మండపాక శ్రీ యల్లారమ్మ దేవాలయం శ్రీ కేశవ స్వామి ఆలయం

మండపాక(MANDAPAKA), పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన గ్రామము.[1].
మండల కేంద్రము: తణుకు(3.645 కి.మీ) | జిల్లా కేంద్రము: ఏలూరు(59.62 కి.మీ) | రాష్ఠ్ర కేంద్రము: హైదరాబాదు(348 కి.మీ)
పిన్ కోడ్: 534 218 | STD కోడ్:8819
అక్షాంశము(Latitude):16.74065 | రేఖాంశము(Longitude):81.6623
మండపాక గ్రామం పలు విషయాలలో జిల్లా లోనే ఆదర్శ గ్రామంగా ఖ్యాతి గాంచింది. ఎంతో కాలంగా ఈ గ్రామం వ్యవసాయాధారమైన గ్రామమై ఉన్నది. ఈ గ్రామానికి చెందిన శ్రీశ్రీశ్రీ యల్లారమ్మ వారి దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు గాంచినది. ప్రతీ సంవత్సరం అమ్మవారికి జరుగు వసంతోత్సవాలు ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొని వస్తున్నాయి అని అనడంలో అతిశయోక్తి లేదు. మండపాక గ్రామానికే చెందిన శ్రీ కేశవస్వామి వారి దేవస్థానం ఎంతో పురాతనమయిన ఆలయంగా చెప్పబడుతున్నది. గ్రామస్తులందరూ విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడంవల్ల వారి పిల్లలందరూ చక్కటి విద్యను అభ్యసించ గలుగుచున్నారు. నవతరం ప్రతినిధులైన గ్రామ యువత గ్రామ సంస్కృతిని గౌరవిస్తూనే ప్రస్తుత ఆధునిక ప్రపంచం కల్పిస్తున్న అవకాశాలను సమర్థవంతంగా అంది పుచ్చుకుంటూ అనేక రంగాలలో రాణిస్తున్నారు. ప్రతీ సంవత్సరం జరుగు యల్లారమ్మ వసంతోత్సవాలకు ఈ గ్రామస్తులు ప్రపంచ నలుమూలలలో ఎక్కడ ఉన్ననూ ఈ ఉత్సవాలకు హాజరవడానికి ఎంతో ఉత్సుకత చూపడం విశేషం.

మండపాక

సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు
అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు
చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి..

అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయంగా, కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ, అమృతమయమైన కవితా ఝురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ ఈ గ్రామంలోనే జన్మించారు.

1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.