దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2 -84 దక్షిణ ముఖ హనుమాన్ మందిర్ -షిర్డీ

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2 -84

దక్షిణ ముఖ హనుమాన్ మందిర్ -షిర్డీ

మహారాష్ట్రలోని ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా మందిరం బయట ఉన్న శ్రీ దక్షిణ ముఖి హనుమానాలయానికి ఒక చరిత్ర ఉంది .ఇందులో హనుమాన్ విగ్రహాలు రెండు ఉన్నాయి .పూనా తంబే కు చెందిన  దేవీదాస్ మరియు గంగా ఘీర్అనే ఇద్దరు సాదు పుంగవులు షిర్డీ క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ దేవాలయం లోనే బస చేసేవారు .భక్తులు తనకు కానుకలుగా సమర్పించన దక్షిణ డబ్బు తో ఈ దేవాలయాన్ని సాయిబాబా మరమ్మతు చేయించాడు .కనుక దీనికి దక్షిణ ముఖీ మారుతి దేవాలయం అనే పేరు వచ్చింది స్వామి దక్షిణాభి ముఖంగా కూడా ఉంటాడు .

చావడి ఉత్సవాలు జరిగినప్పుడు సాయిబాబా  ఈ దక్షినముఖి ఆంజనేయ ఆలయం వద్ద ఆగి చేతులు ఊపుతూ వింతగా ప్రవర్తిస్తూ కొన్ని నిమిషాలు మౌనంగా నిలబడేవాడు .ఇప్పుడు పల్లకీ ఉత్సవం లో కూడా ఇక్కడ ఆపి చోప్ దార్లు లాల్కరీ నిర్వహిస్తూ బాబా ఆచారాన్ని కొనసాగిస్తున్నారు .నామజపం చేసుకోవటానికి మహా ప్రశాంతంగా ఈ ఆలయం ఉపయోగ పడుతోంది .శ్రీరామ నవమి అనంతరం వచ్చే శ్రీ హనుమజ్జయంతిని  ఈ ఆలయం లో పెద్ద ఎత్తున ఘనం గా నిర్వహిస్తారు .

ఈ హనుమ ఆలయం వెలుపల రావి వేప వ్రుక్షాలున్నాయి వీటికింద శ్రీ బి వి.నరసింహ స్వామి నాగ ప్రతిష్టను చేశారు .బొంబాయికి చెందిన మూర్తికార్ బజ్రే రావు దాల్వే 11-2-1983 న శివలింగాన్ని ,నందిని ప్రతిస్టించాడు .మహా శివ రాత్రినాడు  పల్లె ప్రజలు ఈ  శివలింగం వద్ద గొప్ప ఉత్సవం భక్తీ శ్రద్ధలతో నిర్వహిస్తారు .షిర్డీ లోని సాయి సంస్థాన్ ఈ రెండు విగ్రహాల బదులు పకే విగ్రహం ఉంటె బాగుంటుందని భావించి ఆలయ మరమ్మతులు చేసి నల్ల  మార్బుల్  రాయితో దక్షిణ ముఖి ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కించి ప్రతిష్టించింది .పాత జంట మార్బుల్ విగ్రహాలను సంస్థాన్ మ్యూజియం లో భద్ర పరచింది .శ్రీరామనవమి ముందు ప్రారంభించి హనుమజ్జయంతి వరకు హోమాలు నిర్వహించారు .షిర్డీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకొన్నా వారందరూ తప్పక ఈ దక్షిణ ముఖి హనుమాన్ దర్శనం చేసి తరిస్తారు .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట  దుర్గా ప్రసాద్ -13-3-16—కాంప్ బాచుపల్లి –హైదరాబాద్

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.