శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం –మల్లూరు

శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం –మల్లూరు

అరణ్యం మధ్యలో కొండపై ప్రక్రుతి రామణీయకం  లో ఆలయం

ఆంద్ర ప్రదేశ్ లో వరంగల్ జిల్లా మండపేట తాలూకా మల్లూరు ఘాట్ లో 4,500 సంవత్సరాల నాటి అతి ప్రాచీన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉన్నది .ఇది గోదావరి నదికి దక్షిణ తీరం లో ఉంటుంది .స్వామి స్వయంభు నరసింహస్వామి .ఆలయ పరిసరాలు అద్భుత ప్రక్రుతి దృశ్యాలకు నిలయం .బంగారం పోత పోసినట్లు కొండ  ఉండటం వలన హేమాచలం అనే పేరొచ్చింది .అనేక ఓష ధులకు  ఆలవాలం .ఇక్కడి చింతామణి సరస్సు లో స్నానిస్తే ఆరోగ్యమే కాదు పవిత్రతా సిద్ధిస్తుంది .ఈ జలాశయం ఎప్పుడూ స్వచ్చమైన జలంతో నిండుగా కను విందు చేస్తుంది .ఈ జలాన్ని త్రాగి పునీతులై ఆరోగ్యాన్ని పొందుతారు .

స్పాంజి  వీరాంజనేయ స్వామి

దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న ఈ దేవాలయాన్ని చేరటానికి అన్ని రకాల వసతులు కల్పించారు .స్వామికి నిత్యకళ్యాణం పచ్చతోరణం .బ్రహ్మోత్సవాలు ఘనం గా నిర్వహిస్తారు .వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతిని పరమ వైభవంగా జరుపుతారు .హేమాచలం అర్ధ చంద్రాకారం గా ఉంటుంది .ఈ కొండ ఘాట్ ను,ప్రక్రుతి సంపదను  శ్రీ వీరాంజనేయ స్వామి సదా రక్షిస్తూ ఉంటాడు .ఈ స్వామికి చక్కని చిన్న ఆలయం ఉంది .చిన్న విగ్రహం అయిన ఈ స్వామి నిచేతితోపట్టుకొని నొక్కితే సొట్ట పడి చేయ్యితియ్యగానే మళ్ళీ మామూలు రూపం వస్తుందట .ఇదో విశేషం  .ఇక్కడే శ్రీ భవానీ శంభు లింగేశ్వర దేవాలయం ఉన్నది .సీతారామ ,వేణుగోపాల ఆలయాలు ఉన్నాయి .ఈ దేవాలయాలన్నీ శిధిలా వస్తలో ఉండటం విచారకరం .

మానవ శరీరం లాగా మెత్తగా ఉండే  నరసింహ స్వామి ప్రత్యేకతలు

భద్రాచలానికి తొంభై కిలో మీటర్ల దూరం లో వరంగల్ కు నూట ముప్ఫై కిలోమీటర్లలో  ఉన్న హేమాచల లక్ష్మీ నరసింహ దేవాలయం అద్భుతాలకు నిలయం .భరద్వాజ ,గౌతమ మహర్షులు పూజించిన దేవాలయం ఇది .మూల విరాట్ అయిన యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఎత్తు పది అడుగులు అవటం ఒక విశేషం .మూల విరాట్ ఉదర భాగం మనిషి చర్మం లాగా చాల మెత్తగా ఉండటం మరో వింత. ఆలయ ధ్వజస్తంభం అరవై అడుగులు ఉండటం మరో చివిత్రం .స్వామి నాభి నుండి నిరంతరం రక్తం లాగా ఎర్రటి నీరు స్రవిస్తూ ఉండటం మరో విశేషం .అందుకని చందనంపూత పూస్తారు .ఈ చందనాన్ని ప్రసాదంగా తీసుకొనే ఆడవారికి గర్భం నిలుస్తుంది అని విశ్వాసం . స్వామి చతుర్భుజుడు .శంకు, చక్ర, గద,పద్మదారి ఎక్కడా ఏ నరసింహ స్వామికి లేని విధం గా ఇక్కడ స్వామికి ‘’తైలాభిషేకం ‘’చేయటం వింతలలో వింత .ప్రక్కనే చెంచు లక్ష్మి అమ్మవారు ఉంటారు .విగ్రహం లో స్వామి కంఠం నుండి కిందిదాకా మానవాకృతి .అందుకే మెత్తగా ఉండటం ..పాదాల నుండి కూడా నిరంతరం జలం ఊరుతుంది .

ఉగ్ర ఆంజనేయ స్వామి

కొండ చరియలో ఒక ఉగ్ర ఆంజనేయ స్వామి విగ్రహం , నరసింహాలయానికి సమీపం లో ఉన్నది ఇలా ఉగ్రరూప హనుమాన్ దక్షిణ భారతం లో ఎక్కడా లేదు .2003గోదావరి పుష్కరాలకు నరసింహలయాన్ని  పునర్నిర్మించి శోభాయమానం చేశారు.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-15-ఉయ్యూరు

 

.

ImageInline image 1

 

Inline image 2Image result for narasimha temple mallur

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-15-ఉయ్యూరు

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.