యాఘ్రఈశ్వర దేవాలయం

 బాలేశ్వర దేవాలయం

బిన్సర్ మహాదేవాలయం


జాగేశ్వరదేవాలయం

మహామృత్యుజయ దేవాలయం 

ముక్తేశ్వరాలయం 

 పాతాళ భువనేశ్వరాలయం 

33 కోట్ల దేవతలు 

సోమేశ్వరాలయం 

త్రిజగి నారాయణ దేవాలయం 

  అఖండ ధుని 

 దర్శనీయ శివాలయాలు – 102 –అగస్త్యేశ్వరాలయం –రుద్రప్రయాగ

దర్శనీయ శివాలయాలు –

102 –అగస్త్యేశ్వరాలయం –రుద్రప్రయాగ

ఉత్తరాఖండ్ లో రుద్ర ప్రయాగలో ఉన్న అగస్త్యేశ్వరాలయం లో అగస్త్య మహర్షి తపస్సుచేసి శివ పూజ చేసినట్లు పురాణకథనం .

103 –కోటేశ్వరాలయం –రుద్రప్రయాగ

రుద్రప్రయాగలోనే శ్రీ కోటేశ్వరాలయం ఉన్నది ఇక్కడ శివుడే తపస్సు చేసినట్లు పురాణ ౦ లో ఉంది.ఇక్కడే భస్మాసురుడు తీవ్ర తపస్సు చేసి శివుని మెప్పించి వరం పొంది ,తర్వాత  విష్ణు మాయవలన తన నెత్తినే తాను చేయిపెట్టుకొని భస్మమైన ప్రదేశం ఇది ఇది గుహాలయం .

104 –మధ్యమహేశ్వరాలయం –రుద్రప్రయాగ

రుద్రప్రయాగ కు 46కిలోమీటర్ల దూరం లో ఉన్న ఆలయమే మధ్య మహేశ్వరాలయం .పంచ కేదార్ ట్రెక్కింగ్ ప్రదేశాలలో ఇదొకటి .ప్రకృతి అందాల మధ్య కనువిందు చేసే ఆలయం .దీని నిర్మాణ శిల్ప చాతుర్యం అద్భుతమని పిస్తుంది .

105-ఓంకారేశ్వర దేవాలయం –రుద్రప్రయాగ

ఉఖీ మఠ్ లో  ఉన్న ఈ దేవాలయం తుంగనాధ స్వామి మద్మమహేశ్వరునికి  శీతాకాల విశ్రాంతి మందిరం .శీతాకాలం పూర్తీ అవగానే మహా వైభవంగా ఈ దేవుళ్ళను వారి వారి దేవాలయాలకు చేరుస్తారు .

106-విశ్వనాథాలయం-గుప్త కాశి

కాశీలో విశ్వేశ్వరునికి ఎంతటి ఆరాధనా భావం ఉందో ఇక్కడ గుప్తకాశీలో ఈ విశ్వేశ్వరునికి అంతటి పూజ్య భావం ఉంది.ఇక్కడే పార్వతీ పరమేశ్వరులు మొదటిసారి రహస్యంగా అంటే గుప్తంగా కలుసుకొన్నారు .అందుకే గుప్త కాశి అంటారు .ఇక్కడే శివ పార్వతుల కల్యాణం జరిగింది .అంతేకాదు పాండవులు శివునికోసం వెదకటానికి వస్తే కనిపించకుండా ఉన్నప్రదేశం కనుక గుప్తకాశి అయింది .

107-బుఢా కేదార్ దేవాలయం –గర్వాల్

గర్వాల్ జిల్లా లో బుఢాకేదార్ ఆలయం లో శివలింగం ఉత్తర భారత శివాలయ లింగాలలో చాలాపెద్దది .బృహత్ లింగం అన్నమాట . ధర్మ గంగా ,బాల గంగా నదుల సంగమ స్థానం లో ఎత్తైన ప్రదేశం లో ప్రకృతి రామణీయకత మధ్య ఉన్న దేవాలయం ఇది .పాండవులతో సాన్నిహిత్యం ఉన్న ఆలయం అని ఇక్కడి వారు గర్వం గా చెప్పుకొంటారు .

108 –లఖా మండల దేవాలయం –డెహ్రాడూన్

పాండవులను సజీవ దహనం చేయించటానికి దుస్ట  దుర్యోధనుడు ఇక్కడ లాక్షా గృహం అంటే లక్క ఇల్లు కట్టించాడు అదృష్టవశాత్తు వాళ్ళు తప్పించుకొన్నారు .అందుకనే ఈ ఆలయాన్ని దర్శించినవారు  దురదృష్టం  నుండి కాపాడ బడుతారని గొప్ప విశ్వాసం .

109-రామేశ్వర దేవాలయం –ఋషీకేశ్

ఋషీకేశ్ లో గలగలాపారే గంగమ్మతల్లి ఒడ్డునే రాం ఝాలా వంతెన దగ్గర రంగురంగులతో శోభించే రామేశ్వరాలయం ఉన్నది .

110-కమలేశ్వర మహా దేవాలయం-పౌరీ గర్వాల్

ఉత్తరాఖండ్ పౌరీ గర్వాల్ ప్రాంతంలో మంచు తో కప్పబడే హిమ శృంగాల మధ్య తెరై కోట్ ద్వార్ ప్రాంతం లో కమలేశ్వర మహా దేవాలయం ఉన్నది .వసంత సప్తమినాడుమహా దేవ శివునికి  52 రకాల పదార్ధాలు నైవేద్యం పెట్టటం ఇక్కడి ఆచారం .సాధారణంగా శివాలయాలలో ఎక్కడా ఇన్ని రకాల ప్రసాదాలు పెట్టటం చూడం .ఒక్క ప్రసాదం పెట్టటమే గొప్ప . విష్ణ్వాలయం లో ప్రసాదాలకు కొదవ ఉండదు .శివాలయం లో విభూతి తప్ప ఏమీ ఉండదు .అందుకే ఏమీ లేనిదానిని “’అక్కడేముందిరా శివాలయం ‘’అనే సామెత వచ్చింది .రకరకాల భారీ ప్రసాద వినియోగం ఈ ఆలయ ప్రత్యేకత .  సంతానం లేని దంపతులు కార్తీక చతుర్దశినాడు  రాత్రి అంతా ఈ ఆలయం ప్రాంగణం లో చేతిలో మట్టిప్రమిద దీపం తో నిలబడి భక్తితో జాగరణ చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని ఇక్కడి వారి అచంచల విశ్వాసం . సంతానం కోసం ,ప్రసాద వైవిధ్యం కోసం ఈ ఆలయాన్ని దర్శించి తరించాలి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-17- ఉయ్యూరు

కోటేశ్వర దేవాలయం

 

 

మధ్య మహేశ్వర దేవాలయం

 

 

ఓంకారేశ్వర దేవాలయం

,

 

— 

విశ్వనాథాలయం


     బుఢాకేదారేశ్వరాలయం

           లఖామండల్ దేవాలయం 

    రామేశ్వరాలయం 

                 కమలేశ్వరాలయం 

 

14-11-17 కార్తీక మాసం చివరి మంగళవారం సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయ స్వామిదేవాలయం లో సరసభారతి 115 సమావేశంగా శ్రీమతి కామాక్షిగారిచే ”శివానందలహరి ”ధార్మిక ప్రసంగం ,అనంతరం అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

14-11-17 కార్తీక మాసం చివరి మంగళవారం సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయ స్వామిదేవాలయం లో సరసభారతి 115 సమావేశంగా శ్రీమతి కామాక్షిగారిచే ”శివానందలహరి ”ధార్మిక ప్రసంగం ,అనంతరం అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

 

ఉసిరి చెట్టు కింద అభిషేకం ,సత్యనారాయణ వ్రతం 

ఉసిరి చెట్టు కింద అభిషేకం ,సత్యనారాయణ వ్రతం

 ఉయ్యూరులో మా పెరటి లోని ఉసిరిచెట్టు కింద 16-11-17 గురువారం కార్తీక బహుళ త్రయోదశి నాడు ఉదయం 8 గంటలకు మా చే  శ్రీరుద్రాభిషేకం అనంతరం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక వన భోజనం ఏర్పాటు చేయబడినది -దుర్గాప్రసాద్
Inline image 5

— Inline image 2Inline image 3Inline image 4

దర్శనీయ శివాయాలు – 95-తుంగ నాథ దేవాలయం –రుద్రప్రయాగ

దర్శనీయ శివాయాలు –

95-తుంగ నాథ దేవాలయం –రుద్రప్రయాగ

గమనిక –దర్శనీయ శివాలయాలు ధారావాహిక చాలా కాలం తర్వాత మళ్ళీ మొదలు పెట్టటం తో వరుస సంఖ్య తప్పింది .తపకేశ్వర దేవాలయం సంఖ్య 94 గా గుర్తించండి . ఇప్పుడు రాసే తు౦గనాథాలయం 95.

ఉత్తరాఖండ్ రాష్ట్రం లో రుద్రప్రయాగ లో ఉన్న తుంగ నాథ దేవాలయ౦ ప్రపంచ ఆలయాలలో  అన్నిటి కంటే ఎత్తు మీదున్న ఆలయం గా భావిస్తారు .అందువలన దీనిని ‘’శిఖర శిరోమణి ఆలయం ‘’అంటారు .రుద్ర ప్రయాగ జిల్లాలోని అత్యంత ఎత్తునఉన్న  ముఖ్య పంచ కేదారనాథ ఆలయాలలోఒకటి .కురు క్షేత్ర సంగ్రామం లో దాయాదులైన కౌరవులను పూర్తిగా సంహరించి శత్రుశేషం లేకుండా చేసిన పాండవులు ముక్తి కోసం పరి తపించారు .హిమాలయాలకు చేరి శివ మహా దేవుని శరణు వేడుకొని విముక్తి మార్గం తెలియ జేయమని కోరాలని  తీవ్రంగా అన్వేషించారు .శివుడు గుప్తకాశి లో వృషభ రూపం  దాల్చి ఉన్నాడని గ్రహించారు .గుప్తకాశిలోని వృషభ రూప శివ దర్శనం కోసం తీవ్రంగా గాలించారు .వీరి అన్వేషణ ఫలించి శివ మహాదేవుని’’ బాహువులు’’ కనిపించాయి ఇక్కడ .అప్పటి నుంచి ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదిగా భావింప బడుతోంది .ఎందరెందరో మహర్షులు, ముని పుంగవులు ఈ తుంగ నాథ దర్శనం తో తరించారు .

96-రుద్రనాథ దేవాలయం –చమోలి

ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ జిల్లా చమోలి లో శ్రీ రుద్ర నాథ దేవాలయం ఉన్నది .ఇక్కడే పాండవులకు శివుడు  ‘’ఎద్దు(వృషభం ) యొక్క మూపుర’’ రూపం లో దర్శన మిచ్చాడు .  శివుని పల్లకీని లూటీ బుగ్యాల్ ,పన్యార్ ల ద్వారా  గోపేశ్వర్ కు మోసుకొంటూ వచ్చి ,అక్కడ ఉన్న’’ పితృధార ‘’వద్ద పితృ దేవతలకు  తర్పణ ,పిండ ప్రదానాలు చేస్తారు .మళ్ళీ ఇక్కడినుంచి డోలీ ని ధలాబ్ని  మైదాన్ గుండా  రుద్రనాథ్ కు చేరుస్తారు

97 –కల్పేశ్వర మహాదేవాలయం –చమోలి-

ఉత్తరాఖండ్ గర్హి హిమాలయాలలో చమోలీ వద్ద అందమైన ప్రకృతి కనువిందు చేసే ఉర్గాం లోయ లో శ్రీ కల్పేశ్వర మహాదేవ ఆలయం ఉన్నది .ఇక్కడే పాండవులకు శివుని’’ తాళాలు’’ లభించాయి .పాండవుల ప్రార్ధన మన్నించిన కల్పేశ్వర మహా దేవ శివుడు వారి పాపాలను క్షమించి ముక్తి మార్గం ఉపదేశించాడు .

98- నీల కంఠ మహాదేవాలయం –ఋషీకేశ్

ఉత్తరాఖండ్ పౌరి-గర్వాల్ జిల్లా ఋషీకేశ్ దగ్గర నీల కంఠ మహా దేవాలయం ఉంది.ఇక్కడే  దేవ రాక్షసులు అమృతం కోసం   క్షీర సాగర  మధనం చేస్తుంటే  వెలువడిన ‘’హాలాహలం ‘’ను దేవదానవుల ప్రార్ధన మన్నించి లోకోపకారం కోసం శివుడు మ్రింగిన ప్రదేశం . దాన్ని ఉదరం లోకి పోనీకుండా లోపలి లోకాలకు నష్టం కలుగ కుండా కంఠంలోనే ఉంచుకొని , కంఠం నీలం రంగుగా మారగా నీల కంఠుడయ్యాడు. గరళం మింగాడు కనుక గరళ కంఠుడు.కేదార్ నాథ్క్షేత్రం నుంచి నీల కంఠ పర్వత శిఖర దర్శనం  అత్యంత ఆనందదాయకం గా నయన మనోహరం గా ఉంటు౦ది .

99 –జగేశ్వర ధాం-ఆల్మోరా

హిమాలయాలలో ఆల్మోరా కు 35 కిలో మీటర్ల దూరం లో జగేశ్వర ధాం పరమ పవిత్ర శివాలయంగా భావింప బడుతోంది .ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ప్రసిద్ధమైనది అంటారు .  ఈ దేవాలయ సముదాయం లో 125 దేవాలయాలున్నాయి .వందలాది శిలా విగ్రహాలున్నాయి .

100-వైద్య నాథ దేవాలయం –బాగేశ్వర్

ఉత్తరాఖండ్ గోమతి నదీ తీరాన ప్రశాంత వాతావరణం లో శ్రీ వైద్య నాథ దేవాలయం ప్రాముఖ్యం సంతరించుకొన్నది .కౌశానికి 16 కిలోమీటర్ల దూరం లో ఉన్నది .

101-గోపీనాథ దేవాలయం –గోపేశ్వర్

ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా గోపేశ్వరం పట్టణం లో శ్రీ గోపీనాథేశ్వర దేవాలయం 9-11 శతాబ్దాల మధ్యకాలం లో నిర్మింపబడిన దేవాలయం .దీనిని కాట్యూరి వంశ రాజులు నిర్మించారు .రుద్రనాథునికి పవిత్ర క్షేత్రం గా దీనిని భావిస్తారు .ఈ ఆలయ శివలింగాన్ని ‘’ఏకానన్ ‘’అంటే ‘’శివుని ముఖంగా’’ భావించి అర్చిస్తారు .ఈ ఆలయం లో మరో విశేషం ఏమిటి అంటే అన్ని శివాలయాలలోశివునికి క్షీరం, జలంతో  అభిషేకం చేసినట్లు ఇక్కడ  చేయరు . ఆ రెండు ఇక్కడ అభిషేకానికి వాడరు అని అర్ధం .ఒక్క బిల్వ దళాలతోనే అభిషేకం ,పూజ నిర్వహించటం ఇక్కడి ప్రత్యేకత .

మన్మధ సంహారం కోసం శివుడు త్రిశూలం వేస్తే, ఆ త్రిశూలం ఇక్కడ దిగబడి పోయిందట . ఆ త్రిశూలం ఏయే లోహ మిశ్రమాలతో తయారు చేయబడిందో తెలియదుకాని ,అప్పటి నుండి ఇప్పటి వరకు అది చెక్కు చెదరలేదు .ఎంతటి పశుబలం ఉపయోగించినా దాన్ని కదిలించలేరు .కాని పరమ భక్తుడెవరైనా దాన్ని తాకితే  ప్రకంపనలు కలిగిస్తుంది. ఇదొక విశేషం ఇక్కడ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-17- ఉయ్యూరు

 

దర్శనీయ శివాలయాలు -90 ద్రోణుని ఆవాసం -తపకేశ్వర మహాదేవాలయం –డెహ్రాడూన్

దర్శనీయ శివాలయాలు -90

ద్రోణుని ఆవాసం -తపకేశ్వర మహాదేవాలయం –డెహ్రాడూన్

భయంకర అరణ్య ప్రదేశం లో సహజ గుహలో ఏర్పడిన మహాదేవ శివలింగం ఉన్న క్షేత్రమే డెహ్రాడూన్ లోని తపకేశ్వర దేవాలయం .గుహ పై భాగం నుండి సంతత అలదార బిన్డురూపంగా శివలింగం పై అభిషేక జాలం గా పడుతూ ఉండటం ఇక్కడి విశేషం .గుహ ప్రక్కనే ప్రవహించే నది నీటి తు౦పురులు  శివలింగం పై పడుతుంటాయి .అద్భుతమైన ప్రకృతి అందాలమధ్య ఉన్న ఈ గుహాలయం భక్తులకు ,యాత్రికులకు కను విందు చేస్తుంది .ఒకప్పుడు ఈ ప్రదేశం లో కౌరవ పందుల విలు విద్యా గురువు ద్రోణాచార్యులు ఉండేవారట.అందువల్లనే ఈ గుహకు ‘’ద్రోణ గుహ ‘’అనే పేరు వచ్చింది .ద్రోణాచార్యుల భార్య కృపి  ఇక్కడే అశ్వత్ధామ కు జన్మనిచ్చిందట .కుమారుడికి పాలుఇవ్వటానికి ఆమె స్తన్యం లో పాలు ఉన్దేవికావత .  ఆవుపాలు ఇచ్చి పొషించే ఆర్ధిక స్తోమత ఆచార్య ద్రోణులకు లేదట .అందుకనే అశ్వత్ధామ శివుని పాలకోసం  ప్రార్ధించే వాడట .బోళా శంకరుడు కనికరించి  గుహ పైబాహగం నుండి పాలధార కారేట్లు చేశాడట  .అక్కడే తర్వాత శివ లింగం ఏర్పాటు చేశారట .

డెహ్రాడూన్ కు కేవలం 6 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ తపకేశ్వర మహా శివాలయాన్ని యాత్రికులు తప్పకుండా వచ్చి దర్శిస్తారు .రెండు కొండల నడుమ ఉన్న ఈ గుహాలయం గొప్ప  టూరిస్ట్ అట్రాక్షన్. ఉత్తరాఖండ్ లోని ఈ క్షేత్ర సందర్శనానికి ఆ రాష్ట్ర ప్రజలు తండోప తండాలుగా వచ్చి దర్శిస్తారు .వారికి అందుబాటులో ఉన్న ఇష్టదైవం తపకేశ్వర మహా దేవుడు . .ద్రోణ గుహలో ఉన్న శివ లింగం పై సహజ సిద్ధ జల బిందువులు అభిషేక జలం గా నిరంతరం జాలువారటం యాత్రిక భక్తులకు మానసిక ఆధ్యాత్మిక భౌతిక ఆనంద దాయకం గా ఉంటుంది .మనసుపులకించి పరవశం కలుగుతుంది .శివ లింగం పై పడిన నీటి బిందువులు ఇట్టే అదృశ్యమై తర్వాత కొద్ది గజాల దూరం లో ప్రవాహంగా దర్శన మివ్వటం మరో ఆశ్చర్య కరమైన విషయం ..

తపకేశ్వర మహాదేవాలయం సమీపం లో సల్ఫర్ కలసిన చల్లని నీటి గుండాలున్నాయి .వీటిలో ముందు పవిత్ర స్నానం చేసి తర్వాత భక్తులు ఆలయం లో శివ మహాదేవుని దర్శిస్తారు .ప్రతి శివరాత్రికి భక్తులు విశేషంగా వచ్చి తపకేశ్వర స్వామిని దర్శించి తరిస్తారు .పెద్ద ఉత్సవమూ నిర్వహిస్తారు .డెహ్రాడూన్ చుట్టుప్రక్కల ప్రజలకు ఇది గొప్ప పిక్నిక్ స్పాట్ . ట్రెక్కింగ్ కు కూడా అనుకూల ప్రదేశం .ఇక్కడున్న నిలువెత్తు హనుమాన్  భారీ విగ్రహం చూసి తీరాల్సిందే. ఉత్సవ సమయాలలో భక్తులకు ప్రసాదంగా మహా రుచికరమైన భాంగ్ కె పకోడా ,భాంగ్ జ్యూస్ ఇస్తారు .

ఈ ఆలయం గర్హి కంటోన్ మెంట్ రోడ్డు మీద డెహ్రాడూన్ ఎయిర్ పోర్ట్ కు 30 కిలో మీటర్ల లో ,డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ కు 8 కిలోమీటర్ల దూరం లో ఉంది.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-17 –కాంప్- మల్లాపూర్ –హైదరాబాద్