Tag Archives: సువర్చలాన్జనేయ

శ్రీ సువర్చలాంజ స్వామి దేవాలయం –ఉయ్యూరు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు

శ్రీ సువర్చలాంజ స్వామి దేవాలయం –ఉయ్యూరు ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు

 

Inline image 1

శ్రీ సువర్చలాంజ స్వామి దేవాలయం –ఉయ్యూరు

    ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు

ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసియున్న  శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో 16-12-17 శనివారం ఉదయం 5 గం లకు స్వామి వారలకు స్నపన ,మన్యు సూక్తం తో అభిషేకం ,నూతన వస్త్ర ధారణ జరుగును .

  17-12- 17 (తెల్లవారితే ఆదివారం )నుండి 14-1-2018 ఆదివారం వరకు ధనుర్మాస సందర్భంగా  ప్రతిరోజూ ఉదయం 5 గంటలనుండి సుప్రభాతం ,ముకుందమాల ,తిరుప్పావై పఠనం అనంతరం  శ్రీ సువర్చలాంజ నేయ , శ్రీ గోదా రంగ నాద  స్వామి వారలకు సహస్ర నామ పూజ,ఉదయం 6-30 కు నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం జరుగును . అనంతరం ఉదయం 6-30 నుండి 7-30 వరకు ‘’సుందర కాండ ‘’పారాయణ  ఉంటుంది  .భక్తులు విశేషంగాపాల్గొని స్వామి వారి సేవలో పాల్గొని,  స్వామి వారల కృపకు పాత్రులు కావలసినదిగా మనవి .

                 మరికొన్ని ప్రత్యేక పూజలు

29-12-17 –శుక్రవారం –వైకుంఠ(ముక్కోటి )ఏకాదశి మహా పర్వదినం .ఉదయం -4 గం.లకు విశేష పూజ

                          ఉదయం -5 గం లకు –ఉత్తర ద్వార దర్శనం

                            సాయంత్రం-6 గం లకు శ్యామలాంబ భక్త బృందం చే- భజన,  భక్తి గీతాలాపన

01-01-2018- సోమవారం –నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భం గా ఉదయం 5-30 గం.లకు –‘’లడ్డూలు ‘’తో ప్రత్యేక పూజ .అనంతరం భక్తులకు లడ్డూ ప్రసాద వినియోగం –

06-1-2018-శనివారం  –పుష్య బహుళ పంచమి –ఉదయం 5-30 గం లకు స్వామివారలకు ‘’వెన్నపూస ‘’తో అభిషేకం

   సాయంత్రం -6-30 గం-లకు శ్రీ త్యాగ రాజ ఆరాధనోత్సవం, శ్రీ ఘంటసాల , శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారలకు  స్మృతి నీరాజనం

10- 1- 2018 –బుధవారం –ఉదయం -5-30 గం లకు ‘’అరిసెలు ‘’తో విశేష అర్చన .అనంతరం అరిసె ప్రసాద వితరణ

14-1- 2018 –ఆదివారం –భోగి పండగ –ఉదయం -5-30 గం లకు –శాకంబరీ పూజ (వివిధ కాయగూరలతో )

                               ఉదయం -10 గం –లకు శ్రీ సువర్చలాంజనేయ ,శ్రీ గోదా రంగనాయక స్వాముల శాంతి కళ్యాణమహోత్సవం .మధ్యాహ్నం 12- గం లకు నైవేద్యం ,హారతి, తీర్ధ ప్రసాద వినియోగం

15- 1- 18 సోమవారం –మకర సంక్రాంతి పండుగ –

                    ఉదయం  6 గం లకు పూజ ,8-30 గం లకు –సంక్రాంతి పురుషుని విశేషాలు

                                                             గబ్బిట దుర్గా ప్రసాద్ –ధర్మకర్త -9-12-17

                                                            మరియు భక్త బృందం 

Inline image 2
ప్రకటనలు

14-11-17 కార్తీక మాసం చివరి మంగళవారం సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయ స్వామిదేవాలయం లో సరసభారతి 115 సమావేశంగా శ్రీమతి కామాక్షిగారిచే ”శివానందలహరి ”ధార్మిక ప్రసంగం ,అనంతరం అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

14-11-17 కార్తీక మాసం చివరి మంగళవారం సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయ స్వామిదేవాలయం లో సరసభారతి 115 సమావేశంగా శ్రీమతి కామాక్షిగారిచే ”శివానందలహరి ”ధార్మిక ప్రసంగం ,అనంతరం అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

 

24-10-17 కార్తీకమాస మొదటి మంగళవారం రాత్రి ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామిదేవాలయం లో దీపాలంకరణ

24-10-17 కార్తీకమాస మొదటి మంగళవారం రాత్రి ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామిదేవాలయం లో దీపాలంకరణ

శ్రీ సువర్చలాంజ నేయ శతక త్రయం ధారణ పోటీలు

అందరికి విజ్ఞప్తి -ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల పై ముగ్గురు కవులతో మూడు శతకాలు రాయించి ఫిబ్రవరి 5 న  స్వామివారి  సన్నిధిలో ఆవిష్క రింప జేసిన సంగతి మీకు తెలుసు .

  శతకాలు రాయించినంత మాత్రాన  ఫలితం ఉండదని భావించి ఆ శతకాలపై ధారణ పోటీలు నిర్వ హిస్తున్నామని తెలియ జేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది .
 1-20 సంవత్సరాలు దాటిన వారు  మూడు శతకాలు కానీ ,రెండు శతకాలు కానీ ,కనీసం ఒక్క శతకం కానీ ధారణ చేసి పోటీలో పాల్గొని తప్పులు లేకుండా అప్ప చెప్పినవారికీ –
2-20 సంవత్సరాల లోపు వారు ఏదో ఒక శతకం కానీ ,లేక 50 పద్యాలుకాని కనీసం 25 పద్యాలుకాని ధారణ చేసి ,పోటీలో పాల్గొని తప్పులు లేకుండా అప్ప గించిన వారికి –
21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి నాడు  ఘనంగా నగదు బహుమతులను అందజేస్తామని తెలియ జేస్తున్నాము –
                                 గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
               మరియు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయ ధర్మ కర్త
                           6-3-2017 -ఉయ్యూరు

’శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ మహోత్సవం

16487674_1558133037548955_3807717928851995122_o

’శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ మహోత్సవం
ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారిపై 1-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ ) గారు రచించిన ‘’శ్రీ సువర్చలా సుందర వాయునందన శతకము ‘’2- మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు(విజయవాడ) రరచించిన ‘’శ్రీ సువర్చలా వల్లభ శతకము ‘’3-శ్రీ మంకు శ్రీను గారు(కొప్పర్రు –ప.గో. జి .) రచించిన ‘’శ్రీ సువర్చలేశ్వర శతకము ‘’ అనే శతక త్రయాన్ని ‘’సరసభారతి’’ ప్రచురించి, మాఘ శుద్ధ నవమి 5-2-2017 ఆదివారం నాడు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గం .లకు జరిగే’’సామూహిక పాల పొంగింపు’’కార్యక్రమం ,ఉదయం 9 గం .లకు జరిగే ‘’సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం’’ అనంతరం ఉదయం 11-30 గం లకు స్వామి వారల సమక్షం లో ఆవిష్కరింప జేస్తున్నామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాము .
ఆవిష్కరణ అనతరం శతక కర్త త్రయానికి సత్కార ,సన్మానాలు నిర్వహింపబడును .భక్తులు ,ప్రచురణ పూర్వక విరాళాలు అందజేసిన దాతలు ,వదాన్యులు సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
1-శ్రీ సువర్చలా సుందర వాయు నందన శతకము –ఆవిష్కరణ –వై .వి .బి..శ్రీరాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు
2-శ్రీ సువర్చలా వల్లభ శతకము- –ఆవిష్కరణ –శ్రీ ఏ .యు.వి..సుబ్రహ్మణ్యం –ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ –ఉయ్యూరు
3-శ్రీ సువర్చలేశ్వర శతకము –ఆవిష్కరణ –శ్రీ పరుచూరి శ్రీనివాసరావు –శ్రీనివాస విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ –ఉయ్యూరు

గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు
శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయ ధర్మకర్త

ధనుర్మాసం చివరి రోజు 13-1-17 శుక్రవారం భోగి నాడు ఉయ్యూరు శ్రీసువర్చలాంజ నేయస్వామి వారి దేవాలయం లో ప్రాతః పూజ గా శాకంబరీ (కాయ గూరలతో )పూజ చిత్రాలు

ధనుర్మాసం చివరి రోజు 13-1-17 శుక్రవారం భోగి నాడు ఉయ్యూరు శ్రీసువర్చలాంజ నేయస్వామి వారి దేవాలయం లో ప్రాతః పూజ గా శాకంబరీ (కాయ గూరలతో )పూజ చిత్రాలు

శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం –ఉయ్యూరు ధనుర్మాసం సందర్భంగా 10-1-17 –మంగళవారం-ఉదయం -5 -00 గం లకు –శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్ కు ‘’వెన్న’’సువర్చలాంజనేయ స్వామికి నవనీతం అలంకరణ – అరెసెలతో ప్రతేక పూజ’’

శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం –ఉయ్యూరు ధనుర్మాసం సందర్భంగా 10-1-17 –మంగళవారం-ఉదయం -5 -00 గం లకు –శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్ కు ‘’వెన్న’’సువర్చలాంజనేయ స్వామికి నవనీతం అలంకరణ – అరెసెలతో ప్రతేక పూజ’’ స్వామివారలకు ప్రత్యేక పూజనిర్వహించారు.