దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –2 241 –శ్రీ ఆంజనేయ ద్వయం –పట్టేశ్వరం –కుంభ కోణం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –2

241 –శ్రీ ఆంజనేయ ద్వయం –పట్టేశ్వరం –కుంభ కోణం

భీమాంజనేయ కధ

తమిళనాడు లోని కుంభకోణం దగ్గర పట్టేశ్వరం లో ఒకే రూపం లో ఉండే శ్రీ ఆంజనేయ ద్వయం విగ్రహాలు చూడ ముచ్చటగా ఉంటాయి .ఈ ఆలయానికి త్రేతాయుగ ద్వాపర యుగాల తో సంబంధం ఉంది . త్రేతాయుగం లో ఆంజనేయ స్వామి ఇక్కడ కదళీ వనం మధ్య ఉన్న అందమైన కోనేటి ఒడ్డున కూర్చుని రామనామ జపం చేసుకొనేవాడు .ఆ కోనేటిలో సహస్ర దళ పద్మం ఒకటి వికసించి పరిమళాలను చాలా దూరం వరకు వ్యాపింప జేసేది . ద్వాపర యుగం లో ద్రౌపదీ దేవి ఈ పద్మ గంధాన్ని దూరం నుంచే ఆఘ్నాణింఛి  భీముడిని ఆ పద్మాన్ని తీసుకొని రావలసిందిగా కోరింది .భీముడు ఇక్కడికి వచ్చాడు .అతన్ని పరీక్షించటానికి హనుమ ముసలి కోతి వేషం లో దారికి అడ్డం గా తోక జాపుకొని కూర్చున్నాడు .దారి తొలగమంటే కోతి తొలగ లేదు .ముసలి వాడిని కనుక తోక ఎత్తి ప్రక్కన పెట్టి  వెళ్ళమన్నాడు .కోతి తోకను భీముడు యెంత ప్రయత్నించినా కదప లేక పోయాడు .అప్పుడు ఆ ముసలి కోతి సాక్షాత్తు ఆంజనేయ స్వామిగా గ్రహించి క్షమాపణ కోరాడు . హనుమ ప్రత్యక్షమై ప్రసన్నుడై  తామిద్దరూ వాయు సుతులమేనని సోదరులమని చెప్పి భీముని కోర్కెను తెలుసుకొని  సహస్ర దళ పద్మాన్ని భీమునకిచ్చి ద్రౌపదికి అంద జేయమన్నాడు .

హనుమ ద్వయం

ఇక్కడ హనుమాలయాలు చాలా ఉన్నా శ్రీ గోపీనాధ స్వామియే ముఖ్య దైవంగా ఉంటాడు  ఇప్పుడు ఆంజనేయ ద్వయ దేవాలయం గా బాగా ప్రసిద్ధి చెందింది .రెండు వేర్వేరు  సంనిధులలో స్వామి వార్లను ఉంచి అర్చించే వీలు కల్పించారు ..వీరిద్దరికీ బృహత్తరమైన ఆలయాలను నిర్మించారు .ఈ క్షేత్రం లోనే భీమాంజనేయ సమాగమం జరిగింది కనుక దీనికి అత్యధిక ప్రాధాన్యత లభించింది . ఆంజనేయ స్వామి వారి రెండు విగ్రహాలు ఒకే మాదిరిగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది .రెండు విగ్రహాల ఎడమ చేతిలో సహస్ర దళ పంకజం ఉండటం ,కుడి చేయి పైకి ఎత్తి అభయ ఆశీర్వాద హస్తం గా ఉండటం  విశేషం .భక్త జనల కొంగు బంగారం  ఈ ఆంజనేయ ద్వయం ,.

గోపీనాధ దేవాలయం

కుంభ కోణం దగ్గర పజి యారి లో తొమ్మిదో శతాబ్దం లో చోళ రాజ్య పాలన ఉండేది .చోళ రాజులు ఈ ప్రాంతం లో ఎన్నో దేవాలయాలు నిర్మించారు .అందులో శ్రీ గోపీనాధ అంటే శ్రీ కృష్ణ దేవాలయం ముఖ్యమైంది .గోపీనాధ దేవాలయానికి ఏడు రాజ గోపురాలున్నాయి .వివిధ కాలాలలో చోళ రాజులు అనుబంధం గా అనేక కట్టడాలు కట్టారు .మాలికాఫీర్ దండయాత్రలో ఆలయం ధ్వంసం అయినా విజయ నగర రాజులు పునర్నిర్మించారు .గోపీనాధ స్వామి కి ఇరువైపులా రుక్మిణీ సత్య భామలు ఉండటం ఇక్కడి విశేషం .

Twin Anjaneyas, Sri Gopinatha Swamy temple, Patteeswaram, Kumbakonam  Inline image 1

Image result for gopinath temple patteeswaram

242శ్రీ -జయ వీరాంజనేయ దేవాలయం –పేరూర్ –కోయం బత్తూర్

తమిళనాడు లో కోయం బత్తూరు జిల్లా పేరూర్ లో శ్రీ జయ వీరాంజనేయ స్వామి దేవాలయం పురాతనమైనది .దివ్య వైభోగం తో తుల తూగుతూ ఉంటుంది  .చిన్న విగ్రహమే అయినా ముగ్ధ మనోహర రూపం లో స్వామి ఉంటాడు .నిత్యం వందలాది భక్తులు సందర్శిస్తారు.మంగళ శని వారాలలో అధికం గా వస్తారు. హనుమజ్జయంతి వైభవం గా నిర్వ హిస్తారు. రధోత్సవం చాలా గొప్పగా ఉంటుంది .ఇది వ్యాస రాయ ప్రతిస్తితం  నోయ్యాల్ నది ఒడ్డున ఉంది చిన్న గుడి చిన్న ప్రాకారం.

Inline image 2

సశేషం

మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -14-6-15

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.