ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి

ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి

ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి

 శ్లోకం –  శ్రీ సువర్చలాదిష్టిత వామ భాగం -నిరస్త కందర్ప సురూప దర్శనం

భానుప్రభం రాఘవ కార్య దక్షం –అస్మత్కులేశం శ్రీ హనూమంత మీడే.

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభ కృత్ నామ సంవత్సర  వైశాఖ బహుళ దశమి 14-5-23 న శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో 12-5-23 శుక్రవారం  నుంచి 14-5-23  ఆదివారం  వరకు త్రయాహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహింపబడును .భక్తులు కార్యక్రమ౦  లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొని తరించ ప్రార్ధన –.

  కార్యక్రమం

12-5-23- వైశాఖ బహుళ  అష్టమి  శుక్రవారం    –ఉదయం -5గం .లకు స్వామివార్లకు అష్ట కలశ స్నపన ,మన్యుసూక్తం తో అభిషేకం ,నూతన వస్త్ర ధారణ, స్వామివార్లకు  మల్లెపూలు ,వివిధ పుష్పాలతో , గంధ సిందూరం తో అష్టోత్తర సహస్రనామార్చన ,నైవేద్యం మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం .

      సాయంత్రం -6-30కు సరసభారతి కార్యక్రమంగా – సంగీతం టీచర్ శ్రీమతి జి.మాధవి బృందం చే భక్తి  సంగీత  విభావరి  .

13-5-23   వైశాఖ బహుళ నవమి  -శనివారం    -–ఉదయం 9గం లకు –మామిడిపండ్లతో  విశేష అర్చన నైవేద్యం మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం.

 సాయంత్రం 6-30కు సరసభారతి కార్యక్రమంగా –చిన్నారి కోషిత శ్రీవల్లిక చే నాట్య ప్రదర్శనం .

14-5-23-వైశాఖ బహుళ దశమి ఆదివారం – శ్రీ హనుమజ్జయంతి

            ఉదయం 5గం .నుంచి 9-30వరకు –తమలపాకులతో ప్రత్యేక పూజ

              ఉదయం -10గం .లకు శ్రీ సువర్చలా౦జనేయస్వామి వారల శాంతికల్యాణ మహోత్సవం

   అనంతరం నైవేద్యం,మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం

  సాయంత్రం -6గం.లకు కాలనీ మహిళా మండలి వారిచే శ్రీ  హనుమాన్ చాలీసా పారాయణ ,స్వామి వారలకు ‘’వడమాల’’తో ప్రత్యేక అర్చన . అనంతరం నైవేద్యం,మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం

 గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త ,మరియు భక్తబృంద౦-16-4-23 –ఉయ్యూరు .

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.