శ్రీహనుమజ్జయంతి కార్యక్రమాలు

శ్రీహనుమజ్జయంతి కార్యక్రమాలు

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం –ఉయ్యూరు

ఉయ్యూరు  రావి చెట్టు బజారులో వేంచేసి ఉన్న శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి  కార్యక్రమం శ్రీ మన్మధ నామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి శని వారం 9-5-15 నుండి బహళ దశమి బుధవారం 13-5-15 వరకు  పంచాహ్నికం(5రోజులు) గా నిర్వహింప బడును .ప్రతి రోజు స్వామి వారల ‘’శాంతి కల్యాణం ‘’జరుగుతుంది .కల్యాణం చేయించదలచిన వారు మరియు ,అయిదు రోజుల పూజా కార్యక్రమం లో పాల్గొన దలచిన భక్తులు ఆలయ ధర్మకర్తను ,అర్చక స్వామిని సంప్రదించగలరు .ఈ కార్యక్రమం లో భక్తులు విశేషం గా పాల్గొని స్వామి వారల కృపకు పాత్రులు కావలసినడిగా కోరుతున్నాము .

కార్యక్రమ వివరాలు

9-5-15 శనివారం –వైశాఖ బహుళ పంచమి –

ఉదయం 5 గం లకు స్వామి వారలకు స్నపన ,మన్యు సూక్తం తో అభిషేకం –తర్వాత సహస్రనామార్చన –నైవేద్యం హారతి ,మంత్రం పుష్పం –తీర్ధ ప్రసాద వినియోగం

రాత్రి 6-30 లకు స్వామివార్ల శాంతి కల్యాణం

10-5-15 ఆదివారం –వైశాఖ బహుళ షష్టి

ఉదయం 8 గం లకు –పుష్పయాగం

రాత్రి 6-30 లకు శాంతి కల్యాణం

11-5-15 –సోమవారం –వైశాఖ బహుళ సప్తమి

ఉదయం 9- గం లకు –గంధ సిందూరం తో సామూహిక పూజ మరయు సామూహిక కుంకుమార్చన

రాత్రి 6-30 గం లకు శాంతి కల్యాణం

12-5-15 మంగళ వారం – వైశాఖ బహుళ నవమి

ఉదయం 9 గం లకు –మామిడి పండ్ల తో విశేషార్చన

రాత్రి 6-30 గం లకు –శాంతి కల్యాణం

13-5-15 బుధవారం –వైశాఖ బహుళ దశమి –పూర్వాభాద్ర నక్షత్రం(స్వామివారి జన్మ నక్షత్రం ) –శ్రీ హనుమజ్జయంతి

ఉదయం 4 గం లకు స్వామివార్లకు మన్యు సూక్తం తో అభిషేకం –నూతన వస్త్ర ధారణా ,-అలంకారం

ఉదయం 5 గం నుండి -10 గం ల వరకు తమలపాకులతో (నాగవల్లి )ప్రత్యేక అర్చన

ఉదయం 10 గం.ల  నుండి మధ్యాహ్నం 12 గం వరకు స్వామి వారల ‘’శాంతి కల్యాణం ‘’

మధ్యాహ్నం -12 గం కు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన ‘’దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ‘’(దేశ ,విదేశాలలోని 201శ్రీ  ఆంజనేయ దేవాలయాలచరిత్ర) గ్రంధా విష్కరణ –గ్రంధ ప్రాయోజకులు-(స్పాన్సర్)శ్రీ దుర్గా ప్రసాద్ గారి చిన్న మేనల్లుడు -ఛి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (జాయ్ వేలూరి –అమెరికా) –అంకితం –శ్రీ దుర్గాప్రసాద్ గారి అక్కయ్యా బావ గార్లు శ్రీ వేలూరి వివేకానంద శ్రీమతి దుర్గ దంపతులకు (జాయ్ వేలూరి తలిదండ్రులు).

మధ్యాహ్నం   12-15-గం .లకు –నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం

రాత్రి -6-30 గం లకు –కాలనీ మహిళా మండలి వారి చే ‘’శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ‘’భజన

శ్రీ మన్మధ ఉగాది శుభా కాంక్షలతో

ఉయ్యూరు -18-3-15                                                గబ్బిట దుర్గా ప్రసాద్ –ధర్మ కర్త

మరియు భక్త బృందం

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.