దర్శనీయ ఆంజ నేయ దేవాలయాలు మహా రాష్ట్ర 77-శ్రీ జరండేశ్వార్ ఆంజనేయ దేవాలయం

  దర్శనీయ ఆంజ నేయ దేవాలయాలు

                   మహా రాష్ట్ర

77-శ్రీ జరండేశ్వార్ ఆంజనేయ దేవాలయం

        మహారాష్ట్రలో పూనా సతారా రోడ్డులో సతారాకు రెండుకిలో మీటర్ల దూరం లో జరండేశ్వర్ లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది సంజీవిని పర్వతాన్ని హనుమ తెస్తున్నప్పుడు ఒక ముక్క ఇక్కడ పడిందట .అందుకే ఆ పేరు .ఇక్కడ సమర్ధ రామ దాసస్వామికొన్ని రోజులు విశ్రమించారట .అందుకనీ గొప్ప యాత్రా స్థలం అయింది .ఎత్తైన కొండపై స్వామి మీసాలు గడ్డాలతో ఉంటాడు .వందమేట్లు ఎక్కి హనుమను దర్శించాలి .ఎప్పుడూ కొండపై మేఘాలు దోబూచులాడుతూ ప్రక్రుతి శోభకు పరాకాష్టగా ఉంటుంది .

Inline image 1    Inline image 2

78 ద్విముఖ ఆంజనేయ స్వామి నాసిక్

 మహా రాష్ట్రలో నాసిక్ దగ్గర పంచవటి క్షేత్రం లో గోదావరి ఘాట్ పై అహల్య కొండమీద రామ కుండం దగ్గర ఉన్న ఆంజనేయస్వామికి రెండు ముఖాలున్డటం ఒక ప్రత్యేకత .మహారాష్ట్ర భాషలో ‘’దుతోండ్యమారుతి ‘’అంటే రెండుముఖాలున్న మారుతి అనిపిలుస్తారు .స్వామి పెద్ద విగ్రహస్వరూపుడు .రెండుముఖాలు అటూ ఇటూ ఉంటాయి .గంధ సిందూరపు రంగులో స్వామి దర్శనం ఇస్తాడు స్వామి .ఇక్కడి నీటి లెవెల్ కు గుర్తుగా కూడా ఉంటాడు .(వాటర్ లెవెల్ ఇండికేటర్ ). గోదావరికి వరద వచ్చినపుడు స్వామి చెంతకు నీరు చేరుతుంది అది చేరే లెవెల్ ను బట్టి వరద ఉధృతి యెంత ఉన్నదో తెలియ జెప్పుతారు .2009లో గోదావరి నదికి వచ్చిన వరదలో స్వామి విగ్రహం పూర్తిగా మునిగిపోయింది ఇ౦త పెద్ద వరద అంతకు ముందు ఎన్నడూ రాలేదట .

Inline image 3   Inline image 4

 

79 దశ భుజ హనుమాన్ త్రయంబకేశ్వర్

  మహా రాష్ట్రలో నాశికా త్య్రంబకేశ్వర్ క్షేత్రానికి సుమారు నలభై కిలో మీటర్ల దూరం లో ఉన్న హనుమాన్ మందిరం లో స్వామి దశ భుజ రూపంగా దర్శన మిస్తాడు .ఇది చాలా వింత విషయం గా భావిస్తారు 

 

Inline image 5

.

80-దుల్య మారుతి దేవాలయం పూనా

  మహా రాస్ట్ర లోని పూనాలో మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాచీన హనుమాలయం ఉంది .ఇక్కడ హనుమాన్ వినాయకుని పోలి ఉన్నట్లు పెద్ద బొజ్జతో దర్శనమిస్తాడు .ఇదొక వింత .అందుకే ఈస్వామిని  ‘’దుల్య మారుతి ‘’అంటారు  సమర్ధ రామదాస స్వామి ప్రతిష్టించిన హనుమ విగ్రహం ఇది .

 

81సాంప గావ హనుమాన్

 మహారాస్ట్ర లో రహమత్ పూర్ కు దాదాపు నాలుగుకిలోమీటర్ల దూరం లో ఒక అడవి లో ఉన్న దేవాలయం ఇది .ఈ అడవిలో ఒక ఆవు దూడకు యజమానికి పాలు ఇవ్వకుండా ,దూరం గా వెళ్లి ఒక పుట్టలోని పాముకు పాలు ఇచ్చేది .ఒకరోజు ఈ విషయం గ్రహించిన  పశువులకాపరి  ఆ పామును చంపటానికి ప్రయత్నం చేశాడు .పాము అదృశ్యమై రాత్రికలలో కనిపించి తన పుట్టలో ఆంజ జేయస్వామి ఉన్నాడని ఆయనను బయటికి తీసి ప్రతిష్టించి దేవాలయం కట్టమని చెప్పింది .ఆతను పుట్టలోని విగ్రహాన్ని బయటికి తీసి తనకున్న వనరులతో స్వామిని ప్రతిష్టించి  .ఆవుపాలతో  అభిషేకం చేశాడు .తర్వాత దేవాలయం నిర్మించాడు .ఇప్పుడది గొప్ప యాత్రాస్థలం అయింది .

82 పులసా హనుమాన్

 మహా రాష్ట్ర లో అమరావతి జిల్లాలో మొర్మి తాలూకా లో ఉన్న చిన్నగ్రామం పులసా .ఇక్కడ బేత నది లో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం 1908లో లభించింది దీన్ని ఒడ్డుకు తీసుకు రావటానికి యెంత శ్రమ పడినా కదిలించ లేక పోయారు .చివరికి ఒక రధం ఆకారం లో డొల్ల తయారు చేయించి దాని మీద విగ్రాహం పెట్టి ఒడ్డుకు లాక్కొచ్చే ప్రయత్నమూ చేశారు .కాని విగ్రహం రధం పైకి ఎక్కించ లేక పోయారు .ఇక లాభం లేదని  రాత్రి అయి చీకటి పడుతుండటం తో  రధాన్ని అక్కడే వదిలి వెళ్ళారు ..మర్నాడు వచ్చి చూసేసరికి రధం మీద స్వామి కొలువై ఉన్నాడు . సంభ్రమాశ్చర్యాలకు లోనై భక్తితో స్వామిని అర్చించారు .కాని స్వామి పొట్ట పైభాగం కదులుతూ ఉన్నట్లు గమనించారు .కనుక స్వామిని పొట్ట కిందివరకు మాత్రమె ప్రతిష్ట చేశారు

83 అలబేలా హనుమాన్

మహా రాష్ట్రలో దాదర్ బదాలా బస్ డిపో దగ్గర (బొంబాయి 32)దగ్గర ప్రాచీన హనుమదాలయం ఉంది .ఈ స్వామిని హిందూ ముస్లిం క్రైస్తవ బేదం లేకుండా పారశీకులు సిక్కులు భక్తితో దర్శించి పూజించి తరిస్తారు .స్వామి భారీ విగ్రహ రూపుడు .

Image   Inline image 6

 

84–  సాంగ్లీ హనుమాన్

               బొంబాయి సాంగ్లీ స్టేషన్ నుండి మూడుకిలో మీటర్ల దూరం లో కృష్ణా నది తీరం లో 24 అడుగుల పెద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రం మందిరము ఉన్నాయి .క్రీ శ.304కు పూర్వమే ఈ దేవాలయం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది భక్త వరడుడుగా స్వామిని భావిస్తారు

Inline image 7 Inline image 8

85-టాక్లీ హనుమాన్

 మహారాష్ట్రలో నాసిక్ కు దగ్గరఅహమ్మద్ నగర్ జిల్లాలో  సమర్ధ రామదాస స్వామి జన్మస్థలం అయిన టాక్లీ ఉంది. ఆయనే ప్రతిష్టించిన హనుమ దేవాలయం సుప్రసిద్ధ యాత్రాస్థలం .రామదాస స్వామి ఇక్కడే 13 కోట్ల సార్లు శ్రీ రామ నామ జపం చేశారు .అందుకే అంతప్రశస్తి కేక్కింది .ఈ హనుమాన్ ను ఆవుపేడ తో నిర్మించారు .సమర్ధ రామ దాస స్వామి మొట్ట మొదటిసారిగా ప్రతిష్టించిన ఆంజనేయస్వామి విగ్రహం ఇదే .మరాటీ భాష లో స్వామిని ‘’శేన్య మారుతి ‘’అంటారు .ఈ విగ్రహ ప్రతిష్ట చేస్తూండగా సమర్ధుల వారి నోటి నుండి ఆశువుగా  ఆంజనేయ  స్తోత్రం వెలువడిందట .నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రం టాక్లీ .

     

 

    సశేషం

  2015నూతన సంవత్సర  ముక్కోటి ఏకాదశి శుభా కాంక్షలతో

            మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –1-1-2015 –ఉయ్యూరు

       

 

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.