దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 401-లడ్డూ తింటున్న హనుమాన్

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

401-లడ్డూ తింటున్న హనుమాన్ –ఈతావా

సజీవ హనుమాన్ గా భావింపబడే శ్రీ ఆంజనేయ దేవాలయం ఉత్తరప్రదేశ్ ఈతావా లొ ఉన్నది .యమునా నది ఒడ్డున సిటీకి 8 కిలోమీటర్లలో ఆలయం ఉన్నది . .

ఆలయ పూజారి కథనం ప్రకారం ఇది ద్వారయుగానికి చెందిన ఆలయం .ఇక్కడి  హనుమాన్ విగ్రహ విషయం  ప్రతాప్ నగర్ రాజు హుకుం దేవ్ కు భక్త తులసీదాసు చెప్పగా ఆయన విగ్రహాన్ని తనరాజధానికి తీసుకు వెళ్ళేప్రయత్నం చేస్తే ఆయన కదలనని భీష్మి౦ఛి ,గట్టిగా తీసుకు   వెళ్ళాలనులనుకొంటే తన ఆకలి తీర్చమన్నాడట  .సరే అని రాజు పట్టణం లోని పాలు అన్నీ నైవేద్యం పెట్టించాడు.ఆకలి తీరలేదు . రాణి వచ్చి క్షమించమని చెంపలేసుకొని కొద్దిగా పాలు తెప్పించి నైవేద్యం పెట్టి౦చగా సంతృప్తి చెందాడు .ఈ హనుమ’’ పీలువా మహావీర్ ‘’ అని పిలువ బడుతాడు ,.ఇంతకంటే మరో అత్యంత ఆశ్చర్యమైన విషయం హనుమాన్ మూతికి సంబంధించినది .ఎవరు లడ్డూ ప్రసాదం తెచ్చి మూతికి అందించినా ఆయన  హాయిగా మన ‘’మంగళగిరిపానకాల స్వామిలాగా’’ ఆరగిస్తాడు  ఇలా తరతరాలుగా జరుగుతోంది .ప్రతిమంగళవారం తెల్లవారుఝామున నుంచి భక్తులు లడ్డూలతో క్యూలో ఉంటారు .ఇలాంటి సజీవ సంజీవరాయుడు ప్రపంచం లొ ఇంకెక్కడా లేడు  .

402-సిద్ధబలి హనుమాన్ మందిర్ –కోట్ ద్వార్

ఉత్తరాఖండ్ ఖో నది ఒడ్డున కోట్ ద్వార్ లొ సిద్ధబలి ఆంజనేయ దేవాలయం ’’ బాబా సిద్ధబలి హనుమాన్ మందిర్ ‘’గా ప్రసిద్ధమైంది.చిన్న కొండపై అందమైన ప్రకృతిలో ఆలయం ప్రశాంతతకు నిలయంగా ఉంటుంది .స్వామి స్వయంభుగా భావిస్తారు .ఇది మంచి పిక్నిక్ స్పాట్ కూడా .సర్వాలంకార శోభితుడుగా హనుమ దర్శనమిస్తాడు .గద్వాల్ పర్వతాలలో అత్య౦త సుందరాలయమిది

కోట్ ద్వార్ లోనే దుర్గా దేవి రహస్య దేవాలయం ఉన్నది .ఈ గుడిలో అర్ధరాత్రి శివ పార్వతులు సంభాషించుచుకొంటారట .అందుకని మిస్టీరియస్ దేవాలయం అంటారు

403-చింద్ దాదా హనుమాన్ –చింద్

మధ్య ప్రదేశ్  బెరీలిజిల్లా  చింద్ లోని  హనుమాన్ దేవాలయం లక్షలాది భక్తులను ఆకర్షిస్తోంది .రాజకీయనాయకులు సినిమా స్టార్లు కష్టం లొ ఉన్నప్పుడు ఈ స్వామిని దర్శించి తమ ఇక్కట్లను తొలగించుకొంటారు .హనుమజ్జయ౦తికి లెక్కలేనంత మంది భక్తులువస్తారు మంగళ ,శనివారాలలో విపరీతమైన రద్దీ ఉంటుంది .హనుమాన్ మూర్తి వైభవం బహు ఆకర్షణీయం .

404-రోజుకు మూడు సార్లు ముఖం మార్చుకొనే హనుమ దేవాలయం –సూరజ్ కుండ్

మధ్యప్రదేశ్ నర్మదా తీరాన   సూరజ్ కుండ్ లొ అతిప్రాచీన ఆంజనేయ దేవాలయమున్నది.  స్వామి ప్రతిరోజూ మూడుసార్లు తన ముఖాన్ని మూడు జీవన దశలలో మార్చుకోవటం ఇక్కడ విశేషం.ఈ హనుమకు సూర్య దేవునికి అవినాభావ సంబంధం ఉందని చరిత్ర చెబుతోంది .సూర్యకు౦డమే సూరజ్ కుండ్ .సుదూర ప్రాంతాలనుండి భక్తులు వచ్చి ఈ విశేషం గమనించి ఆశ్చర్యపోతారు

405-సాలిగ్రామ హనుమాన్ –ఉడిపి

కర్నాటక ఉడిపిలోసాలిగ్రామం అనే గ్రామం లొ  శ్రీ సాలిగ్రామ హనుమాన్ దేవాలయం చారిత్రాత్మక ప్రసిద్ధి చెందింది .ఇక్కడి సాలిగ్రామ నరసింహ క్షేత్రం కూడా సుప్రసిద్దమైనదే .హనుమ విగ్రహ ప్రతిష్ట వ్యాసరాయలు చేసి ఉంటారు .హనుమకు నువ్వులనూనెతో అభిషేకం చేయటం ఇక్కడ విశేషం .

406-హనుమాన్ దేవాలయం –నుగ్గికేరి

కర్నాటక  ధార్వాడ్ కు 8కిలోమీటర్లలో నుగ్గికేరి లొ శ్రీ ఆంజనేయ దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది .నుగ్గికేర దేశాయ్ కుటుంబం వారు ప్రతిష్టించారు .ఆలయం  జీర్ణమైతే వ్యాసరాయలు పునః ప్రతిష్టించారు .దేశాయ్ కుటుంబ నిర్వహణ లోనే ఆలయమున్నది .చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి ఘనంగా చేస్తారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17 11-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

,

 

— 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.