శ్రీ సువర్చ లాంజనేయం -8

శ్రీ సువర్చ లాంజనేయం -8

Inline image 2ర్చ

Inline image 1 

81-ఏవం నిశమ్య హనుమాన్ –క్షణం నిమీలిత నేత్రో హ్రుచ్చిత్వా

సీతా శ్రీరామచంద్ర –లక్ష్మణ సంస్థితి మదర్శయత్ .

తా – నారద తుంబుర ప్రార్ధన విని హనుమ క్షణ కాలం నిమీలిత నేత్రుడై ,హృదయ కుహరం  విప్ప జేసుకొని శ్రీ సీతా రామ లక్ష్మణుల దర్శనాన్ని వారిద్దరికీ ఇచ్చాడు .

82-తాభ్యాం గర్వ సుస్టూత్యక్త –తత్రాధిక ప్రసంగో ముక్తః

శ్రీ రామ ఇత్యనరారతముక్తః –హనుమాన్ త్రుస్తో వక్తు మశక్తః

తా-వెంటనే వారిదరి గర్వం ఖర్వమై ,అధిక ప్రసంగాన్ని ఆపేశారు .శ్రీరామనామ సంకీర్తన చేసి హనుమకు ఆనందాన్ని చేకూర్చారు .

83-శ్రీరామ నామ  సద్భాజనేన-తచ్చైల వనం సనాతనేన

సంయగ్ధ్వనితం ప్రతిస్వనేన –సర్వం భువనం పూత మనేన .

తా –అలా వారిద్దరూ శ్రీ రామ నామ భజన మధురాతి మధురంగా చేయగా శైల వనాంతరం అంతా ప్రతిధ్వనించి ,మూడు లోకాలను పవిత్రం చేస్తోంది .

84-హృదయే దైవం కః స్థాపయతి –హృదయం చిత్వా కో దర్శ యతి

గానేన శిలాః కో ద్రావయతి –సమహాన్ హనుమానేకో జయతి .

తా-హృదయం లో ప్రతిస్టింప బడిన దైవాన్ని తెర తీసి నట్లు  హృదయాన్ని చీల్చి దర్శన మిప్పించి,తన  అఖండ గానమహిమతో కఠిన శిలలని కరగించిన హనుమ ఒక్కడే జయ శాలి .

85-సద్భజన పరా బహవస్సంతి- .సజ్జాప నిష్టా బహవస్సంతి

వేదా సక్తాబహువస్సంతి-హనుమత్తుల్యాః కతి వా  సంతి .

తా –సద్భజనానంద  కరులు ఎదరౌన్నారు .జప నిస్టాగరి స్టూలూ చాలా మంది ఉన్నారు .కాని శ్రీ హనుమత్ప్రభువు కు సాటి యైన వారేవ్వరున్నారు ?అంటే ఎవ్వరూ లేనే లేరు .

86-సుస్థిర చిత్తో యః కో ప్యస్తి –బ్రహ్మ చారీయః కో ప్యస్తి

జీవన్ముక్తోహః కో ప్యస్తి-హనుమత్తుల్యో నైకో పస్తి .

తా –అలాంటి నిశ్చల చిత్త భాక్తాగ్రగాన్యుడు ,అలాంటి నిష్కల్మష బ్రహ్మ చారి ,అట్టి నిరామయ జీవన్ముక్తుడు అయిన శ్రీ హనుమ కు సాటి మరొకడు లేడు.

87-ప్రబోదనే యస్య ణ సంతోషః-సమాచారాన ఏవ యస్య తోషః

అత ఏవ రామ చంద్రే తోషః-తాదృశ భగవాన్ హనుమానేషః.

తా –పరులకు ఉపదేశం చేసి నంత మాత్రం తో సంతోషం రాదు .స్వీయ ఆచరణలోనే సంతోషం పొందగలం .మహా మహిమాన్వితులలో నిగూఢం గా శక్తి నిలిచి ఉంటుంది అని నారద  తుంబురు లిద్దరూ గ్రహించారు .

88-శ్రీరామ పదే సంపశ్య౦తం –మందిర హృదయే వందన వంతం

బహిస్చ దృష్ట్వా శ్రీ  హనూమంతం –తౌ మే నాతే మహిమా వంతం .

తా –తన హృదయం అనే మందిరం లో నూ ,బయటనూ ,శ్రీరామ పాదారవింద  సన్నిధి లోను వినమ్రుడై  వందనం చేసే శ్రీ హను మంతుని దర్శించి మహా మహిమాన్వితునిగా అర్ధం చేసుకొన్నారు   మునులిద్దరూ .

89- హ్రుచ్చేదనం కద మితి-క్షణం సమాలోచ్య ,ప్రాజ్య మహిమ్నాం

మహతీ శక్తి ర్గూఢా-స్వాదితి మౌనిద్వాయ మేనే .

తా –మారుతిలాగా హృదయాన్ని చీల్చటం ఎలా సాధ్యం ?అని క్షణకాలం ఆలోచించి మహా మహిమ గల మహనీయులలో శక్తి నిగూఢం గా ఉంటుందని  నారద తుంబురు లిద్దరూ గ్రహించారు  .

90-బ్రహ్మాది సురా మునయః –సస్త్రీ కాస్తద్భూతల  మావ తేరుః.-

సత్పుష్పాణి వవర్షుః –శ్రీ రామాలయ కాపే శీర్షే .

తా-బ్రహ్మాది సకలదేవతలు తమ దేవేరులతో సహా భూమిమీదకు శ్రీ రామాలయం గా రూపొందిన శ్రీ హనుమంతుని శీర్ర్షం పై  మహదానందం తో పుష్ప వృష్టి కురిపించారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-12-14-ఉయ్యూరు

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.