దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 239- ఒకే అడుగు ఎత్తున్న శ్రీ ఆంజ నేయ స్వామి –కళ్ళ కూజి – తిరుచిరా పల్లి జిల్లా –తమిళ నాడు

— దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

239- ఒకే అడుగు ఎత్తున్న శ్రీ ఆంజ నేయ స్వామి –కళ్ళ కూజి – తిరుచిరా పల్లి జిల్లా   –తమిళ నాడు

తమిళ నాడులో  తిరుచి జిల్లాలా కుళ్ళు కూజి  లో  ఉన్న శ్రీఆంజనేయ దేవాలయం లో స్వామి విగ్రహం ఎత్తు ఒక్క అడుగు మాత్రమె .అదికూడా రాతి స్థంభం పై చెక్కిన విగ్రహం .కాలు ఎడమవైపుకు వంగిఓంకార మంత్రం స్వరూపం గా కనిపించటం గొప్ప విశేషం .ఎడమ చేతిలో పారిజాత పుష్పాన్ని కుడి చేత అభయ ముద్రనుకలిగి సదా తానూ భక్తులను రక్షిస్తూ ఉంటాను అని చెబుతున్నట్లు గోచరిస్తాడు .ముఖం ఉత్తరాభి ముఖం గా ఉండటం మరొక ప్రత్యేకత ..Kallukuzi-anjaneyar-temple

[Image1]

240-శ్రీ సంజీవ రాయ దేవాలయం -తిరుచి

తమిళనాడు లో తిరుచి  అనబడే తిరుచిరాపల్లి  లో శ్రీ సంజీవ రాయ దేవాలయానికి సుమారు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉంది .నాయక రాజులకాలపు ఆలయం .చెట్టియార్ ల అధీనం లో ఇప్పుడు ఆలయం నడుస్తోంది .నగర మద్యం లో శ్రీ భూమినాద ఆలయానికి సమీపం లో ఉన్నది .విశాలమైన ప్రాంగణం లో మూడు అంతస్తుల గోపురం తోమూడు కలశాలతో  ఆలయం విరాజిల్లు తోంది .రాజ గోపురం ఉన్న అతి తక్కువ ఆంజనేయ దేవాలయాలలో ఇది ఒకటి .అదీ దీని ప్రత్యేకత .విశాలమైన హాలు స్తంభాలపై నిర్మించబడింది .గర్భాలయం పైనున్న విమానం పై నాలుగు వైపులా గరుడ విగ్రహాలు ఉండటం మరో ప్రత్యేకత .గర్భ గృహానికి ముందు పదహారు స్తంభాల హాలుఉంది దీన్ని ‘’కోటికంభం’’ అంటారు .ఈ రాతి స్తంభాలు నాయక రాజుల కట్టడపు శైలికి ఆనవాలు .ఒకప్పుడు ఇక్కడి స్థంభం పైభాగాన ఆంజనేయ విగ్రహం ఉండేది. ఇప్పుడు తీసి గర్భాలయం లోనే ఉంచారు .

శ్రీ సంజీవరాయ హనుమాన్ విగ్రహం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది .’’అంజలి హస్తం ‘’తో స్వామి నిలబడి దర్శన మిస్తాడు .తోక చుట్టలు చుట్టుకొని కాలిని పెనవేసుకొని కనిపిస్తుంది .సర్వావయవాలకు ఆభరణాలు ధరించి స్వామి ధగ దగా మెరిసి పోతూ ఉంటాడు .విశాలమైన నేత్రాలతో సూటిగా చూస్తూ కనిపిస్తాడు .దీర్ఘ కటాక్షం తో స్వామి భక్తుల మనవి వింటూ పరి పూర్ణంగా అనుగ్రహిస్తూ కోరికలను తీరుస్తాడు .పంచ లోహ ఉత్సవ మూర్తిని 1929లో ఏర్పాటు చేశారు .1972,2002 లలో రెండు సార్లు మహా కుంభాభి షేకాలు నిర్వహించి స్వామి బింబ శుద్ధి చేసి మరింత వైభవాన్ని చేకూర్చారు .ప్రతి శనివారం తిరు మంజనం చేస్తారు. హనుమజ్జయంతిని పరమ వైభవం గా నిర్వహిస్తారు .తిరు ఊనం నాడు సంజీవ రాయనికి గ్రామోత్సవం అంటే ఊరేగింపు కన్నుల పండువుగా చేస్తారు .సంజీవ రాయ దర్శనం శుభ ప్రదం

.Inline image 2Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-15- ఉయ్యూరు

 

 

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.