దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు 53-మతకలహాలు ఆపిన ఆంజనేయస్వామి –మహబూబ్ నగర్

 దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

53-మతకలహాలు ఆపిన ఆంజనేయస్వామి –మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగరం లో శ్రీ ఆంజనేయ దేవాలయానికి ఒక ఘన చరిత్ర ఉంది .ఈ ఆలయం హైదరాబాద్ కు కేవలం పది హీను కిలో మీటర్ల దూరం లోనే ఉంది .ఒకప్పుడు ఇక్కడ ఉన్న హిందూ వుల భూములను  అన్య మతస్తులు ఆక్రమించుకొన్నారు .ఏమీ చేయలేక హిందువులు చాలా బాధ పడ్డారు .దీనికి పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించారు .కలహాలను రూపు మాపే దైవం శ్రీ ఆంజనేయ స్వామి ఒక్కడే అని గ్రహించి అందరూ పూనుకొని స్వామి విగ్రహం తయారు చేయించి  భక్తీ తో ప్రతిష్టిం చారు .స్వామిపై భారం వేసి నిశ్చింతగా ఉంటూ  తమ సంపదలను కాపాడమని నిత్యం స్వామిని అర్చించారు .స్వామిని ప్రతిష్టించిన కొద్ది రోజులలోనే తగాదాలు పరిష్కారమై సామరస్యం వెల్లి  వేరిసింది .విశాలమైన ప్రాంగణం లో ఎత్తైన ప్రదేశం లో ఈ ఆలయాన్ని నిర్మించారు  కాలి  దారిన మెట్లు ఎక్కే ఏర్పాటు ఉంది .వాహనాలు కొండపైకి వెళ్ళటానికి కూడా దారి ఏర్పాటు చేశారు .

       గర్భాలయం లో ఆంజనేయ స్వామి సర్వాలంకార శోభితుడై వెలుగొందుతూ దర్శన మిస్తారు .నిత్య పూజలు ,తమలపాకు గంధ సిందూరం పూజలు బాగా జరుగుతాయి .పండుగ దినాలో ,హనుమజ్జయంతి శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు .ఆలయ ప్రాంగణం లోనే మహా గణపతి ,అయ్యప్ప ,శివ పార్వతీ ఆలయాలున్నాయి నవ గ్రహమందపం ,రావి వేప ,మర్రి మొదలైన దేవతా వృక్షాలు ,వాటి కింద నాగ ప్రతిమలు దర్శన మిస్తాయి .

Inline image 1

54-అభయాంజనేయ స్వామి ఆలయం –ఉర్కొండ

       మహా బూబ్ నగర జిల్ల్లాలో మిడ్చిల్ మండలం లో ఉర్కొండ గ్రామం లో వెలసిన అభయాంజనేయ స్వామి రెండు కొండల మధ్య ఉన్న ఆలయం లో కొలువై ఉంటాడు .కల్వ కుర్తి –మహబూబ్ నగర్ రహదారి లో ఉర్కొండ ఉంది .నిజామ్  పాలనలో శిల్పులు ఈ ప్రాంతం లో  విగ్రహాలు  చెక్కటానికికావలసిన  మంచి శిలల కోసం వెతికారు .ఉర్కొండలో లభించిన అతి పెద్ద శిలతో అపూర్వంగా శ్రీ అభయాంజనేయ స్వామిని సర్వాంగ సుందరం చెక్కారు .దానిని తాము ప్రతిష్ట చేయాలనుకొన్న గ్రామం ‘’గట్టుఇప్పల పల్లి ‘’కి బండీ మీద తరలించటానికి  ప్రయత్నం చేశారు .కాని బండి కదలలేదు .అడుగు కూడా ముందుకు సాగక ఆగి పోయింది .చేసేది లేక ఆ రాత్రి అక్కడే విశ్రమించారు .ముఖ్య శిల్పి భోజ రాయలు గారికి హనుమ కలలో కనిపించి తాము తయారు చేసిన విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ట చేయమని ఆదేశించాడట .శిల్పులు అభయాంజనేయ స్వామిని ఇక్కడే కొండమీదే ప్రతిష్టించారు .ఆలయానికి తూర్పున  కోనేరు  ఉంది.కోనేరు స్నానం చేసి స్వామిని దర్శిస్తారు భక్తులు .స్వామి చుట్టూ ఇరవైఒక్క రోజులు దీక్షా భక్తులతో ప్రదక్షిణాలు చేస్తే ఎలాంటి ఆపద అయినా నివారింప బడుతుంది .ఈ కొండల మధ్య 24అడుగుల ఎత్తున్న ఏక శిలా శివ విగ్రహం చూపరులకు అమిత ఆశ్చర్యం  కలిగిస్తుంది . శివాంజ నేయ ఉభయ  దర్శనం సకల శుభ ప్రదం .

55-వక్షస్థల సీతారామ సమేత ప్రసన్నాంజ నేయ స్వామి ఆలయం –ఎల్.బి.నగర్ .

 హైదరాబాద్ లోని ఎల్ బి.నగర్ ప్రసిద్ధ శ్రీ  ప్రసన్నాంజ నేయ స్వామి దేవాలయం ఉంది .మహిమాన్విత క్షేత్రం గా ప్రసిద్ధి .ఒకప్పుడు ఆంజనేయ దేవాలయం ఒక్కటే ఉంది ఇప్పుడు అందరు దేవీ దేవతలను ప్రతిష్టించి ఒక కాంప్లెక్స్ గా మార్చారు .ప్రసన్నాంజ నేయ స్వామి గర్భ గుడిలో వక్షస్థలం లో సీతా రామ లక్ష్మణ సమేతం గా  దర్శన మిస్తారు. ఆలయం ప్రాంగణంలోనే శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం .ఇక్కడి శివలింగానికి నిత్యాభిషెకాలు జరుగుతాయి .శ్రీరామనవమి హనుమజ్జయంతి వైభవం గా నిర్వహిస్తారు .లక్ష్మీ గణపతి  శ్రీ సుబ్రహ్మన్యేశ్వర ఆలయాలున్నాయి  .నవగ్రహ మండపం శ్రీ మీనాక్షీ దేవి ,శ్రీ మాల్ మైసమ్మ దేవాలయాలూ ఉన్నాయి .భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది .

56ప్రసన్నాంజ నేయ స్వామి ఆలయం –మియాపూర్

       హైదరాబాద్ లో మియాపూర్ లో ఇంద్రా రెడ్డి ఆల్విన్ కాలనీలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమేకాక మహిమాన్వితం కూడా .చుట్టుప్రక్కల చాలా ప్రాంతాలనుండి స్వామిని దర్శించటానికి భక్తులు వస్తారు .కోరిన కోర్కెలను తీర్చే దేవుడుగా గొప్ప నమ్మకం .ఈ ఆలయం ప్రాంగణం లోనేశ్రీ  కాశీ విశ్వేశ్వరాయం శ్రీ సాయిబాబా శ్రీ దత్తాత్రేయ  నవగ్రహ దేవతామూర్తులు ప్రతిష్టి తులైనారు .ఒక రకం గా సర్వ దేవ మయం అయింది .నిత్యార్చనలతో పండుగా పబ్బాలలో విశేష పూజలు నిర్వహిస్తారు హనుమజ్జయంతి ,దత్త జయంతి  శ్రీరామనవమి ఉత్సవాలను వైభవోపేతం గా జరుపుతారు .

57 శ్రీ హనుమాన్ దేవాలయం –సనత్ నగర్

 హైదరాబాద్ సంత్ నగర్ లో ప్రధాన దైవం గ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, ఉప ఆలయాలుగావెంకటేశ్వర ,భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ,సాయిబాబా ఉపాలయాలు గొప్ప ఆకర్షణ .ప్రధాన దైవం ప్రసన్నాంజ నేయ స్వామి భారీ గా ఉంటాడు కుడి చేయిఅభయ ముద్రతో  ఎడమ చేత గద ధరించి అభయ ముద్రలో స్వామి దర్శన మిస్తాడు .నిత్యభిషెకాలు ,పూజలు బాగా నిర్వహిస్తారు శని ,మంగళ వారాలలో విశేష ఆర్చనలుంటాయి .భక్తులూ భారీగా వస్తారు ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి చైత్ర శుద్ధ పౌర్నమివరకు హనుమాన్ మండల దీక్షా కార్య క్రమాన్ని నిర్వాహిస్తారు .గ్రహ దోష నివారణకు  ,జాతక సమస్యల పరిష్కారానికి ప్రత్యెక పూజలు చేయిస్తారు .నవరాత్రి ఉత్సవాలు ఉగాది సంక్రాంతి హనుమజ్జయంతి శ్రీరామనవమి మొదలైనవన్నీ ఘనం గా చేస్తారు .  

Inline image 2Inline image 3
 

58 శ్రీ హనుమాన్ దేవాలయం – అమీర్ పేట

  వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న దేవాలయం హైదరాబాద్ లో అమీర్ పేట లో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయం .నిత్యం వేలాది భక్తులు సందర్శించే ఆలయం ఇది .ఆలయం క్రమగా వృద్ధి చెంది రాజ రాజేశ్వర,ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర ,గణపతి వల్లీ సమేత సుబ్రహ్మనఎశ్వర ,శ్రీ సాయి బాబా  నవ గ్రహ  శ్రీ వేణు గోపాల స్వామి ఆలయాలు నిర్మించి ఆలయ సమూహం గా బాగా అభివృద్ధి చేశారు .సంతానం కోసం ,ఆరోగ్యం కోసం కాల సర్ప దోష నివారణకు ప్రత్యేకంగా భక్తులు పూజలు చేయిన్చుకొంటారు .సంకష్ట హర చతుర్ధి నాడు విశేషం గా పూజలు చేస్తారు సామూహిక సత్యనారాయణ వ్రతాలు . హనుమత్ హోమం అనఘా  వ్రతం హనుమజయంతి శ్రీరామ నవమి ఉత్సవాలు బాగా చేస్తారు .

Inline image 4

           సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –29-12-14-ఉయ్యూరు

 

.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.