దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

ఒరిస్సా

129-జగన్నాధ పూరి

ఓడిశా రాష్ట్రం లో సుప్రసిద్ధ పూరీ జగన్నాధ క్షేత్రం లో జగన్నాధ మందిరం లో అన్ని ద్వారాల్లో శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు .పూర్వ ద్వారం లో ‘’ఫతే హనుమాన్ ‘’,పశ్చిమ ద్వారం లో ‘’వీరహనుమాన్ ‘’,ఉత్తర ద్వారం లో ‘’తపస్వీహనుమాన్ ‘’,దక్షిణ ద్వారం లో ‘’’’బారా బాయిహనుమాన్ ‘’,దర్శన మిస్తారు .ఈ మారుతి రూపాలే కాక శ్రీ మకర ధ్వజ హనుమాన్ ,మాతా అంజనాదేవి ,శ్రీ సురంగ హనుమాన్ ,శ్రీ శబ్ద భేది హనుమాన్ లను కూడా దర్శించాలి శబ్ద భేది హనుమాన్ సముద్ర గర్జనలను ఆపాడని ఐతిహాసిక కధనం ఉంది .

Inline image 1  

 

130-బేడీ హనుమాన్

పూరీ లో సముద్రం ఒడ్డున సంకెళ్ళ తో ఉన్న హనుమంతుని ‘’బేడీ హనుమాన్ ‘’అంటారు దీనికి ఒక కద ఉంది .పూరీ పట్టణాన్ని అప్పుడప్పుడు సముద్రం మీదికొచ్చి ముంచేస్తూ ఉండేది .జనం జగన్నాధ స్వామికి మొరపెట్టుకొన్నారు .ఆయన శ్రీరామునికి చెప్పాడు. రాముడు హనుమను సముద్రం పొంగ కుండా కాపలా గా నియమించాడు ..హనుమాన్ జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండేవాడు కాని అప్పుడప్పుడు శ్రీరామ దర్శనానికి వెళ్ళేవాడు .హనుమకు లడ్డూలంటే ప్రాణం వాటికోసమూ ఒక్కోసారి డ్యూటీ మానేసి వెళ్లి లడ్డూ ప్రసాదం తిని వచ్చేవాడు . ఆ వెళ్ళిన సమయం చూసి సముద్రుడు ఉప్పొంగి మళ్ళీ పూరీని ముంచేసేవాడు .జగన్నాధుడు శ్రీరామునికి తెలియ జేశాడు ..రాముడు కోప పడి హనుమంతుని కాళ్ళకు బేడీలు అంటే సంకెళ్ళు వేయించి   బెదీలపై శ్రీరామ  శ్రీ రామ రాయించి కదల కుండా చేశాడు .అప్పటి నుండి సముద్రం ఎప్పుడూ చెలియలి కట్ట దాటలేదు .మరి హనుమంతుని లడ్డూ చాపల్యం తీరేది యెట్లా అని రాముడే హనుమకు లడ్డూ ప్రసా దం సముద్రం దగ్గరకే పంపే ఏర్పాటు చేశాడు .దీనితో సముద్రునివలన బెదడ తప్పింది .హనుమ లడ్డూ ప్రేమా తీరింది  ఇక్కడి బెదీహనుమాన్ కు అప్పటి నుండి లడ్డూ ను ప్రసాదం గా చేసి నైవేద్యం పెట్టె ఆచారం వచ్చింది . ఇప్పటికీ సముద్ర తీరం లో బెదీహనుమాన్ దర్శన మిస్తాడు .ఈ కధను పండిత ప్రభుదత్త బ్రహ్మ చారి గారు  రాశారు .\

Inline image 2

131-. శ్రీ కార్య సిద్ధి హనుమాన్

ఇంద్ర నీల మణిపురాణం లో ఒక కదఉన్నది .ఒక ప్పుడు ఇంద్ర ద్యుమ్నుడు అనే రాజు పూరీ క్షేత్రాన్ని సందర్శించాడు   కాని అనారోగ్యం ఏర్పడి శ్రీ జగన్నాధ  సమేత బల భద్ర సుభద్రా దేవులను దర్శించలేక పోయాడు . స్వామిని దర్శించలేక పోయానని .మనసులో తీవ్రం గా మధన పడుతున్నాడు .అప్పుడు శ్రీ హనుమ ప్రత్యక్షమై ‘’నేను యుగ యుగాలుగా ఈ మందిరాన్ని పరి రక్షిస్తున్నాను .నేనిచ్చే బలం తో మీరు వెయ్యి చేతుల ఎత్తున్న మందిరం నిర్మించి అందులో శ్రీజగాన్నాధుని ప్రతిష్టిం చండి  .నేను’’ సిద్ధ హనుమాన్ ‘’రూపం లో మందిరాన్ని రక్షిస్తాను’’అని అభయమిచ్చాడు .పూరీకి ఉత్తరం గా ఇంద్ర ద్యుమ్న సరోవరం దగ్గర రాజు మహా మందిరాన్ని నిర్మించి జగన్నాధ ప్రతిష్ట చేశాడు  .ఇక్కడ హనుమ రాజుకిచ్చిన మాట ప్రకారం మందిర కాపలా దారుడిగా ఉన్నాడు .అందుకే ఈ ఆలయం లో ముందు శ్రీ హనుమను పూజించి తర్వాతే జగన్నాధ మందిర నిర్మాణం చేశాడు .Inline image 3Inline image 4

132-ఉడతా హనుమాన్ –పూరీ

పదహారవ శతాబ్దం లో ఒక భయంకర తుఫానుకు శ్రీ జగన్నాద స్వామి విశాలమైన నీల చక్రం వంకర తిరిగిపోయింది .దాన్ని సరిచేయటానికి ఏంతో మంది ఎన్నో విధాల ప్రయత్నాలు చేశారు. కాని ఎవరివల్లా కాలేదు .అప్పుడు శ్రీ సంత దాసు అనే మహా భక్తుడు శ్రీ హనుమను ప్రార్ధించగా హనుమ పెద్ద వానరాకారం తో ప్రత్యక్షమై నీల చక్రాన్ని సరిచేసి పెద్దగా  హుంకార శబ్దం చేస్తూ జగన్నాధ మందిర దక్షిణ భాగం లోకి ,అదృశ్యమయ్యాడు .ఆ ప్రదేశం లో రాజశ్రీ ప్రతాప రుద్రుడు’’ఉడతా హనుమాన్ ‘’మూర్తిని ప్రతిస్టించాడు

.Inline image 10Inline image 11

133-   భుజాలపై రామ ముద్ర ,చూడామణి ఉన్న హనుమాన్-సిరులి

భువనేశ్వర్ –పూరి రహదారిలో చందన్ పూర్ నుండి సుమారు పదికిలో మీటర్ల దూరం లో సిరులి గ్రామం ఉంది .ఇక్కడ హనుమాన్ ఆలయం ఉన్నది .స్వామికి ఎడమ భుజానికి కుదిభుజానికి మధ్య ఎనిమిది అడుగుల దూరం ఉండటం పెద్ద ఆశ్చర్య కరమైన విషయం వింత విశేషం విచిత్రం .అంతేకాదు హనుమ ఎడమ భుజం పై శ్రీరాముని రాజముద్ర  కుడి భుజం పై సీతాదేవి చూడామణి ఉండటం మహా విశేషం .నల్ల క్లోరైట్  శిల తో చేయబడిన పది అడుగుల విగ్రహం ఇది . .నిలబడి ఉన్న భంగిమలో స్వామి దర్శన మిస్తాడు . ఎడమ చేతిలో చిన్న  బాకు కుడి చేతిలో గంధ మాడన పర్వతం ఉంటాయి .మురాసురసంహారం చేస్తున్న భంగిమలో ఉంటాడు స్వామి. పీఠంపై తల్లి అంజనాదేవి విగ్రహం ఉంటుంది .హనుమ ఎడమ కన్ను శ్రీ జగన్నాధుని వైపుకు ,కుడికన్నులంక వైపుకు చూస్తున్నట్లు ఉంటాయి .శిరసుపై ఉన్న శివలింగం ఏడు సర్పాల తో పరి వేష్టితమై ఉండటం విచిత్రం .హనుమ గుండె చీల్చి శ్రీరామ  సీతాదేవి లను చూపిస్తున్నట్లున్డటం మరో విశేషం .అందుకే ఈ స్వామిని ‘’మహావీర హనుమాన్ ప్రభు ‘’అని సంబోధిస్తారు .నిత్యం వేలాది భక్తులు హనుమంతుడిని సందర్శిస్తారు .ఇక పర్వది దినాలలో భక్తుల సంఖ్య లెక్కించ లేనంత ఉంటుంది .మకర సంక్రాంతి శ్రీరామ నవమి డోలా పూర్ణిమ లను ఘనం గా నిర్వహిస్తారు.Inline image 5

134-హనుమాన్ వాటిక –రూర్కెలా

హనుమాన్ వాటిక లేక హనుమ వనం రూర్కెలా లో ఉంది .దీనిలో 75 అడుగుల ఎత్తున్న శ్రీ ఆంజనేయస్వామి భారీ విగ్రహం ఉంది ఒరిస్సాలో ఇంత  భారీ విగ్రహం ఇంకెక్కడా లేదు . దీన్ని ఆ నాటి ముఖ్య మంత్రి బిజూ పట్నాయక్ ఆవిష్కరించాడు .ప్రతిఏడాది ఫిబ్రవరి ఇరవై మూడవ తేని ఆవిష్కరణ దినోత్సవం నిర్వహిస్తారు .ఇందులో చాలా దేవాలయాలున్నాయి ముఖ్యం గా జ్యోతిర్లింగాలు,బట్ట మంగళాదేవి ,సరళాదేవి జగన్నాధ మందిరాలు చూడదగ్గవి .

Inline image 8135- జగతి హనుమాన్

బౌద్ద్ జిలాలో లక్ష్మీ ప్రసాద్ గ్రామ పంచాయితీకి దగ్గర జగతిలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రముఖమైనది .ఈ గ్రామం సోమ వంశ రాజుల రాజ దాని గా ఉండేది  అప్పటి పేరు యయాతి నగరం .

ఒకరోజు చెరువులో చేపల పట్టే జాలరికి   వలలో కోటి ఆకారం తో ఉన్న  రాయి పడింది .దాన్ని బయటికి తీసి మళ్ళీ చెరువులోకి విసిరిపారేశాడు .ఆ రాత్రి అతనికి కలలో హనుమ కనిపించి వాడు పారేసింది తన విగ్రహమే నని చెప్పాడు .మర్నాడు చేపల వేటకు వెడితే చేపా తో బాటు కోతిమార్కు విగ్రహం వలలో చిక్కింది. జాగ్రత్తగా బయటికి తీసి ఒడ్డున శుభ్రం చేసిన ప్రదేశం లో ఉంచి పూజ  నిత్యం భక్తితో పూజించాడు ,మొదటిరోజున విగ్రహం చిన్నదిగా నే ఉంది కాని రోజు రోజుకూ సైజు పెరగటం ప్రారంభించింది .జాలరి కంగారు పడుతున్నాడు .ఆరు అడుగుల వరకు విగ్రహం పెరిగిపోయింది .జాలరి భక్తుడు ఇలా దిన దిన ప్రవర్ధమానం అయితే తానూ ఎలా పూజించాగాలను అని దేవుడికి మొర పెట్టాడు .అంతే  మళ్ళీ  విగ్రహం పెరక్కుండా అలానే నిలిచిపోయింది .

ఊరిజనానికి ఈ విషయమంతా చెప్ప్పాడు .అందరి సహాయం తో చేతనైనంత దేవాలయాన్ని కట్టించాడు .తర్వాత మహారాజు పూనుకొని సువిశాలమైన ఆలయ నిర్మాణం చేసి స్వామి భక్తీ చాటుకొన్నాడు .ఆలయం విమానం ,నాట్య మండపం ,జగన్మొహనం ,భోగమండ పాలు నిర్మించారు

.Inline image 9

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-1-15-ఉయ్యూరు

. .

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.