దర్శనీయ ఆంజ నేయ దేవాలయాలు –91 – మహారాష్ట్రలో శ్రీ సమర్ధ రామ దాస స్వామి

దర్శనీయ ఆంజ నేయ దేవాలయాలు –

91 – మహారాష్ట్రలో శ్రీ సమర్ధ  రామ దాస స్వామి స్థాపించిన అతి ముఖ్యమైన హనుమాన్ దేవాలయాలు 11 చోట్ల ఉన్నాయి .అవి-షాహాపూర్-మసూర్ లో ,శ్రీ ప్రతాప మారుతి ,బాఫలలో శ్రీ దాస మారుతి ,కృష్ణా నది ఒడ్డున ఉమ్బ్రన్జ్ హనుమాన్ ,శిరోలె హనుమాన్ ,బీజాపూర్ –మనపాద్ లో మారుతి ,బీజాపూర్ –పార్ లో హనుమాన్ ,మజ్ గ్రామం లో ఆంజనేయ ,శిన్గడ వాడికొండపై హనుమాన్ ,బోర్ గ్రామం లో మారుతీ దేవాలయాలు .

                                        మధ్య ప్రదేశ్

92-ఉజ్జయినిలో –శ్రీ హమదాలయాలు

  మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని నగరం లో శిప్రా నది తీరం లో శ్రీ గిరివారీ హనుమాన్ ,కార్తీక చౌక్ లో సమర్ధ రామ దాస స్వామి ప్రతిష్టిత శ్రీహనుమాన్ పెద్ద గణేష్ సమీపం లో శ్రీ పంచ ముఖీ హనుమాన్ దేవాలయాలు సుప్రసిద్ధమైనవి .రైల్వే స్టేషన్ కు దక్షిణం లో ‘’నీల గంగ నది ‘’ఒడ్డున ఉన్న శ్రీ హనుమాన్ చాల ముఖ్యం గా దర్శించాలి .మహిమాన్వితుడు .స్కంద పురాణం లో ఈ క్షేత్ర వివరణ ఉంది. హనుమ  తల్లి అంజనా దేవి తో కలిసి తపస్సు చేసిన పుణ్య క్షేత్రం ఇది .

పంచముఖి హనుమాన్ మందిరం ఉజ్జయిని లో ఉంది .దర్శించాల్సిన క్షేత్రం .ఉజ్జైన్ లో అంక పట్ మార్గ లో ఉత్తరాభిముఖ హనుమాన్ మందిరం ఉన్నది .పిప్లీ నాకా చౌరస్తా లో ‘’గుమన్ దేవ్ హనుమాన్ ‘’ను భక్తులు తప్పక దర్శిస్తారు .

93 –బడే హనుమాన్ దేవాలయం –ఉజ్జయిని

 మధ్యప్రదేశ్ –ఉజ్జయిని లో జంక్షన్ నుంచి కిలో మీటర్ దూరం లో  మహా కాలేశ్వర దేవాలయానికి దగ్గర హర సిద్ధి రోడ్డు లో శ్రీ బడే హనుమాన్ దేవాలయం ఉంది .స్వామి పంచాముఖాన్జనేయ రూపం లో ఉంటాడు పెద్ద విగ్రహం . .ఈ దేవాలయం ఆడి నుంచి గొప్ప సాంస్కృతిక కేంద్రం గ విలసిల్లింది .జ్యోతిశ్హాస్త్రానికి వైభవం తెచ్చింది .పుష్య బహుళ అష్టమి ని ఘనంగా శ్రీ  ఆంజనేయ సేవలో నిర్వహిస్తారు

.94-గాతాకే బజరంగ్ –ఘట్ కేసర్

  మధ్య ప్రదేశ్ ఘట్ కేసర్ లోని ఝాన్సీ జిల్లాలో గాతాకే బజరంగ్ దేవాలయం ఉంది .సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం ఇక్కడ ఒక పండితుని కలలో హనుమాన్ కనిపించి తనకు ఒక గుడికట్టమని చెప్పాడు. .అదే రోజు ఆయన పొలం లో నాగలి దున్నుతుంటే భూమి లోంచి నీటి ధార పై ఎగజిమ్మింది .ఆశ్చర్య పోయి అందరికి తెలియ జేశాడు .ప్రజలు ఇక్కడ భూమిని త్రావ్వారు. భూమి లోపల  శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది .అప్పటి నుంచి స్వామి విగ్రహం పైన నిరంతరం ఓషధీజలం ప్రవాహిస్తూనే ఉంది .అందుకే ఈ ప్రదేశం చాలా ప్రాముఖ్యాన్ని పొందింది .

95-హనుమాన్ ధారా –చిత్రకూటం

 మధ్య ప్రదేశ్ లో చిత్రకూట్ కు దగ్గరలో చిన్న కొండపై ఒక గుహ ఉంది .గుహలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ మూర్తి ఉంది .కొండకింది నుంచి 350 మెట్లు ఎక్కి స్వామి దగ్గరకు చేరాలి స్వామి విగ్రహ రూపం లో కనిపించడు.గుహ గోడపై చెక్కిన శిల్ప మూర్తి .విగ్రహం ఎప్పుడూ పూర్తిగా గంధ సిందూరం తో పూత పూసి ఉంటుంది .స్వామి విగ్రహం చేతి మీద కొండ బిలం నుండి సన్నటి నీటి ధారా ఎప్పుడూ ప్రావహిస్తూ ఉండటం ఇక్కడి విశేషం .ఈ నీటి దారనే హనుమాన్ ధార అన్నారు .ఆంజనేయుడు లంకా దహనం చేసి ఇక్కడికి వచ్చాడని రాముడు అక్కడిపర్వత జలపాత జలాలతో తోకకు అంటుకొని ఉన్న అగ్నిని ఆర్పాడని కధనం ప్రచారం లో ఉంది .

                                 గుజరాత్

96-హనుమాన్ ధారా

        గుజరాత్ లో సౌరాష్ట్ర ప్రాంతం జునాగడ్ దగ్గర ‘’గిర్నార్ ‘’పర్వతం పై కి 2,500 మెట్లు ఎక్కితే ఒక అడవి కనిపిస్తుంది .ఒక్న్దపైనుంది నీరు శ్రీహనుమంతుని ముఖం మీదుగా కిందకు జారటం విశేషం .

97-పోర్బందర్ హనుమాన్

  గుజరాత్ లో పోర్బందర్ లో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహానికి 12 చేతులు,11 ముఖాలు ఉంటాయి .మహిరావణుడిని చంపటానికి హనుమ ఈ అవతారం ఎత్తాడని ,వధానంతరం తన కుమారుడు మకరధ్వజుని పాతాళ సామ్రాజ్యానికి రాజును చేశాడని పురాణ కధనం .ఇక్కడ మహా రాణా  వంశం వారు మకరధ్వజుని వారసులే .

98- శ్రీ ఖండనీయ హనుమాన్ –సూరత్

 గుజరాత్ లోని సూరత్ కు 1932 లో వచ్చిన భీకర తుఫాన్ లో ఒక ఆంజనేయస్వామి విగ్రహం కొట్టుకొచ్చి చేరింది .తుఫాను వెలిసిన తర్వాత భక్తులు ఒక ప్రాచీన ప్రసిద్ధ స్థలం లో ప్రతిష్ట చేశారు .1950లో మళ్ళీ తుఫాను వచ్చినప్పటికీ సూరత్ ప్రాంతానికి ఏ ఇబ్బందీ కలుగ లేదు .ఇది శ్రీ హనుమ మహిమగా అందరూ భావించారు .అప్పుడు స్వామికి పెద్ద దేవాలయం నిర్మించారు .ఇదే శ్రీ ఖండ హనుమాన్ దేవాలయం

99-జామ్ నగర్ హనుమాన్

     గుజరాత్ రాష్ట్ర జామ్ నగర్ లో గిర్నార్ పర్వతం పై శ్రీ హనుమాన్ ధారా లో శ్రీ హనుమద్దేవుని కృప వలన శ్రీ జామ రావోలే  అనే ఆయనకు జామ్ నగర్ రాజ్యం ప్రాప్తించింది .ఆయనకు స్వామి ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటే స్వామిని తన రాజ్యానికి రమ్మని ఆహ్వానించాడు .భక్తుని కోరిక భగవంతుడు తీర్చాడు .హనుమ ఎక్కడెక్కడ ఆగి విశ్రాంతి తీసుకోన్నాడో అక్కడ రాజు ఒక్కో పేరుతొ శ్రీ హనుమాలయాలు నిర్మించి భక్తిని చాటుకొన్నాడు .అందువల్ల నాలుగు దిక్కుఅలో నాలుగు ప్రముఖ ఆలయాలేర్పడ్డాయి .అవే దండియా హనుమాన్ ,ఫులియా హనుమాన్ ,బాడ్ బంజన్ హనుమాన్ ,హనుమాన్ అనేవి వీటిలో దండియా హనుమత్ క్షేత్రం చాలా విశిష్టమైనదని చెబుతారు .

                             హర్యానా

100 –ఆశీర్వ ముఖి హనుమాన్

  హర్యానా రాష్ట్రం లో సిర్సా లో అతిప్రాచీన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది దీనిని 1016 కార్తీక మాసం లో నిర్మించినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి .స్వామి విగ్రహాన్ని శ్రీ శాంతి స్వరూప్ ప్రతిష్ట చేశారు .స్వామి ఆశీస్సులు అందజేసి అందరిని దీవిస్తాడు .అందుకే ‘’ఆశీర్వ  హనుమాన్ ‘’ అనే పేరొచ్చింది .

101-అంబాలా హనుమాన్ దేవాలయం

 హర్యానాలో అంబాలా దగ్గర రెండు వందల యాభై ఏళ్ళ నాటి శ్రీహనుమాన్ దేవాలయం ఉంది .అందులోని శిల్ప ,చిత్ర కళ మొఘల్ శిల్ప చిత్రకళలను పోలి ఉండటం ఆశ్చర్యం .మంగళ శని   వారాలలో శ్రీహనుమజ్జయంతి నాడు  విశేషం గా  గా భక్తులు దర్శిస్తారు ఉత్సవాలు ఘనం గా నిర్వహిస్తారు .

102-శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం

హర్యానాలో బిలాస్పూర్ –చచురాలి రోడ్డుపై జగద్రి  దగ్గర శ్రీ పంచ ముఖి ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది .నిత్యం వేలాది భక్తులు సందర్శించి పూజిస్తారు .స్వామిని దర్శించి మనసులోని కోరికను తెలియజేస్తే దీపావళి పండుగ వెళ్ళిన ఇరవై రోజుల్లో తీరుస్తాడు అనే గొప్ప నమ్మకం ఉంది .పంచ పాండవులు ఈ స్వామిని దర్శించి తమకు పంచాముఖాల్తో దర్శనం అనుగ్రహించమని వేడుకోన్నారట .తధాస్తు అని పంచాముఖాలతో ప్రత్యక్షమై వారి కోరిక మీదట అలానే ఇక్కడ ఉండిపోయాడట .ఇది యుగంధర ,గాంధారీ దేవిల పట్టణం.దీన్ని నాదిర్షా1739లో ధ్వంసం చేశాడు మొదటినుంచి ఇది లోహ వస్తు తయారీకి ప్రసిద్ధి చెందింది .

 సశేషం

             మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-1-2015-ఉయ్యూరు

 

       

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.