శ్రీ సువర్చలాంజ నేయం – రచన –స్వర్గీయ శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారుతెలుగు పండితులు -గురజాడ –కృష్ణా జిల్లా –రచనా కాలం -11-2-1976-

శ్రీ సువర్చలాంజ నేయం

రచన –స్వర్గీయ శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారుతెలుగు పండితులు -గురజాడ –కృష్ణా జిల్లా  –రచనా కాలం -11-2-1976-

ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో మేము తొమ్మిదీ పది తరగతులు చదువుతున్నప్పుడు మాకు తెలుగు బోధించిన గురు వరేన్యులు శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మగారు .చక్కగా బోధిస్తూ ఎన్నో మంచికధలను ధారావాహికం గా చెప్పి వినోద విజ్ఞానాలు కలిగించేవారు .వారు నిత్యం గురజాడ నుండి సైకిల్ పై వచ్చేవారు .చాలా సౌమ్యులు నెమ్మది స్వభావులు .సన్నగా మాట్లాడినా స్పుటం గా వినిపించేది .గొప్ప బోధకులు. వారంటే శిశ్యు  లందరికి అమిత గౌరవం ఉండేది  చిరునవ్వు తప్ప ఎప్పుడూ కోపం వారిలో మేము చూడలేదు .తెల్లనిపంచా చొక్కా పై పంచె తో సరిపడా రూపం వారిది .నల్ల చాదుబొట్టు పెట్టుకొనే వారు ఎర్రగా  వెడల్పైన  ముఖం తో కనిపించేవారు .నాపై శిష్య వాత్సల్యం ఎక్కువగా ఉండేది .అప్పుడే మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రిగారూ మా హైస్కూల్ లో తెలుగు పండితులుగా ఉన్నారు .వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి  అమిత  గౌరవ భావన ఉండేది .శర్మగారుబందరుకు చెందిన ప్రఖ్యాత కవి గురజాడ రాఘవ శర్మ గారికి  పెదనాన్నగారి  కుమారుడు .

శర్మ గారు గురజాడలో కాపురం ఉండగా   కపి రూపం లో శ్రీ ఆంజనేయస్వామి స్వప్నం లో కనిపించగా తనను ఏదైనా  ఆయనపై కావ్యం రాయమని ఆదేశించారేమోనన్న భావన కలిగి ప్రారంభిస్తే అది ‘’శ్రీ సువర్చలాంజ నేయం ‘’గా సంస్కృత శ్లోకాలలో పరంపరగా ధారగా వెలువడిందట .పూర్తీ అవగానే శర్మ గారి పేద తండ్రిగారి కనిష్ట పుత్రులు  గురజాడ గోపాల కృష్ణ మూర్తి గారు గురజాడ శ్రీ కోదండ రామాలయ ధర్మ కర్తగా పుస్తకాన్ని ముద్రించి శ్రీరాముని ఎదుట ప్రతిష్టితుడైన శ్రీ ఆంజనేయస్వామికి 11-2-1976 శ్రీ రాక్షస నామ సంవత్సర భీష్మ ఏకాదశి నాడు అంకిత మిచ్చే ఏర్పాటు చేశారు .సంస్కృత శ్లోకాలకు శర్మ గారే చిక్కని సరళ తాత్పర్యం రాశారు . ఈ పుస్తకాన్ని  మా సువర్చలాంజనేయ స్వామిదేవాలయ అర్చక స్వామి ఛి వేదాంతం మురళీ కృష్ణ సంపాదించి నాకు ఇచ్చాడు.

13-5-2015 శ్రీ హనుమజ్జయంతి నాడు స్వామి వారల శాంతికల్యాణ మహోత్సవం లో నేను రాసిన ‘’దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ‘’గ్రంధం(నేను రాసిన పదవ పుస్తకం –సరస భారతి ప్రచురించే పదిహేనవ పుస్తకం ) ఆవిష్కరణ చేయ బోతున్నాముకనుక   అందులో మా గురువుగారు రాసిన ‘’శ్రీ సువర్చలాన్జనేయం ‘’ ను చేర్చాలని భావిస్తూ , ఈ రోజు నుంచి దీనిని ధారావాహికం గా మీకు అంద జేస్తున్నాను .మాస్టారు రాసిన ‘’గురజాడ గ్రామం ‘’బదులు ‘’ఉయ్యూరు గ్రామం ‘’అని మాత్రమె మారుస్తున్నాను .మిగతాది అంతా యధాతధం గా ఉంటుంది .మ మాస్టారి సంస్కృత రచనా పాండిత్యం ఈ పుస్తకం చదివే దాకా నాకు తెలియదు .వారిని మీ అందరికీ పరిచయం చేసి శిష్యుడిగా నా ధర్మాన్ని నేరవేరుస్తున్నాను .గురువుగారు శర్మగారికి వినయ విధేయతలతో శిరసు వంచి పాదాభి వందనం చేస్తూ  గురూణం తీర్చుకొంటున్నాను .మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -22-12-14-

‘’నాలీ కాక్ష  మలీకాక్షం ,వాగేషయ మగేశయం –విపుంగవ ధ్వజం  ధామ పుంగవ ధ్వజ మాశ్రయే ‘’

శ్రీ సువర్చలాంజ నేయం

1-శ్రీ మద్విద్యా దానోద్దండం –అపశబ్ద దోష రిపు ప్రచండం

హస్తే స్వాత్మీయ దంత దండం –వందే ప్రణవ స్వరూప తుండం

తాత్పర్యం –అన్నివిద్యలను దానం చేయటం లో ప్రసిద్ధుడు ,అపశాబ్దాలను దగ్గరికి రానీయని వాడు ,చేతిలో దంతం అనే ఆయుధాన్ని ధరించిన వాడు అయిన ఓంకార వక్ర తుండు(వినాయకుదు )నికి నమస్కారం .

2-ఉయ్యూరు (గురజాడ )పురే సంస్థిత వంతం –సతీసుతద్వయ శోభిత వంతం –

ద్రుత చంద్ర పదం  శ్రీ భగవంతం –వందే సదర్ధ వితరణ వంతం

తా—ఉయ్యూరు (గురజాడ)పురం లో వేంచేసి చంద్రుని వంటి ముఖం తో దేవేరితో ,పుత్ర ద్వయం తో శోభిల్లి సకలార్ధాలను అనుగ్రహించే భగ వంతునికి నమస్కారం .

3-శ్రీ హనుమంతం వింధ్య –స్థిత పారిజాత తరువార మూలం

ద్రష్టుం తుంబుర నారద –మునీ ఆదాద్యౌ సమాయాతౌ ‘’

తా—వింధ్యపర్వత సానువుల్లో పారిజాత వృక్ష మూలం లో విలసిల్లె శ్రీ హనుమత్ప్రభు దర్శనం కోసం నారద ,తుంబురులు సంతోషం తో వచ్చారు .

4-అన్యోన్యాదర పూర్వక –నమః ప్రదర్శిత మధసంద్రు తాంజలిః

శిలా తలయోః రుపరి స-న్యవేశ యత్తౌ కపి శ్రేస్టః

తా—పరస్పరం ఆదరంగా పలకరించు కొని కపి శ్రేష్టుడు హనుమంతుడు అంజలి బద్ధుడై వాళ్ళిద్దరినీ తన ఎదుట ఉన్న శిలా పీఠం పై కూర్చో బెట్టాడు .

5-భగవతి హనుమతి ధృత్వా  మోదం –కుర్వతి మధురం రామ నినాదం

సధ రతి బాష్ప వారి యశోదం-సముత్తి తౌ  తే వక్తుం వాదం

తా-హనుమ దివ్య రామనామ సంస్మరణ చేసిన వదనం తో కళ్ళనుండి బాష్పదార కారుతుండగా నారద  తుంబురులిద్దరూ ఆశ్చర్యం గా నిలబడి మాట్లాడటం ప్రారంభించారు .

6-రామేత్యేకే నైవాప దేశే –భారా తై స్తైర్బహు భేదేన

హనుమతి గాయతి సతి మోదేవ –తౌ యుక్తౌ విస్మయ నాదేన.

తా-భావ రాగ తళ యుక్తం గా అనేక విధాల రామ నామ దివ్య నామ సంకీర్తన తో ధన్యడయ్యే హనుమంతుని భక్తీ తత్పరతను చూసి  ఆశ్చర్య పడ్డారు .

7స బాష్ప వారి స్వార్తిర్యదిన –సమహా పుణ్యం బాష్పం యదిన

స మహా సిద్ధిఃపుణ్యం యదిన స పరం పశ్యతి సిద్ధిర్యదిన

తా–మనసులో ఆర్తి కలిగితేనే కన్నీరోస్తుంది .అలా స్రవించటం పుణ్యం .ఆ పుణ్య ప్రాప్తి వల్లనే మహాసిద్ధి .ఆ సిద్ధి పరలోకప్రాప్తికి సాధనం ..

8-శ్రీమన్మునీశ్వరౌ తౌ-స్వహృది స్తోత్రం ముదా కురుతాం తదా

శ్రీ రామ రామ రామే త్సుచ్చ్రై ర్గాయతి కపి శ్రేస్టే’’

తా-శ్రీరామ రామ అని ఎలుగెత్తి పాడే ఆ వానర శ్రేస్టూని చూసి మునీశ్వరులిద్దరూ స్తోత్రాలు చేశారు .

9-దృష్ట్వా దృష్ట్వా శ్రీ హనుమంతం –సంతుస్టువతు ర్బహు గాయంతం

పాదోక్షేపణ గతి నృత్యంతం –తౌ మే నాతేమహిమా వంతం .

తా—రామనామ గాన పారవశ్యం తో చిందులు దొక్కే హనుమాన్ ను కంటి రెప్ప వాల్చకుండా చూస్తూ ఆంజనేయుని మహిమను తెలుసుకొన్నారు .

10 –నిశ్చల చిత్తః కోవా భవతి –సు చిరంజీవీ కోవా భవతి

భూష్ణు ర్బ్రహ్మా కోవా భవతి-సమహాత్మా శ్రీ హనుమాన్ భవతి

తా—నిశ్చల చిత్తుడు ఎవరు?చిరంజీవి ఎవరు?భవిష్యత్తులో బ్రహ్మ అయ్యేది ఎవరు ?ఎవరోకాదు –ఆ మహాత్ముడు శ్రీ హనుమత్ ప్రభువే .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-14-ఉయ్యూరు

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.