దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు – 46-సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం –హిందూపురం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –

46-సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం –హిందూపురం

 అనంత పురం జిల్లా హిందూపురానికి నాలుగు కిలోమీటర్ల దూరం లో హిందూపురం బెంగళూరు రహదారిలో సూగూరు అనే గ్రామం ఉంది .ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామినే సూగూరు ఆంజనేయ స్వామి అంటారు .చాలా ప్రాచీన మైన ఆలయం .స్వామి మహా మహిమాన్వితుడు .పెద్ద విగ్రహమే .వాహన చోదకులు ఇక్కడ ఆగి పూజ చేసి సిందూరం పెట్టుకొని వెడతారు .కోరిన కోరికలన్నీ తీర్చే దేవుడు .మొదట్లో చిన్న ఆలయం గా ఉండేది ఇటీవల అన్ని హంగులతో ఆలయాన్ని అభి వృద్ధి చేసి సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దారు .దసరా ఉత్సవాలలో ‘’జంబూ సవారి ‘’అనే వాహన ప్రయాణం జరుపుతారు హిందూపురం ,చుట్టుప్రక్కల గ్రామాల వారు విజయ దశమినాడు ఊరు దాటి అంటే సీమోల్లంఘనం చేసి కాలినడకనో బండ్లమీదనో లేక ఇతర వాహనాలలోనో ఇక్కడికి వచ్చి హనుమను దర్శించి వెళ్ళటం సంప్రదాయం గా ఉంది .

  యెన్ టి రామా రావు హిందూ పూర్ వచ్చినప్పుడల్లా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించ కుండా వెళ్ళే వాడు కాదు. అలానే చంద్ర బాబు హరికృష్ణ బాలకృష్ణ లు కూడా ఈ స్వామికి విశేష భక్తులు .శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవం గా నిర్వహిస్తారిక్కడ ఉట్లమాను  ఉత్సవానికి ప్రత్యేకత ఉంది యువతీ యువకులు ఉత్సాహం గా పాల్గొంటారు .దీని తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు జరిగే లంకా దహన కార్యక్రమం చూడ దగిన మరో ముఖ్యమైనది .శివకాశి నుంచి ప్రత్యేకం గా టపాకాయలు తెప్పించి  వివిధ రకాలుగా అమర్చి గంటల కొద్దీ కాలుస్తారు .నాగుబాము ఆకారం స్వాగతం ఆకారం ,తో చూడటానికి బహు ముచ్చటగా ఉంటాయి  .నింగి కెగిరే టపాసుల సందడి వెలుగు రవ్వలు కళ్ళకు జిగేలుమనిపిస్తాయి .ఉడిపికి చెందిన కళాకారులు యక్ష గానం నిర్వహించి ఆకర్షిస్తారు .

   శ్రీరామ నవమి రోజున శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్ కు కు సుప్రభాత సేవ చేసి ,మహాభిషేకం విశేష పుష్పాలంకార పూజ నిర్వహించి వజ్రకవచ ధారణ చేస్తారు వెండి కిరీటాన్ని అలంకరిస్తారు .తర్వాత ఆంజనేయ సీతారామ ఉత్సవ విగ్రహాలను ప్రత్యెక వేదిక పై ఉంచి సీతారామ కల్యాణాన్ని వేదం మంత్రోచ్చారణ మధ్య పరమ వైభవం గా నిర్వహిస్తారు .

Inline image 1
 

                           47 – వీరాంజనేయ స్వామి –ఉండ్రపూడి

 కృష్ణా జిల్లా పామర్రు మండలం ఉండ్రాపూడి లో శ్రీ సువర్చలా సహిత వీరాంజనేయ స్వామి ఆలయం ముప్ఫై సంవత్సరాల క్రితం ఏర్పడింది .భజన గురువు అయిన కుటుంబ రావు అనే భక్తుడు స్థాపించిన ఆలయం ఇది .దగ్గరలో ఉన్న పోలవరం ఉండ్రాపూడి గ్రామస్తులకు భజనలు నేర్పిస్తూ వారిని భక్తులుగా మార్చారు కుటుంబ రావు .ఆలయం దగ్గర మర్రి చెట్టు కింద భజనలు నిర్వహించేవారు .ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మిస్తే భక్తీ భావం బాగా అభి వృద్ధి చెందుతుందని ఆయన భావించి అందరినికూడా గట్టి ఆలయ నిర్మాణం ప్రారంభించి త్వరలోనే పూర్తీ చేశారు .చుట్టూ ప్రక్క గ్రామాలు ముందుకొచ్చి ఇతోధిక సహాయ సహకారాలు అంద జేసి ఆలయాన్ని  సర్వ సౌకర్యాలతో వర్దిల్లెట్లు చేశారు .నిత్యాభిషెకాలు అర్చనలు జరుగుతాయి. హనుమజ్జయంతి శ్రీరామ నవమి రోజుల్లో విశేషం గా పూజాదికాలు చేస్తారు .తమల పాకులా పూజ ,గంధ సిన్దూరపూజలు ప్రత్యేకం .మంగళ ,శనివారాలలో భక్తుల రద్దీ మహా ఎక్కువ గా ఉంటుంది .

 
Inline image 2

48- బావాజీ ఆంజనేయ దేవాలయం –గుంటూరు

 గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం లో కొత్త పేట లో  ఆంజనేయస్వామి దేవాలయం ఉన్నది .దీన్ని శ్యామల దాసు బావాజీ అనే భక్తుడునిర్మించాడు  దీనితో పాటు వెంకటేశ్వర ,జగన్నాధ ఆలయాలను నిర్మించాడు .ఈ మూడింటిని బావాజీ ఆలయ సముదాయం గా పిలుస్తారు .పూర్వం ఇక్కడ తోటలు బాగా ఉండేవి .అందు వలన తోటల ఆలయాలనే పేరు కూడా ఉంది .ఇప్పుడు కొత్త పేట అలయాలంటారు .

  శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉత్తరాభి ముఖం గా ఉంది .స్వామి అత్యంత మహిమాన్వితుడని ప్రసిద్ధి .పిశాచ బాధలు ,ఈతి బాధలు ఉండవని గొప్ప విశ్వాసం .ఆరోగ్యం మానసిక శాంతి  సర్వ సమృద్ధి స్వామి సేవవలన పొందవచ్చు .ధనుర్మాసం లో తిరుప్పావై ఉత్సవం గొప్పగా జరుగుతుంది .సామూహిక తమల పాకు పూజలు ఇక్కడి ప్రత్యేకత .ఉగాది ,శ్రీరామ నవమి హనుమజ్జయంతి ,దేవీ నవ రాత్రులు  దసరా దీపావళి ,ముక్కోటి సంక్రాంతి పండుగలను ఈ ఆలయం లో ఘనం గా చేస్తారు మాఘ మాసం లో లక్ష తమల పాకులా పూజ ఇక్కడి మరో ప్రత్యేకత

Inline image 3Inline image 4Inline image 5

  సశేషం

     మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –28-12-14-ఉయ్యూరు

.

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.