దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 262-శ్రీ గేజేటేడ్ హనుమాన్ దేవాలయం –జై సల్మీర్

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

262-శ్రీ గేజేటేడ్  హనుమాన్ దేవాలయం –జై సల్మీర్

రాజస్థాన్ లో  అందమైన పట్టణం జై సల్మీర్ .అక్కడ పాత పవర్ హౌస్ లోపల  శ్రీ గెజేటేడ్ ఆంజనేయ దేవాలయం ఉన్నది .ఇది హనుమాన్ సర్కిల్ కు అతి సమీపం లో ఉంది .ఆలయ పునర్ నిర్మాణం  భారీ ఎత్తున జరుగుతోంది

Image result for hanuman temple at jaisalmer

ఇది పాత దేవాలయం

263-పంకీ హనుమాన్ దేవాలయం –కాన్పూర్

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో భాగమైన పంకిలో ఉన్న హనుమాన్ దేవాలయం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది .చాలా ఎత్తు  మీద ఉన్న ఈ ఆలయం కు వెళ్ళాలంటే కస్టపడి వెళ్ళాల్సిందే .ప్రస్తుతం  పెద్ద పెద్ద కు౦భాలతో  భారీ నగిషీలతో ఆలయ నిర్మాణం జరుగుతో౦ది .ఆలయానికి సుమారు 400 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది .మహాంత్ శ్రీ శ్రీ 1008పురుషోత్తం దాస్ మహారాజ్ ఈ ఆలయాన్ని మొదట గుర్తించారు .కన్హాపూర్ గా పిలువ బడే నేటి కాన్పూర్ పట్టణ నిర్మాణాన్ని ప్రారంభించిన రాజా హిందూ సింగ్ కాలం కంటే పూర్వపు ఆలయం ఇది.ఒకప్పుడు పురుషోత్తం మహా రాజ్ గారు చిత్ర కూటం లో పర్యటిస్తూ ఇటువైపువచ్చి ఇక్కడ ఒక రాయికి కాలుతగిలి తూలీ పడ బోయారు .తీరా చూస్తె అది శ్రీ ఆంజనేయ స్వామి .స్వామి మహిమగా దీన్ని భావించి తనతోబాటు ఆ విగ్రహాన్ని తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు .బండీ మీద ఎక్కించి తీసుకోస్తుండగా ఈ ప్రాంతానికి రాగానే ఎడ్లకు విగ్రహం బాగా బరువనిపించి అడుగులు నెమ్మదిగా వేస్తున్నాయి. గ్రహించిన మహంత్ ఆ రాత్రికి అక్కడ విశ్రమించారు .మహంత్ కు ఆంజనేయ స్వామి దివ్య లీల అని తెలిసి స్వామికి ఇక్కడే ప్రతిష్ట చేయటం ఇస్టమని  అర్ధం చేసుకొని  అందరి సహాయం తో విగ్రహాన్ని బండీ మీద నుంచి  అక్కడే ప్రతిష్ట చేశారు మహంత్ .ఈ ప్రదేశమే పంకి .ఇది బితూర్ లోని  వాల్మీకి ఆశ్రమానికి దగ్గరలోనే ఉంది .

భక్తులు ఈ హనుమాన్ నే పూజించేవారు. కాలక్రమం లో చిన్న దేవాలయం ఏర్పడింది .ఇదే పంకి హనుమాలయం .ఇప్పుడు చాలా ప్రసిద్ధ ఆలయం గా పేరు పొందింది .స్వామికి నివేది౦చుకొన్న కోర్కెలన్నీ తీరుతాయి అనే భావం బల పడింది .క్రమేపీ దేశం లోని భక్తులంతా పంకి హనుమాన్ ను దర్శించి తమ పాప పంకి లాన్ని దూరం చేసుకొంటున్నారు .ఉత్తర భారత దేశం లో ఈ ఆలయానికి ఒక విశిష్ట స్థానమేర్పడింది .ఇక్కడ విద్యుత్ఉత్పత్తి కేంద్రం వచ్చింది.గన్ ఫాక్టరీ కూడా  రావటం తో పంకి వైభవం అనేక రెట్లు పెరిగింది .

Inline image 1   Inline image 2Inline image 3

సశేషం

మీ- గబ్బిట  దుర్గా ప్రసాద్ -24-6-15-ఉయ్యూరు

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.