దర్శ నీయ ఆంజనేయ దేవాలయాలు – రాజస్థాన్

    దర్శ నీయ ఆంజనేయ దేవాలయాలు –

                     రాజస్థాన్

103-మొహిందీపూర్ హనుమాన్

 రాజస్థాన్ లోజైపూర్ నుండి బందీకుయి కి వెళ్ళే దారిలో అరవై అయిదు కి మీ దూరం లో మేహిందీపూర్ లో రెండు కొండల మధ్య ఉన్న అత్యంత ప్రాచీన హనుమ దేవాలయం ఉంది .దీనికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది .రాజస్థాన్ దేవాలయాలలో చాలా ప్రసిద్ధి చెందింది .మొగలాయీ పాలకులు ఈ దేవాలయాన్ని విధ్వమాసం చేయటాని ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు .వారికి అలవి కాలేదు .స్వామి మహిమ అంత గొప్పది .స్వామి మీసాలతో ఉండటం ఇక్కదిప్రత్యేకత ఆ మీసాల హనుమన్న ను చూసి మొగలాయి పాలకులు ఝడుసుకొని పారిపోయి ఉంటారు .అంత పవర్ఫుల్ స్వామి .

 
Inline image 1

104 విరాట్ నగర్ –వీర హనుమాన్

  రాజస్థాన్ లో జైపూర్ నుండి అలవర్ వెళ్ళే దారిలో విరాట్ నగర్ ఉంది .పాండవులు అజ్ఞాత వాసం చేసిన ప్రదేశం ఇదే .ఇక్కడే భీముడికి కీచకుడికి యుద్ధం జరిగి కీచకుడిని భీముడు నర్తన శాలలో మట్టు పెట్టాడు .ఇక్కడే భీముని గుహ ఉన్నది .గుహ దగ్గర చిన్న కొండలు కలిసే చోట శ్రీరాముడు నిర్మించిన వీర హనుమాన్ దేవాలయం ఉంది .మత్స్య దేశ రాజు విరాటుడు పాలించిన నగరం .విరాట రాజు సోదరుడు మీనుడు .మత్స్య దేశం లో కుచ్చ ఒక చిన్న రాజ్యం దీన్ని మీనుడుపాలించాడు .

Inline image 2

104స్వయంభు హనుమాన్ –బడా గావ్

 రాజస్థాన్ లో నాగౌర్ –చాకే నొర్ రైల్వే లైన్ లో శ్రీ బాలాజీ రైల్వే స్టేషన్ ఉంది .స్టేషన్ కు సుమారు అరకిలో మీటర్ దూరం లో ఒక కొండపై స్వాయంభు శ్రీహనుమాన్ మందిరం ఉంది .ఇక్కడ మూడు వందల యాభై ఏళ్ళ క్రితం పరమ భక్తుడు శ్రీ శుక దేవ్ మహా రాజ్ పన్నెండు ఏళ్ళు తీవ్రం గా తపస్సు చేశారు .మారుతి ప్రత్యక్షమై వరం కొమనగా స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్ధించారు హనుమ అంగీకరించి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు అక్కడ వెలుస్తానని చెప్పాడు .ఆ సమయానికి శుక స్వామి వేలాది ప్రజలను అక్కడికి చేరేట్లు చేశారు .సరిగ్గా చైత్ర శుక్ల పౌర్ణమి మధ్యాహ్నం అందరి సమక్షం లో కొద్దిగా భూమి కంపించి కొండలో నుంచి శ్రీహనుమంతుడు స్థంభ రూపం లో బయటికి వచ్చి స్వయంభు గా వెలిశాడు .అందుకే ఇది చాలా మహిమ గల క్షేత్రం అయింది వేలాది భక్తులకు స్వామి  ఇష్ట దైవమై కోరిన కోర్కెలను తీరుస్తూ అభయ ప్రదానం చేస్తున్నాడు .ఈయననే బాలాజీ హనుమాన్ అని పిలుస్తారు .అన్ని చోట్ల ఉన్నట్లుకాకుండా ఇక్కడి స్వామి విశేషం గా వింతగా దర్శన మిస్తాడు .గుండ్రనిముఖం తో మీసాలు గడ్డాలతో ప్రత్యేకం గా కనిపిస్తాడు .1811 శ్రావణ పౌర్ణమి నాడు మోహన్ దాస్ మహారాజ్ మట్టిఇటుకలతో  తో ఆలయాన్ని నిర్మించారు .ఫతేపూర్ శేఖా వతికి చెందినముస్లిం  శిల్పులు  దారా మరియు దావూలు  నిర్మించిన దేవాలయం ఇది .తర్వాత కాంక్రీట్ ఆలయాన్ని షికార్ జాగిర్దార్ ఆ తర్వాత ఆయన కొడుకు దేవీ సింగ్ లు కట్టారు .బందిపోట్ల బారి నుండి బాలాజీ హనుమాన్ వీరిని రక్షించినందుకు కృతజ్ఞతగా ఆలయ నిర్మాణం చేశారు .ఆ తర్వాత అనేక మంది పోషకులు ఇప్పుడున్న వైభవ స్థితిలో ఆలయ నిర్మాణం చేశారు .ఆలయం లోపల శిల్ప కల అత్యద్భుతం గా ఉంటుంది .బంగారు వెండి లతో ఆలయాన్ని సర్వాంగ సుందరం చేశారు .

      దధీచి మహర్షి వంశానికి చెందిన  బ్రాహ్మణులు ఈ ఆలయ అర్చకులు .ఆలయాన్ని హనుమాన్ సేవాసమితి నిర్వహిస్తోంది నిత్యం ‘’సవామని’’ అనే యాభై కిలోల ప్రసాదం చేసి స్వామికి నైవేద్యం పెట్టటం ఆచారంగా వస్తోందిక్కడ .రామాయణ   సుందరకాండ పారాయణం  భజన కీర్తన గానం నిత్యం ఇక్కడ జరుగుతాయి .చైత్ర పౌర్ణమినాడు శ్రీ హనుమజ్జయంటిని వైభవం గా చేస్తారు .లక్షలాది భక్తులు ఆ రోజున ఆలయానికి వచ్చి బాలాజీ హనుమాన్ ను సందర్శించి పూజించి జన్మ సాఫల్యం చేసుకొంటారు .ఆశ్వయుజ శుక్ల చతుర్దశి ,పూర్ణిమ రోజుల్లో బ్రహ్మాండ మైన ఉత్సవం తిరుణాల జరుగుతుంది .లెక్కకు మించి భక్తులు వివిధ ప్రాంతాలల నుండి వస్తారు .అలాగే భద్ర పద శుక్ల చతుర్దశి పౌర్ణమి రోజుల్లోనూ ఇదే విధం గా ఉంటుంది .ఉచిత భోజనం అందరికి ఏర్పాటు చేస్తారు .స్వామి పేర ఆధార కార్డ్ కూడా వెలువడింది -కంగారుపడకండి .వికీ కుమార్ అనే కుర్రాడి ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా పడలేదని ఆధార కార్డ్ ఇవ్వకపోతే స్వామి అడ్రస్ ‘’పవన్ జీ ‘’అని ఇచ్చాడు .అప్పుడు స్వామిపేరే ఆధార కార్డ్ వచ్చింది .

Inline image 3Inline image 4

-105-బంగారు సింహాసనంపై హనుమ –సాలాసర్

 రాజస్థాన్ లో చురు జిల్లా లోని సాలాసర్ గ్రామం లో హనుమ ను శ్రీ మోహన్ జీదాస్ అనే  పరమ భక్తుడు ప్రతిష్టించారు .అతి విశాల దేవాలయం కట్టించాడు .ఈ మందిరం లో భవ్య ప్రతిమా రూపం లో భగవాన్ మారుతి స్వర్ణ సింహాసనం పై  దర్శన మిస్తాడు సింహాసనం పైభాగం లో శ్రీ రామ పట్టాభి షేక విగ్రహాలూ ఉంటాయి .ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది .దగ్గరలోనే రాణి సతి దేవాలయం ఉంది .

         నాగోర్ జిల్లా అసోట్ లో ఒక జాట్ రైతు పొలం దున్నుతుంటే భూమిలో శ్రీహనుమ విగ్రహం దొరికింది .బయటికి తీశాడు. భార్య పమిట చెంగుతో శుభ్రం చేసింది .భక్తితో పూజించారు దంపతులు .మోహన్ దాస్ జీ కి కలలో కన్పించి తనను ప్రతిస్టిం చమని చెప్పాడు స్వామి .రైతుకు దొరికిన విగ్రహాన్ని సాలాసర్ కు తెప్పించి ప్రతిష్ట చేశారు స్వామీజీ .జోడెడ్ల బండీమీద విగ్రహాన్ని తెప్పిస్తుంటే ఎడ్లు ఇక్కడికి వచ్చి ఆగిపోయాయి .ఇదే తగిన ప్రదేశం గా భావించి దాసు గారు ఇక్కడే స్వామిని ప్రతిష్టించారు .

Inline image 5  

  సశేషం

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1 -2015-ఉయ్యూరు

 

                                        

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.