దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 — 212- అభయ ఆంజనేయ దేవాలయం –సుల్తాననగరం –

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2
— 212- అభయ ఆంజనేయ దేవాలయం –సుల్తాననగరం –మచిలీపట్టణం
కృష్ణాజిల్లా మచిలీపట్టణం లో సుల్తాన నగర శ్రీ అభయ ఆంజనేయ దేవాలయం చాలా ప్రశాస్తికలిగి ఉంది .స్వామి కాళి దగ్గర గడ పెట్టుకొని కుడి మోకాలు భూమిపై ఆనించి ఎడమకాలు కొద్దిగా ప్రక్కకు ఉంచి కూర్చున్న విధానం లో దర్శనమిస్తాడు అభయ ముద్ర తో కుడు చేయి ఉంటె ఎడమ చేయి మోకాలిపై ఆనించి కనిపిస్తాడు తోక వెనక్కి బాగా పైకిలేచి ఉన్నట్లు కనిపిస్తుంది .నుదుట నామాలు ముచ్చటగా ఉంటాయి శిరస్సుకు ధగ ధగాయమానమైన కిరీటం ఉంటుంది .మేడలో దివ్యాభారణాలు  భుజకీర్తులు ఉంటాయి మూర్తి ని చూడగానే పరవశం కలుగు తుంది .నిత్య ధూప దీప నైవేద్యాలు ఆగమ విధానం లో నిర్వహిస్తారు .శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలను12 రోజులు  ఘనం గా ,దివ్యం గా నిర్వహిస్తారు .గ్రామోత్సవమూ చేస్తారు .అనేక సాంస్కృతిక కార్యక్రమాలను సాయం వేళ నిర్వహించటం ఇక్కడి ప్రత్యేకత  కింద ఫోటో జత చేయబడింది చూడండి

213-వల౦దపాలెం హనుమాన్ –మచిలీ పట్నం

ఇమిటేషన్ నగలకు ప్రసిద్ధమైన బందరులోని వలంద పాలెం లో శ్రీ ఆంజనేయ దేవాలయం ఉంది .దీనికే పోతేపల్లి ఆంజనేయ దేవాలయం అంటారు .

ఇదికాక భక్తాంజనేయ స్వామి దేవాలయం కూడా మచిలీ పట్నం లో ఉంది .వివరాలు తెలియలేదు .రాజు పేట లో మరొక ఆంజనేయ దేవాలయం ఉన్నది .

214 – తిరువూరు హనుమాన్

కృష్ణాజిల్లా తిరువూరులో రాజుపేట లో ప్రసిద్ధ ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది

215-పెదపాడు హనుమాన్ దేవాలయం

Inline image 5

పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరు దగ్గర పెదపాడుగ్రామం లో శ్రీ ఆంజనేయ దేవాలయం దర్శించ దగినది

Inline image 4

216-గు౦చి  హనుమాన్ దేవాలయం –విజయనగరం జిల్లా

విజయ నగరం జిల్లాలో గుమ్చి గ్రామం లో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని గుమ్చి హనుమాన్ దేవాలయం అంటారు .స్వామి మూర్తి మనోహరంగా ఉంది నిత్యం వేలాది భక్తులను ఆకర్షిస్తాడు .స్వామి దర్శనం జీవితం లో మరవులేని మరుపురాని మధురాను భూతిగా మిగిలిపోతుందని దర్శించిన వారి అనుభవం వలన తెలుస్తోంది .ఈ దేవాలయ సమీపం లో సుమారు 80 ప్రత్యెక స్థలాలు దర్శింప దగినవిగా ఉన్నాయి  గుమ్చి గ్రామం నేల్లిమర్లకు దగ్గర గా ఉంటుంది

Inline image 1

గబ్బిట దుర్గా ప్రసాద్

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.