శ్రీనాధుని భీమ ఖండ కధనం -12 ద్వితీయాశ్వాసం -5

శ్రీనాధుని భీమ ఖండ కధనం -12

ద్వితీయాశ్వాసం -5

వ్యాసుడు మళ్ళీ చెబుతున్నాడు .ఆ ఇల్లాలి పిలుపు వినిచేతిలోని శాప జలాన్ని పారబోశానని , ఆమెను సమీపించి నమస్కారం చేశానని అప్పుడామేది ఏ కులమోకూడా ఆలోచించలేదని ,ఎదుటి వారి గొప్పదనం తెలుసుకోవటానికి మనస్సు సాక్షి అని చెప్పాడు .ఆమె తన్ను దగ్గరకు పిలిచి –

‘’భిక్ష లేదని ఇంట కోపింతు రయ్య –కాశికా పట్టణము మీద ‘’కాని నేయ ‘’

నీ మనస్శుద్ధిబ్ దెలియంగా నీల కంఠు-డింత చేసెను గాక కూడేమి బ్రాతి .’’

‘’వ్యాసుడా!భిక్ష దొరక లేదని కాశిపై ఇంతగా కోపిస్తావా?విశ్వనాధుడు నీ మనస్సాక్షి తెలుసుకోవటానికి పెట్టిన పరీక్ష అని తెలుసుకోలేదు నువ్వు .కాకపొతే కాశిలో భిక్షకు లోటు ఉంటుందా .?అన్నది ‘’కానినేయ ‘’ అనే మాటను వ్యాసుడికి వాడింది కన్యకు పుట్టిన వాడా అనే అర్ధం .అతన్ని నీచ సంబోధన చేసింది .ఇది వ్యాసునికి రెండవ అవ మానం .కాశీలో విశాలాక్షి మధ్యాహ్న సమయం లో అభ్యాగతులకు బంగారు గరిటెతో అమ్రుతపాయాసం పెడుతుంది అన్నమాట వినలేదా అని ప్రశ్నించింది .ఏడు రోజుల్లో అన్నం దొరక్క పొతే కొంప మునిగిపోయినట్లు ఏడుస్తున్నావే .నీ ధీరత్వం ఏమైంది .పుణ్యాల రాసి శివుని భార్య అయిన కాశిని క్రోధం తో నిండి శ్మశానం చేయాలని చూస్తున్నావా /అన్నది

‘’క్రోన్నెల పువ్వు దాల్పునకు కూరిమి భోగ పురంధ్రి కక్కటా –యిన్నగరీ లలామమున కీ పరిపాటికి నిట్టి కోపమే

లన్న !ఘటించెదోమునికులాగ్రణినిక్కమువో ‘’బుభుక్షితః –కిన్నకరోతిపాప ‘’మను కేవల నీతిదలంచి చూడగన్ ‘’’భావం –శివునికి ప్రియ మైన భార్య అయిన కాశి పై ఇంట చిన్న విషయానికి అంట పెద్ద కోపం ఎందుకు పొందావు  ?అవున్లే ఆలోచిస్తే ‘’ఆకలి తో అలమటించే వాడు ఎపాపమైనా చేస్తాడు ‘’అన్న సామెత లోకం లో ఉండనే ఉన్నదికదా అని దేప్పింది .అలా అని ఊరుకోలేదామే –

‘’కాశిపై గోపిమ్పగా గాదు నీకు –నెంత కోపిం చునో నిందు మౌళి

విప్రుడవు గాన నేరము వెదక దగదు –భిక్ష గోన రమ్ము మాటలు పెక్కులేల ‘’-ఇంతటి వాడివి నువ్వు కాశీపై కోపం చూపరాదు  ఇది తెలిసి విశ్వనాధుడు నీపై ఇంకెంత కోపం వహిస్తాడో?బ్రాహ్మణుడివికనుక తప్పు వెదక కూడదు .ఇన్ని మాట లెందుకు కాని మా ఇంటిలో భిక్ష తీసుకోవటానికి రా .అని ఆహ్వానించింది ఆ ఇల్లాలిన పార్వతీ దేవి వ్యాసుని .

తర్వాత ఏం జరిగిందో చూద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-11-14-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.