Category Archives: శ్లోకాలు

శ్రీ సువర్చలాంజ నేయ శతక త్రయం ధారణ పోటీలు

అందరికి విజ్ఞప్తి -ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల పై ముగ్గురు కవులతో మూడు శతకాలు రాయించి ఫిబ్రవరి 5 న  స్వామివారి  సన్నిధిలో ఆవిష్క రింప జేసిన సంగతి మీకు తెలుసు .

  శతకాలు రాయించినంత మాత్రాన  ఫలితం ఉండదని భావించి ఆ శతకాలపై ధారణ పోటీలు నిర్వ హిస్తున్నామని తెలియ జేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది .
 1-20 సంవత్సరాలు దాటిన వారు  మూడు శతకాలు కానీ ,రెండు శతకాలు కానీ ,కనీసం ఒక్క శతకం కానీ ధారణ చేసి పోటీలో పాల్గొని తప్పులు లేకుండా అప్ప చెప్పినవారికీ –
2-20 సంవత్సరాల లోపు వారు ఏదో ఒక శతకం కానీ ,లేక 50 పద్యాలుకాని కనీసం 25 పద్యాలుకాని ధారణ చేసి ,పోటీలో పాల్గొని తప్పులు లేకుండా అప్ప గించిన వారికి –
21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి నాడు  ఘనంగా నగదు బహుమతులను అందజేస్తామని తెలియ జేస్తున్నాము –
                                 గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
               మరియు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయ ధర్మ కర్త
                           6-3-2017 -ఉయ్యూరు
ప్రకటనలు

‘’శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ

‘’శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ

ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారిపై 1-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ ) గారు రచిస్తున్న  ‘’శ్రీ సువర్చలా వాయునందన శతకం ‘’2- మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు(విజయవాడ) రచిస్తున్న  ‘’శ్రీ సువర్చలా వల్లభ శతకం ‘’3-శ్రీ మంకు శ్రీను గారు(కొప్పర్రు –ప.గో. జి .) రచిస్తున్న ‘’శ్రీ సువర్చలేశ్వర శతకం ‘’  లను ‘’సరసభారతి’’ ప్రచురించి,  మాఘ శుద్ధ నవమి 5-2-2017  ఆదివారం నాడు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గం .లకు జరిగే’’సామూహిక పాల పొంగింపు’’కార్యక్రమం ,ఉదయం 9 గం .లకు జరిగే ‘’సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం’’  అనంతరం ఉదయం 11-30 గం లకు స్వామి వారల సమక్షం లో ఆవిష్కరింప బడుతుందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను .అనంతరం శతక కర్తలకు సత్కార ,సన్మానాలు నిర్వహింపబడును .భక్తులు ,సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

పూర్తి వివరాలతో ఆహ్వానాన్ని జనవరి రెండవ వారం లో అంద జేస్తాము .

గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయ ధర్మ కర్త .

హనుమద్గీతా సమావళి

డా.శ్రీ జి వి పూర్ణ చంద్ మూడు రోజులక్రితం నాకు ఫోన్ చేసి తనవద్ద బాగ్గా శిధిలావస్థలో  ఉన్న కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరున్న తమిరిసె గ్రామవాసి శ్రీ బ్రహ్మా భట్ల రామసూరి గారి పుత్రుడు శ్రీ పట్టాభి రామయ్య గారు రచించిన 61పద్యాల ”హనుమద్గీతా సమావళి”అనే చిన్న పుస్తకం ఉందని ,అందులోని పద్యాలు మృదు మధురంగా ఉన్నాయని ,నాకు పంపిస్తున్నానని చెప్పి పంపగా ఇవాళ చేరింది .అద్భుతమైన హనుమగానం అందులో వినిపించింది  శ్రీ పూర్ణ చంద్ కు క్రుతజ్ఞతలు తెలియ జేస్తూ ,.దాన్ని స్కాన్ చేసి మీ అందరికీ అంద జేస్తున్నాను .శ్రీ హనుమ గీతా సమావళి ని మీరూ అనుభ వించి , ఆనందించండి -దుర్గా ప్రసాద్ .samavali4 001 samavali5 001 samavali7 001 samavali-9 001 saavali6 001 samavali 2 001 samavali 3 001 samavali 8 001 samavali-1 001

శ్రీ సువర్చలాన్జనేయం -2

శ్రీ సువర్చలాన్జనేయం -2

11-యస్మిన్ శీతోస్తి కృష్ణ వర్త్మా-యం ఖే గమయతి సమీరణాత్మా

సయయే యస్సూక్ష్మ స్తూలాత్మా –సోయం శ్రీ హనుమాన్ పరమాత్మా

తాత్పర్యం –ఎవరికి అగ్ని చల్లగా ఉంటుందో ,ఎవరు ఆకాశం లో గాలిలో విహరిస్తారో ,ఎవరు సమయానుకూలంగా సూక్ష్మ అతి సూక్ష్మ రూఒపాలు దరిస్తారో  అలాంటి పరమాత్మ శ్రీహనుమత్ప్రభువు .

12-భక్తిస్చేత్కిం స్వాధ్యాయేన –స్మరణం చేత్కింమంత్ర జపేన

ఆర్తిస్చేత్కిం శుచితాపేన – లయతా చేత్కీంస్తుతి పఠనేన.

తా—భక్తీ లో మునిగిన వాడికి వేదం పఠఠనం ఎందుకు?ఆర్త హృదయం ఉంటె ప్రాయశ్చిత్తం దేనికి?భక్తీ తో ఆనంద నాట్య మాడేవానికి స్తోత్ర పాఠాలేల?

13-శబ్దార్ధ వ్యాక్రుతి విష యేషు –భక్త్యా వేశప్రోల్లాశేషు

భక్త శిఖండిః దుస్సంగేషు –హనుమత్తుల్యో నహి లోకేషు .

తా-వ్యాకరణం లోను భక్తీ ఆవేశం తో గంతులు వేయటం లో ,భక్తీ ప్రభావం లో దురితాల ధూళిని వదిలించటానికి హనుమంతునికి సాటి ముల్లోకాలలో ఎవరూ లేరు .

14-రామేత్యను పద ముద్గాయంతం –సులలిత సురుచిర పదోచ్చలంతం

కృత కరతాళం శిరసి వహంతం –ప్రణ మానస్సంతం శ్రీ హనుమంతం .

తా—అనుక్షణ రామ నామ గానలోలుడై ,కరతాళ ధ్వనులతో సుందర పదార  విందాలతో గంతులేస్తూ  రెండు చేతులు జోడించి శిరస్సున ఉంచుకొనే శ్రీహనుమంతునికి వందనం .

15-శ్రీరమేత్యాలాప పదాని –మునీంద్ర వీణా శిలాతలాని

కృత్వా సంయగ్ద్రవ రూపాణి-చక్షుర్వీణే  లగ్నేతాని .

తా—శ్రీరామ అనే పదం ఆలాపిస్తే శిలా తలాలు  కరిగి పోతున్నాయి .వాటికి ఆనించిన వీణలు కరిగిన ఆరాతి ద్రవం లో చిక్కుకోన్నాయి .

16-సమ సమతాం హనుమతే నితాంతం సమ విశదయతాం హర్ష స్వాంతం

వ్యస్మరతాం స్వాగమ వృత్తాంతం –సమ పశ్యతాం స్వ వీణా క్రాంతం .

తా—అలాశిలా ద్రవం లో చిక్కుకు పోయిన వీణలను గురించి ఆలోచిస్తూ తాము వచ్చిన పని మరిచిపోయి నారద ,తుంబురులు తమమనసు పొందిన ఆనందాన్ని తెలియ జేస్తూ వినయంగా వంగి నమస్కరిస్తున్నారు .

17- తం కపి వర్యం మౌనిఖ్యాతౌ –దృష్ట్వా దృష్ట్వా సమ్యక్ ప్రీతౌ

భక్త్యా ముకుళిత హస్తౌ జాతౌ –తౌ ద్వౌ కృతార్ధ తామాయాతౌ ‘’

తా-ఆ విధంగా ఆ ఇద్దరు మునులు కపివరుని చూసిన కొద్దీ ప్రేమ పొంగి ,చేతులు జోడించి నిలబడి తమ జన్మలు సార్ధక మైనట్లు భావించారు .

18-రామాలాపం విరతం కృత్వా –హనుమాన్ తౌ గాపయితుం మత్వా

ఉభౌ యువాం గాయత మిత్యుక్త్వా –తిస్టతి కరతాళం  గమయిత్వా .-

తా—అప్పుడు హనుమ శ్రీరామ గానాలాపం ఆపి ,ఎదుట అత్యంత విధేయంగా నిలబడిన ఆ ఇద్దరు మునులను రామనామ గానంచేయమని ,తాళాలు అందజేయటానికి సిద్ధం గా ఉన్నాడు .

19-ఆదౌ తుంబుర ఉవాచ –భక్త్యర్దీవ సముత్తిస్టన్ ప్రీత్యా

సంజ్ఞ ప తేశ్రీ కపయే –సన్నమితాంగః కృతాంజలిః.

తా—మొదటగా తుంబురుడు భక్తీ ఆవేశం కలగలుపుగా నమస్కారం చేసి శ్రీ హనుమత్ప్రభువుతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు ,

20 –నిరస్త సమస్త దురిత వ్రాతం –మామిహ విద్యా గర్వా పేతం

సుజన వినీతం సాదుపునీతం –కరోతి హనుమాన్ యుష్మద్గీతం .

తా-తుంబురుడు హనుమతో ‘’హనుమ స్వామీ!నువ్వు చేసిన భక్తీ గాన లహరి విశ్వ వ్యాప్తమై పాపాలన్నిటిని పటా పంచలు చేసింది . నావిద్యా గర్వాన్ని అణచి వేసింది .సుజనత్వాన్నిచ్చి పవిత్రుడిని  చేసింది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

శ్రీ సువర్చలాంజ నేయం – రచన –స్వర్గీయ శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారుతెలుగు పండితులు -గురజాడ –కృష్ణా జిల్లా –రచనా కాలం -11-2-1976-

శ్రీ సువర్చలాంజ నేయం

రచన –స్వర్గీయ శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారుతెలుగు పండితులు -గురజాడ –కృష్ణా జిల్లా  –రచనా కాలం -11-2-1976-

ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో మేము తొమ్మిదీ పది తరగతులు చదువుతున్నప్పుడు మాకు తెలుగు బోధించిన గురు వరేన్యులు శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మగారు .చక్కగా బోధిస్తూ ఎన్నో మంచికధలను ధారావాహికం గా చెప్పి వినోద విజ్ఞానాలు కలిగించేవారు .వారు నిత్యం గురజాడ నుండి సైకిల్ పై వచ్చేవారు .చాలా సౌమ్యులు నెమ్మది స్వభావులు .సన్నగా మాట్లాడినా స్పుటం గా వినిపించేది .గొప్ప బోధకులు. వారంటే శిశ్యు  లందరికి అమిత గౌరవం ఉండేది  చిరునవ్వు తప్ప ఎప్పుడూ కోపం వారిలో మేము చూడలేదు .తెల్లనిపంచా చొక్కా పై పంచె తో సరిపడా రూపం వారిది .నల్ల చాదుబొట్టు పెట్టుకొనే వారు ఎర్రగా  వెడల్పైన  ముఖం తో కనిపించేవారు .నాపై శిష్య వాత్సల్యం ఎక్కువగా ఉండేది .అప్పుడే మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రిగారూ మా హైస్కూల్ లో తెలుగు పండితులుగా ఉన్నారు .వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి  అమిత  గౌరవ భావన ఉండేది .శర్మగారుబందరుకు చెందిన ప్రఖ్యాత కవి గురజాడ రాఘవ శర్మ గారికి  పెదనాన్నగారి  కుమారుడు .

శర్మ గారు గురజాడలో కాపురం ఉండగా   కపి రూపం లో శ్రీ ఆంజనేయస్వామి స్వప్నం లో కనిపించగా తనను ఏదైనా  ఆయనపై కావ్యం రాయమని ఆదేశించారేమోనన్న భావన కలిగి ప్రారంభిస్తే అది ‘’శ్రీ సువర్చలాంజ నేయం ‘’గా సంస్కృత శ్లోకాలలో పరంపరగా ధారగా వెలువడిందట .పూర్తీ అవగానే శర్మ గారి పేద తండ్రిగారి కనిష్ట పుత్రులు  గురజాడ గోపాల కృష్ణ మూర్తి గారు గురజాడ శ్రీ కోదండ రామాలయ ధర్మ కర్తగా పుస్తకాన్ని ముద్రించి శ్రీరాముని ఎదుట ప్రతిష్టితుడైన శ్రీ ఆంజనేయస్వామికి 11-2-1976 శ్రీ రాక్షస నామ సంవత్సర భీష్మ ఏకాదశి నాడు అంకిత మిచ్చే ఏర్పాటు చేశారు .సంస్కృత శ్లోకాలకు శర్మ గారే చిక్కని సరళ తాత్పర్యం రాశారు . ఈ పుస్తకాన్ని  మా సువర్చలాంజనేయ స్వామిదేవాలయ అర్చక స్వామి ఛి వేదాంతం మురళీ కృష్ణ సంపాదించి నాకు ఇచ్చాడు.

13-5-2015 శ్రీ హనుమజ్జయంతి నాడు స్వామి వారల శాంతికల్యాణ మహోత్సవం లో నేను రాసిన ‘’దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ‘’గ్రంధం(నేను రాసిన పదవ పుస్తకం –సరస భారతి ప్రచురించే పదిహేనవ పుస్తకం ) ఆవిష్కరణ చేయ బోతున్నాముకనుక   అందులో మా గురువుగారు రాసిన ‘’శ్రీ సువర్చలాన్జనేయం ‘’ ను చేర్చాలని భావిస్తూ , ఈ రోజు నుంచి దీనిని ధారావాహికం గా మీకు అంద జేస్తున్నాను .మాస్టారు రాసిన ‘’గురజాడ గ్రామం ‘’బదులు ‘’ఉయ్యూరు గ్రామం ‘’అని మాత్రమె మారుస్తున్నాను .మిగతాది అంతా యధాతధం గా ఉంటుంది .మ మాస్టారి సంస్కృత రచనా పాండిత్యం ఈ పుస్తకం చదివే దాకా నాకు తెలియదు .వారిని మీ అందరికీ పరిచయం చేసి శిష్యుడిగా నా ధర్మాన్ని నేరవేరుస్తున్నాను .గురువుగారు శర్మగారికి వినయ విధేయతలతో శిరసు వంచి పాదాభి వందనం చేస్తూ  గురూణం తీర్చుకొంటున్నాను .మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -22-12-14-

‘’నాలీ కాక్ష  మలీకాక్షం ,వాగేషయ మగేశయం –విపుంగవ ధ్వజం  ధామ పుంగవ ధ్వజ మాశ్రయే ‘’

శ్రీ సువర్చలాంజ నేయం

1-శ్రీ మద్విద్యా దానోద్దండం –అపశబ్ద దోష రిపు ప్రచండం

హస్తే స్వాత్మీయ దంత దండం –వందే ప్రణవ స్వరూప తుండం

తాత్పర్యం –అన్నివిద్యలను దానం చేయటం లో ప్రసిద్ధుడు ,అపశాబ్దాలను దగ్గరికి రానీయని వాడు ,చేతిలో దంతం అనే ఆయుధాన్ని ధరించిన వాడు అయిన ఓంకార వక్ర తుండు(వినాయకుదు )నికి నమస్కారం .

2-ఉయ్యూరు (గురజాడ )పురే సంస్థిత వంతం –సతీసుతద్వయ శోభిత వంతం –

ద్రుత చంద్ర పదం  శ్రీ భగవంతం –వందే సదర్ధ వితరణ వంతం

తా—ఉయ్యూరు (గురజాడ)పురం లో వేంచేసి చంద్రుని వంటి ముఖం తో దేవేరితో ,పుత్ర ద్వయం తో శోభిల్లి సకలార్ధాలను అనుగ్రహించే భగ వంతునికి నమస్కారం .

3-శ్రీ హనుమంతం వింధ్య –స్థిత పారిజాత తరువార మూలం

ద్రష్టుం తుంబుర నారద –మునీ ఆదాద్యౌ సమాయాతౌ ‘’

తా—వింధ్యపర్వత సానువుల్లో పారిజాత వృక్ష మూలం లో విలసిల్లె శ్రీ హనుమత్ప్రభు దర్శనం కోసం నారద ,తుంబురులు సంతోషం తో వచ్చారు .

4-అన్యోన్యాదర పూర్వక –నమః ప్రదర్శిత మధసంద్రు తాంజలిః

శిలా తలయోః రుపరి స-న్యవేశ యత్తౌ కపి శ్రేస్టః

తా—పరస్పరం ఆదరంగా పలకరించు కొని కపి శ్రేష్టుడు హనుమంతుడు అంజలి బద్ధుడై వాళ్ళిద్దరినీ తన ఎదుట ఉన్న శిలా పీఠం పై కూర్చో బెట్టాడు .

5-భగవతి హనుమతి ధృత్వా  మోదం –కుర్వతి మధురం రామ నినాదం

సధ రతి బాష్ప వారి యశోదం-సముత్తి తౌ  తే వక్తుం వాదం

తా-హనుమ దివ్య రామనామ సంస్మరణ చేసిన వదనం తో కళ్ళనుండి బాష్పదార కారుతుండగా నారద  తుంబురులిద్దరూ ఆశ్చర్యం గా నిలబడి మాట్లాడటం ప్రారంభించారు .

6-రామేత్యేకే నైవాప దేశే –భారా తై స్తైర్బహు భేదేన

హనుమతి గాయతి సతి మోదేవ –తౌ యుక్తౌ విస్మయ నాదేన.

తా-భావ రాగ తళ యుక్తం గా అనేక విధాల రామ నామ దివ్య నామ సంకీర్తన తో ధన్యడయ్యే హనుమంతుని భక్తీ తత్పరతను చూసి  ఆశ్చర్య పడ్డారు .

7స బాష్ప వారి స్వార్తిర్యదిన –సమహా పుణ్యం బాష్పం యదిన

స మహా సిద్ధిఃపుణ్యం యదిన స పరం పశ్యతి సిద్ధిర్యదిన

తా–మనసులో ఆర్తి కలిగితేనే కన్నీరోస్తుంది .అలా స్రవించటం పుణ్యం .ఆ పుణ్య ప్రాప్తి వల్లనే మహాసిద్ధి .ఆ సిద్ధి పరలోకప్రాప్తికి సాధనం ..

8-శ్రీమన్మునీశ్వరౌ తౌ-స్వహృది స్తోత్రం ముదా కురుతాం తదా

శ్రీ రామ రామ రామే త్సుచ్చ్రై ర్గాయతి కపి శ్రేస్టే’’

తా-శ్రీరామ రామ అని ఎలుగెత్తి పాడే ఆ వానర శ్రేస్టూని చూసి మునీశ్వరులిద్దరూ స్తోత్రాలు చేశారు .

9-దృష్ట్వా దృష్ట్వా శ్రీ హనుమంతం –సంతుస్టువతు ర్బహు గాయంతం

పాదోక్షేపణ గతి నృత్యంతం –తౌ మే నాతేమహిమా వంతం .

తా—రామనామ గాన పారవశ్యం తో చిందులు దొక్కే హనుమాన్ ను కంటి రెప్ప వాల్చకుండా చూస్తూ ఆంజనేయుని మహిమను తెలుసుకొన్నారు .

10 –నిశ్చల చిత్తః కోవా భవతి –సు చిరంజీవీ కోవా భవతి

భూష్ణు ర్బ్రహ్మా కోవా భవతి-సమహాత్మా శ్రీ హనుమాన్ భవతి

తా—నిశ్చల చిత్తుడు ఎవరు?చిరంజీవి ఎవరు?భవిష్యత్తులో బ్రహ్మ అయ్యేది ఎవరు ?ఎవరోకాదు –ఆ మహాత్ముడు శ్రీ హనుమత్ ప్రభువే .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-14-ఉయ్యూరు

శ్రీ ఆంజనేయ స్వామి దండకం -8 (చివరి భాగం )

  శ్రీ ఆంజనేయ స్వామి దండకం -8  (చివరి భాగం )

 

      –‘’ఓరోరి దేవారులారా !అదే ,వానరం బట్టి ,చల్లార్డ్చి పో బుచ్చుడీ యంచు ,దేవారులం బంప ,వారందరున్ నిన్ను బట్టంగ నేతేన్చుటల్ ,చూచి ,యోక్కింటి పై ,నుండి యోక్కింటి కిం దాటుచున్ జిక్కకం జిక్కులం బెట్టగా ,నంతలో ,బావక జ్వాలలం బేర్చి ,రాకాసులం జుట్టు ముట్టంగ ,నం బట్టుటల్ మాని ,నిన్ బట్టుడీ యంచు ,బోట్టల్గదల్పంగా శక్యమ్బునుం గాక ,యట్టట్టు రా యంచు అట్టట్టు పోయంచు ,నోల్లెంది కాల్లాడకన్ ద్రోబ్బి ,ద్రోబ్బిల్ల చె ద్రొక్కి ,త్రోక్కిల్ల చె పిల్లలుం దల్లులున్ గానకన్ ,నుగ్గు నూచంబుగా ,జాప కట్టి ,ధరణ మ్రోగ్గా ,నాలో బోగల్గన్నులం గప్ప ,దావాగ్ని లో గూలగా ,బంక్తి కన్తానుజున్దాది గా దానవుల్ ,రావణుం జూచి ,హా !తప్పునే కీడు ,లోకైక మాతన్ ,మహా సత్యశీ లన్ ,మహీజాతాన్ ,సీతనుం బాపి ,నీ వెంతయున్ బుద్ధి హీనున్దవై ,తెచ్చి ఈ లంకలో బెట్ట ,నీ వంక నీ లంకకున్ ,జేటు వాటిల్లే ,సీతా మహాదేవి గోడేళ్ళ జేకూడే ,నా గొడుకుం దోడుగా నేపుమై ,దండ దరుమ్డునున్ ,బోరి ,నీ లంకలో ,జొచ్చె ,నిన్కేమి సుద్దుల్ ?వివాదంబు లేలా ?విలోకింపు మంచున్ ,బట పంచాలి ,రోదన ద్వానముల్ నిండి యుండంగ ,దత్పట్టణా వస్తయుం జూచి ,బృందారకానీకమా నంద మున్ బొంది ,యత్యద్భుతం బంది ,వేగన్ నిమేశంబులో ,లంక నిర్దూమ దామంబు జేసి ,వాలంబునన్ ,మండువైశ్వానర జ్వాల లంటించి ,మున్నీటి లో ముంచి ,మోదంబు తో వచ్చి ,వైదేహికిన్ మ్రొక్కి ,హర్షించి ,దీవించి ,పోమ్మంచు సేల్వీయగా ,సాగుచున్ ,గేరుచున్ ,సాగరం బచ్చుగా దాటి ,సుగ్రీవు నాజ్నా ప్రభావంబునన్ ,మించు నారామ సీమన్ వడిన్ బోయి ,యా మ్రాకులం బ్రాకి ,మాకందముల్ గ్రోలి ,యానందమున్ బొంది ,యుండంగ ,నచ్చోట గాపున్న వారెల్ల ,వీక్షించి ,సుగ్రీవుకుం దూరు జేర్ప ,న్వడిం బోయి ,దేవా !ఇదో నేడు హన్మంతుడన్వాడు మా వాడకున్ వచ్చి ,జున్నుల్ తగన్ రేచి ,పండుల్ తగన్ మెక్కి ,మేమెంతయున్ దోలినన్ ,బోక మమ్ముం బడన్ నూకి ,బల్పంది,యా నీ వనం బెల్ల గ్రీడింపు చున్నాడు ,ఆ వానరుం బట్టితే నోడ్లనుం బంపుమీ యంచు ,ణా వార్తయుం జెప్ప ,శ్రీ రాము కార్యంబు సిద్ధించే గాబోలు ,లేకున్న ,ణా  యాజ్న యుం మీరునే యంచు ,వారిన దగన్ బంపి యా రామ భూపాలుతో ,జెప్పగా ,రామ భూపాలుడున్ వాని రావింపు మంచాన తీయంగా వారందరున్ గూడి నీ పాలి కేతెంచి ,నీ సోంపు దీపింప ,నిన్ సన్నుతుల్ సేయుచు న్నాకపుల్ ,గుంపులుం గట్టి ,శీఘ్రం బు గా దొర్లి ,మీ ఫాల మా రామ భూపాలు పాదార విన్దముల్ సోక ,సాష్టాంగ దండ ప్రణామంబు లుం జేసి ,శిరో రత్నంబు ,నచ్చెంగటన్ బెట్టి ,నిల్వంగా ,గారుణ్య సాన్ద్రుమ్డు ,గాంభీర్య ద్ర్యుమ్డు ,నీ శౌర్య ధైర్యంబు లెక్కించి ,నీ కోర్కు లెల్లన్ బ్రసాదించే ,నీ వంటి వేల్పుం బ్రశంసింప నాకున్ దరంబా ,ధరన్ బాప చిత్తుండ ,మర్త్యుమ్డ ,నా జిహ్వాయందేల్ల కాలంబు నున్నిల్చి ,నన్నేలి రక్షిమ్పుమీ !లక్ష్మణ ప్రాణ సంరక్ష నోపాయ ,సంజీవి రాయా !కనద్వజ్ర కాయా !అహో మూర్విడి గ్రామ సంవాసిత శ్రేయ ,!పూజా విధేయా !యటంచున్ ,జమత్కార భాషా విశేశోన్నతి న్నర్ది గావిన్చేనా ర్వేల వంశాబ్ది చంద్రుండు ,కారుణ్య లబ్దాను సారుండు ,విద్వజ్జనానంద సేవా దురీణుండు ,శ్రీ వాసు దేవుండు ఈ దండకం బుర్విలో నెవ్వరున్ వ్రాసినన్ ,జెప్పినన్ ,వీనులన్ విన్న ,సర్వంకష ప్రజ్ఞా నిర్వక్ర శక్రోన్నతి న్నాయు రారోగ్య వైభవో పెతులై ,యుందు రౌ ,సోంపు మీరంగ శ్రీ రామ దాసా !యశోల్లాస దేవాన్జనేయా నమస్తే ,నమస్తే ,నమస్తే నమస్తే నమః ‘’

              శ్రీ ఆంజనేయ స్వామి దండకం సమాప్తం

                ఈ దండక రచయిత –మూర్విడిగ్రామ నివాసి శ్రీ వాసు దేవ కవి (ఈ దండకాన్ని వావిల్లరామస్వామి  శాస్త్రి అండ్ సన్స్ వారు 1963 లో ప్రచురించారు .)

              మహర్నవమి శుభా కాంక్షలతో—

                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-10-12-ఉయ్యూరు 

http://sarasabharati.wordpress.com
https://suvarchalaanjaneyaswami.wordpress.com