దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 391-శ్రీ పసన్న ఆంజనేయ దేవాలయం –వెస్ట్ వెంకటాపురం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

391-శ్రీ పసన్న ఆంజనేయ దేవాలయం –వెస్ట్ వెంకటాపురం

హైదరాబాద్ వెస్ట్ వెంకటాపురం ఆల్వాల్ లో శ్రీ ప్రసన్న ఆ౦జ నేయదేవాలయం ఉంది .దీనిదగ్గర రైలు మార్గం రాకముందు ఇదంతా అరణ్యప్రాంతం .వాగునీటిలో బయల్పడిన విగ్రహమే ఇక్కడి ప్రసన్నాంజనేయస్వామి . అక్కడేఅలాగే ఉంచి పూజలు చేసేవారు .1992లో ముఖమండపం కట్టారు .స్వామి దక్షిణాభిముఖుడు .గుడిముందు రావి చెట్టు ,లోపల వినాయకుడు ఉన్నారు.స్వామి సిందూరవర్ణ శోభిత౦ సకల హార భూషితుడుగా కనిపిస్తాడు.శివాలయ౦లొ శివలింగం, బాలాత్రిపుర సుందరీ ఉన్నారు.శ్రావణమాసం మూడవ శుక్రవారం లక్ష పుష్పాలతో అమ్మవారి విశేష పూజ కడు రమణీయం . నవగ్రహ మండపమూ ఉన్నది .

392-శ్రీ అభయాంజనేయ దేవాలయం –ప్రభగిరిపట్నం

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరి పట్నం లో అతిప్రాచీన శ్రీ అభయ ఆంజనేయ దేవాలయం తో పాటు శివపార్వతుల సీతారాముల దర్శన భాగ్యమూకలుగుతుంది .దీనికి దగ్గరలో చోళరాజులు కట్టిన రామలింగేశ్వరాలయం ఉంది .అమ్మవారు కామాక్షీ దేవి.

-శ్రీ స్వయంభు వీరా౦జనేయ  దేవాలయం –మేడూరు  కృష్ణాజిల్లా మేడూరుగ్రామంలో స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ఉంది

393-దక్షిణముఖి హనుమాన్ మందిరం –భిలాయ్

చత్తీస్ గడ్రాష్ట్రం భిలాయ్ లో శ్రీ దక్షిణముఖి హనుమాన్ మందిరం ప్రాచీనమైనది .శిదిలమైతే పునర్నిర్మించారు .మొదట్లో ఉత్త్రముఖి మందిరం .పాలరాతి విగ్రహం గా  హనుమాన్ ప్రతిష్ట తర్వాత దక్షిణముఖి హనుమాన్ గా ప్రసిద్ధుడు .ఎడమ చేతిలోగద ,కుడి చేతిలో సంజీవపర్వత౦ తో దర్శనమిస్తాడు .చైత్రపౌర్ణమికి హనుమజ్జయంతి చేస్తారు  .

394-శ్రీ కోనహనుమాన్  మందిర్ –హౌరా

పశ్చిమబెంగాల్ హౌరాలో కోన రాజమార్గం లో శ్రీ కోన హనుమాన్ మందిరమున్నది .ఒకప్పుడు రైతు దంపతులకు హనుమవిగ్రహం దొరికింది .చిన్నగుడికట్టి పూజించారు .కాలక్రమంలో బాగా విశాలమైన దేవాలయ నిర్మాణం జరిగింది .అత్యద్భుత శిల్పశోభతో ఆలయం ఆశ్చర్యపరుస్తుంది .సత్సంగానికి, భజనలకు విశాలమైన హాలు ఏర్పాటు చేశారు .అనుబంధంగా ఆయుర్వేద హోమియో వైద్యశాలలూ నిర్వహిస్తున్నారు .మందిర పైభాగం లో ఉన్న శిల్పకళ వర్ణనాతీతం. అనేక దేవతామూర్తులు ,రామాయణ గాధలూ సముద్రమధనం అబ్బురపరుస్తాయి.

395-భజరంగబలి దేవాలయం –భిల్వారా

రాజస్థాన్ భిల్వారాలో శ్రీ భజరంగబలి దేవాలయం గొప్పగా ఉంటుంది .విశాలమైన ప్రాంగణం .స్వామి పూర్తిగా వెండి ఆభరణాలతో మునిగి పోయి అపురూపంగా విచిత్రంగా అనిపిస్తాడు .పాలరాతి సీతారామలక్ష్మణ విగ్రహాలు ముచ్చటగా ఉంటాయి.పురాతనాలయం. శిల్ప శోభ బాగుంటుంది .నిత్యపూజా భజన చాలీసాపారాయణలతో  ఆలయం ప్రతిధ్వనిస్తుంది .

 పశ్చిమబెంగాల్ జియాగంజ్ లోకూడా భజరంగబలి దేవాలయమున్నది .

396-శ్రీ హనుమ దేవాలయం –బెల్గాం

కర్నాటక బెల్గాం లో శ్రీహనుమాన్ దేవాలయ వైభవం చూసి తెలుసుకోవలసిందే మాటలతో చెప్పనలవికాదు బహుశా వ్యాసరాయ ప్రతిస్టిత0 అయి ఉంటుంది

అకోలాలో కూడా శ్రీ హనుమాన్ మందిరం ప్రసిద్ధమైనదే  .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-18-ఉయ్యూరు  

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.