ఉయ్యూరు లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర14-5-2023

ఉయ్యూరు లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
14-5-2023

ఉయ్యూరు పట్టణంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ముందుగా శ్రీ సువర్చలాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, సరసభారతి అధ్యక్షులు బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్,బిజేపి జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ దీవి చిన్మయ , శ్రీ శ్రీనివాస విద్యాసంస్థల అధినేత డాక్టర్ పరుచూరి శ్రీనివాస్, ఉయ్యూరు శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ సిహెచ్ వి వి కుటుంబ రాజు పలువురు ప్రముఖులు పూజలలో పాల్గొని అనంతరం శోభాయాత్ర లో పొల్గొన్న భక్తులకు జెండాలు,
కండువాలను అందజేశారు.
ముఖ్యంగా ఉత్సహంగా శోభాయాత్ర లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలకు వీరనారి రుద్రమదేవి తలపాగలను అతిధుల చేతుల మీదుగా అందచేశారు.పూజలు
అనంతరం పెద్ద వంతెన సెంటర్ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుండి బయలుదేరిన శోభాయాత్ర ఉయ్యూరు పురవీధులలో కొనసాగింది.హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సహంగా శోభాయాత్ర లో పాల్గొన్నారు.
చివరిగా శ్రీ సువర్చలాంజనేయ స్వామి వారి సన్నిధిలో భక్తులకు ప్రసాదాలను పానకాన్ని పంపిణీ చేశారు. ఉయ్యూరులో శ్రీ హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేయడానికి సహకరించిన పెద్దలకు, భక్తులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు శోభాయాత్ర నిర్వహణ బాధ్యతలు నిర్వహించిన హరీష్, రాజేష్ సాకి వారి మిత్ర బృందం ధన్యవాదాలు తెలియజేశారు.బైక్ ర్యాలీలో దారి పొడుగునా ఉన్న ఆలయాల వద్ద శోభాయాత్రకు ఆయా ఆలయ కమిటీలు స్వాగతం పలికారు. శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ కోదండ రామాలయం(గౌడ రామాలయం), శ్రీ హనుమాన్ నగర్ ఆంజనేయస్వామి గుడి, శివాలయం రోడ్ లోని సాయిబాబా ఆలయం వద్ద ఆంజనేయ స్వామి గుడి, శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ల వద్ద శోభాయాత్ర కు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. బస్టాండ్ సెంటర్ లోని శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద మొదలైన శ్రీ హనుమాన్ శోభాయాత్ర తోట్లవల్లూరు రోడ్
కొత్త వంతెన రావి చెట్టు రోడ్డు మార్కెట్ మెయిన్ రోడ్ రింగ్ సెంటరు కాటూరు రోడ్ అయ్యప్ప స్వామి గుడి బైపాస్ సర్వీస్ రోడ్
మెయిన్ రోడ్ వీరమ్మ తల్లి గుడి మీదగా మెయిన్ సెంటర్ నుండి శివాలయం రోడ్ తిరిగి వల్లూరు రోడ్ కొత్తవంతెన దగ్గర ముగిసింది.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.