శ్రీ సువర్చలాన్జనేయం -2

శ్రీ సువర్చలాన్జనేయం -2

11-యస్మిన్ శీతోస్తి కృష్ణ వర్త్మా-యం ఖే గమయతి సమీరణాత్మా

సయయే యస్సూక్ష్మ స్తూలాత్మా –సోయం శ్రీ హనుమాన్ పరమాత్మా

తాత్పర్యం –ఎవరికి అగ్ని చల్లగా ఉంటుందో ,ఎవరు ఆకాశం లో గాలిలో విహరిస్తారో ,ఎవరు సమయానుకూలంగా సూక్ష్మ అతి సూక్ష్మ రూఒపాలు దరిస్తారో  అలాంటి పరమాత్మ శ్రీహనుమత్ప్రభువు .

12-భక్తిస్చేత్కిం స్వాధ్యాయేన –స్మరణం చేత్కింమంత్ర జపేన

ఆర్తిస్చేత్కిం శుచితాపేన – లయతా చేత్కీంస్తుతి పఠనేన.

తా—భక్తీ లో మునిగిన వాడికి వేదం పఠఠనం ఎందుకు?ఆర్త హృదయం ఉంటె ప్రాయశ్చిత్తం దేనికి?భక్తీ తో ఆనంద నాట్య మాడేవానికి స్తోత్ర పాఠాలేల?

13-శబ్దార్ధ వ్యాక్రుతి విష యేషు –భక్త్యా వేశప్రోల్లాశేషు

భక్త శిఖండిః దుస్సంగేషు –హనుమత్తుల్యో నహి లోకేషు .

తా-వ్యాకరణం లోను భక్తీ ఆవేశం తో గంతులు వేయటం లో ,భక్తీ ప్రభావం లో దురితాల ధూళిని వదిలించటానికి హనుమంతునికి సాటి ముల్లోకాలలో ఎవరూ లేరు .

14-రామేత్యను పద ముద్గాయంతం –సులలిత సురుచిర పదోచ్చలంతం

కృత కరతాళం శిరసి వహంతం –ప్రణ మానస్సంతం శ్రీ హనుమంతం .

తా—అనుక్షణ రామ నామ గానలోలుడై ,కరతాళ ధ్వనులతో సుందర పదార  విందాలతో గంతులేస్తూ  రెండు చేతులు జోడించి శిరస్సున ఉంచుకొనే శ్రీహనుమంతునికి వందనం .

15-శ్రీరమేత్యాలాప పదాని –మునీంద్ర వీణా శిలాతలాని

కృత్వా సంయగ్ద్రవ రూపాణి-చక్షుర్వీణే  లగ్నేతాని .

తా—శ్రీరామ అనే పదం ఆలాపిస్తే శిలా తలాలు  కరిగి పోతున్నాయి .వాటికి ఆనించిన వీణలు కరిగిన ఆరాతి ద్రవం లో చిక్కుకోన్నాయి .

16-సమ సమతాం హనుమతే నితాంతం సమ విశదయతాం హర్ష స్వాంతం

వ్యస్మరతాం స్వాగమ వృత్తాంతం –సమ పశ్యతాం స్వ వీణా క్రాంతం .

తా—అలాశిలా ద్రవం లో చిక్కుకు పోయిన వీణలను గురించి ఆలోచిస్తూ తాము వచ్చిన పని మరిచిపోయి నారద ,తుంబురులు తమమనసు పొందిన ఆనందాన్ని తెలియ జేస్తూ వినయంగా వంగి నమస్కరిస్తున్నారు .

17- తం కపి వర్యం మౌనిఖ్యాతౌ –దృష్ట్వా దృష్ట్వా సమ్యక్ ప్రీతౌ

భక్త్యా ముకుళిత హస్తౌ జాతౌ –తౌ ద్వౌ కృతార్ధ తామాయాతౌ ‘’

తా-ఆ విధంగా ఆ ఇద్దరు మునులు కపివరుని చూసిన కొద్దీ ప్రేమ పొంగి ,చేతులు జోడించి నిలబడి తమ జన్మలు సార్ధక మైనట్లు భావించారు .

18-రామాలాపం విరతం కృత్వా –హనుమాన్ తౌ గాపయితుం మత్వా

ఉభౌ యువాం గాయత మిత్యుక్త్వా –తిస్టతి కరతాళం  గమయిత్వా .-

తా—అప్పుడు హనుమ శ్రీరామ గానాలాపం ఆపి ,ఎదుట అత్యంత విధేయంగా నిలబడిన ఆ ఇద్దరు మునులను రామనామ గానంచేయమని ,తాళాలు అందజేయటానికి సిద్ధం గా ఉన్నాడు .

19-ఆదౌ తుంబుర ఉవాచ –భక్త్యర్దీవ సముత్తిస్టన్ ప్రీత్యా

సంజ్ఞ ప తేశ్రీ కపయే –సన్నమితాంగః కృతాంజలిః.

తా—మొదటగా తుంబురుడు భక్తీ ఆవేశం కలగలుపుగా నమస్కారం చేసి శ్రీ హనుమత్ప్రభువుతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు ,

20 –నిరస్త సమస్త దురిత వ్రాతం –మామిహ విద్యా గర్వా పేతం

సుజన వినీతం సాదుపునీతం –కరోతి హనుమాన్ యుష్మద్గీతం .

తా-తుంబురుడు హనుమతో ‘’హనుమ స్వామీ!నువ్వు చేసిన భక్తీ గాన లహరి విశ్వ వ్యాప్తమై పాపాలన్నిటిని పటా పంచలు చేసింది . నావిద్యా గర్వాన్ని అణచి వేసింది .సుజనత్వాన్నిచ్చి పవిత్రుడిని  చేసింది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.