శ్రీ సువర్చ లాంజనేయం -3

శ్రీ సువర్చ లాంజనేయం -3

31-యుష్మద్ధ్రుదయే రామో రమతే త్వత్సమ భక్తో నప్లవగ పతే

కపిరప్యచలో సిత్వం  సుమతే-నిత్యాద్భుత నూతన భక్తి గతే.

తా—‘’కపివరా!నీహృదయం అంతా రామనామ మయం .కోతి చపలుడు అనే మాట నీకు చెల్లనే చెల్లదు .నవ నవోన్మేషణం నీ భక్తి తత్పరత .నీసమాన భక్తుడులేడు.

32-త్వమేవ శక్తో వీణోద్ధరణే-తే భక్తిర్వా శక్తోద్ధరణే

తే మహిమార్హః స్యాదుద్ధరణే-నావం శక్తౌ వీణౌ ద్ధరణే.

తా—ఈ వీణలను ఉద్ధరించే శక్తి మాకు లేదు .వీటిని ఉద్ధరించే భక్తీ శక్తులు  మహిమా నీకే ఉన్నాయి హనుమయ్యా .

33 ఏతచ్చ్రుత్వా హనుమాన్ –సర్వ సమర్దః సర్వం కర్తుం సం

శక్తః శ్రీరామ ఏవ –భవతీత్యు వాచా నమస్కుర్వన్ .

తా-ఈ మాటలు విన్న హనుమాన్’’ అయ్యా!సర్వ సమర్ధుడు ,సమస్త  సృష్టీచేసి పాలించేవాడు  శ్రీరామ చంద్రుడు ఒక్కడే ‘’ అని వినయంగా చెప్పి శ్రీ రాముని తలచుకొని నమస్కరించాడు .

34-యువ యోర్మయి సర్వత్రా ప్యేకం-దైవం విలసతి తచ్చానేకం

తత్సం స్తోతుం సర్వం మూకం –సూక్ష్మాత్సూక్ష్మం మహతో స్తోకం .

తా-మీలో నాలో ,అంతటా నిండి ఏకమై ,సూక్షాతి సూక్షం గా ,అనంతంగా వెలిగే ఆ పరబ్రహ్మ అయిన దైవాన్ని మనం వర్ణించలేము .

35-పుణ్యే లోకే యుష్మ దదీతాం –తాం సన్మధురాం గాంధర్వ కృతాం

తాం పుణ్యజనాప్తాం సంగీతాం-శ్రోతుం  వాంచామ్య మరాభి మతాం.

తా-పుణ్య లోకాలన్నీ మీ అధీనం లో ఉన్నాయి .మీరు నేర్చుకొన్న మధురాతి మధురగానం విని భక్తులు తరిస్తారు .అలాంటి గానాన్ని నాకు వినిపించి క్రుతార్దుడిని చేయండి .అని హనుమ వారిని వేడాడు .

36 ఏతద్వాక్యం శ్రుత్వా –శ్రీనారాయణ పవిత్ర పదాంకితం

గీతా మగాయతాం తౌ –మధుర స్వర సత్క్రమోపేతాం .

తా-హనుమ ప్రార్ధన విని మునులిద్దరూ శ్రీమన్నారాయణ దివ్య వచన సమన్వితమైన గానాన్ని ఆలాపించటం ప్రారంభించారు .

37 –శ్రీహరి మనిశం దారయ హ్రుత్వం –పరమాత్మానం సదా భజత్వం

సర్వ మసత్యం విద్ధి జగత్వం –నిత్యం సత్యం భగవత్తత్వం .

తా-ఓమనసా!సదా శ్రీహరిని స్మరించు పరమాత్ముని సేవించు .ఈ కనబడే జగత్తు మిధ్య .భగవత్తత్వం ఒక్కటే నిత్యమైనది .

38 –ఏవం మునీ పరవశం-స్వగాయతా మాపి బహుదా తత్సమయే

శిలే ,న మ్రుదుతాంప్రాప్తే –చలనం నాప్తే చ తే వీణే.

తా-నారద  తుంబురు లిద్దరు  అనేక విధాల పరవశత్వం తో గానం చేసినా , శిలలు ఏమాత్రం మెత్త పడలేదు .వీణలు   కించిత్తుకూడా సడల లేదు .

39-రామం హృది పశ్యంతం –శ్రీ కపి ముపెత్య తన్మౌ నిద్వంద్వం

గర్వం త్యక్త్వా ప్రణమ్య-వినమితి శీర్షం స్తుతిం చక్రే .

తా-ఎల్లప్పుడూ హృదయం లో శ్రీరామ చంద్రుని దర్శించే కపి వరుడైన అ హనుమ ముందు తమ కుప్పి గంతులు పనిచేయవని  తెలుసు కొని  గర్వాన్ని వదిలేసి మునులిద్దరు భక్తి ప్రపత్తులతో ముకుళిత హస్తులై హనుమను ఇలా స్తుతించారు .

40 –హనుమా నుత్దాయ భక్తి–భరితో వినమ్రతో బహు మొద మనాః

వీణా ద్వన్ద్వముపసృత్య –రామేత్యుక్త్వా సమస్తా వీత్ .

తా-అప్పుడు భక్తీ సంతోషాలతో ఆ  నారద ,తుంబురుల వీణలపై తన దృష్టిని ఒక సారి ప్రసరింప జేసి ‘’శ్రీరామ ‘’అంటూ అనేక సార్లు .జపం చేశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -24-12-14-

Inline image 1

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.