Category Archives: శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం

హనుమ నామస్మరణం…సర్వపాప నివారణం

హనుమ నామస్మరణం…సర్వపాప నివారణం

భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయస్వామి అనాధి నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది. హనుమంతుడు సహవేనుడు. గొప్ప రామభక్తుడు. అతి శక్తి వంతమైన రామనామం స్మరణ తోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచి పోయాడు. వీరత్వానికి ప్రతిక అయిన హనుమను ప్రతి రోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం, సుఖశాంతులు లభిసా ్తయని తులసీదాసు తాను రాసిన శ్రీహనుమాన్‌ చాలీసాలో చెప్పాడు. ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజి స్తాడు. హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది. రావణ కథానంతరం అయోధ్యలో శ్రీసీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగు తాడు. అప్పుడు హనుమ రామచంద్ర ప్రభూ, నాహృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచి పోవాలని, అదేవిధంగా ప్రతిక్షణం రామనామ స్మరణ తప్ప వేరే ధ్యాస తనకు కలగరాదని రామా! నీ నామస్మరణతోనే నా ఈ జన్మ పునీతం కావాలని అంత కన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామా! ప్రతిక్షణం నాలుకపై నీ నామ స్మరణ ఉండేలా కోరుకుంటున్నాను నాయీ కోరికను తీర్చమని హనుమ రాముడిని వేడుకుంటాడు. అందుకు రామచంద్రుడు తదాస్తు అని అంటాడు.
సీతా మాతకూడ తనకు అత్యంత ప్రేమ పాత్రుడగు హనుమను చూసి హనుమా నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరం ఇచ్చి ఆశీర్వదిస్తుంది. దేశంలోని ప్రతి పల్లెలో రామయణం ఉన్నట్లుగానే, ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది. హనుమ ఉన్న ఊరు నిత్యకల్యాణం పచ్చతోర ణంగా శోభిల్లుతుంది. తులసీదాసు రచించిన హనుమాన్‌ చాలీసాను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం క్రమం తప్ప కుండా ఎవరు భక్తితో చదువుతారో వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడ తాడు. ప్రతి రోజూ హనుమను సేవించడం వల్ల మనకు రోగ బాధలు. భూతప్రేత పిశాచ బాధలు తొలగు తాయి.
ప్రతి ఇంట్లో తప్ప నిసరిగా హనుమ ఫొటోను పెట్టుకోవాలి. ఆ పటానికి నిత్యం పూజలు చెయ్యాలి. ముఖ్యంగా విద్యా ర్థినీ విద్యా ర్థులు ప్రతి రోజూ హను మను భక్తితో పూ జిస్తే వారిలో ఆత్మస్థైర్యం ఆత్మ విశ్వాసం పెరుగు తుంది. చదువు లలో, ఆట పాటల్లో గొప్పగా రాణిస్తారు. ప్రతి మంగళ వారం, ఆంజనేయ స్వామి దేవాల యానికి వెళ్లి, అక్కడ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యివేసి దీపం వెలిగిస్తే చాలు మనలో ఉన్న కోరికలన్నీ తప్పక నెరువేరుతాయి. హనుమదా లయాలలో హనుమం తుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపి స్తాయి. ప్రసన్నాంజ నేయుడు, వీరాంజ నేయుడు, అభయాం జనేయుడు, పంచ ముఖాం జనేయుడు ఇలా అనేక రూపాలతో మనకు దర్శనం ఇస్తాడు. హను మను భక్తితో మనం స్మరిస్తే బుద్ధి బలం, యశస్సు, ధైర్యం, నిర్భయ త్వం మనలో పెరుగుతుంది. హనుమంతుడు మహాజ్ఞాని, దివ్యా కరణ పండి తుడు స్వయంగా సీతారామ స్త్రోత్తాన్ని రచించి వారి వలన తత్త్వ జ్ఞానోపదేశం పొం దాడు. ప్రతి ఒక్కరూ క్రమం తప్ప కుండా పదకొండు రోజులు గాని, ఇరవై ఒక్క రోజుగాని సుందరా కాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటాము. మానసిక పరమైన ఆనం దం కలుగుతుంది. ఆంజనేయస్వామి ఉపాసన చేయడం వలన మనసు ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే చాలు ఆ ఇల్లు సుఖ సంతోషా లతో కళకళ లాడుతుంది.

ప్రకటనలు

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం -50 (చివరి భాగం ) శ్రీ హనుమ గీతా భాష్య ఉదంతం

 శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం -50  (చివరి భాగం )
శ్రీ హనుమ గీతా భాష్య ఉదంతం  

పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధ మైన కురుక్షేత్ర రణ రంగం లో విజయుడి రధం జెండా పై ”కపి రాజు ”హను మంతుడు కొలువై ఉన్నాడు .యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్యా ,అర్జునుని కోరిక పై రధాన్ని నిలి పాడు పార్ధ సారధి అయిన శ్రీ కృష్ణుడు .కిరీటి రధం దిగి ,రెండు వైపులా ఉన్న సైన్య సమూహాన్ని చూశాడు .అందరు బంధువులే .కావలసిన వారే .వీళ్ళందర్నీ చంపి ,తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు .కనుక యుద్ధం చేయటం కంటే భిక్షం ఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి .మనసు అంతా వ్యాకులం అయింది .కర్తవ్యమ్ తోచటం లేడు .శ్రీ కృష్ణ పరమాత్మ నే శరణు కోరి కర్తవ్యమ్ బోధించమని  వేడు కొన్నాడు .
బావ మరిది ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడు అర్జునుని మనో భావం గుర్తిన్చాడు శ్రీ కృష్ణ భగవాన్ .వెంటనే పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతా సారాన్ని విని పించి యుద్దోన్ముఖుడిని చేశాడు .భగవానుని గీత ను అను సరించి ,విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు .
పార్దునికి ,పార్ధ సారధి విని పిస్తున్న భగవద్ గీత నంతటిని అర్జునుని రధాపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు .మనసుకు దాన్ని అంతటిని పట్టించు కొన్నాడు .”శ్రీ కృష్ణా ! నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా !”అని భక్తీ తో నమస్కరించాడు .అప్పుడు గోపాల చక్ర వర్తి శ్రీ  కృష్ణ పరమాత్మ ”హను మంతా !నేను చెప్పిన విషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు .దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు .నువ్వు విన్న గీత కు ”భాష్యం ”రచించు  .దానితో నీ పిశాచ రూపం అంత రిస్తుంది ”అని శాపాన్ని ,శాప విమోచనాన్ని తెలియ జేశాడు పరమాత్మ .
కురు క్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత,హనుమ పిశాచి రూపం పొంది ,గంధ మాదన పర్వతం చేరాడు .అక్కడ అత్యంత భక్తీ ,శ్రద్ధ లతో భగవద్ గీతను మననం చేసు కొంటూ ”,గీతా భాష్యం ”రచించాడు .అదే హనుమద్ భాష్యం ”గా లోకం లో ప్రసిద్ధి చెందింది .అక్కడక్కడ ఈ భాష్య గ్రంధాలు కనీ పిస్తున్నాయట .
ఈ కదా విశేషా లన్నిటిని మైత్రేయాది మహర్షులకు పరాశర మహర్షి చెప్పి” శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని”సంపూర్ణం గా తెలియ జేశాడు .ఆ మర్నాడు మైత్రేయాది మహర్షులు ,పరాశర మహర్షి ఇత్యాది  శిష్య బృందం అందరు కలిసి శ్రీ హనుమ పూజ ను నిర్వహించి ,నైవేద్యం పెట్టి అందరికి తీర్ధ ,ప్రసాదాలను అంద జేశారు .ఎక్కడ హనుమ పూజ జరుగు తుందో అక్కడ శ్రీ రాముడు సీతా ఆంజనేయ  సమేతం గా  లక్ష్మణ భరత శత్రుఘ్నపరి వారంతో ,ఉమా మహేశ్వరు లతో కొలువై ఉండి  అందరకు మనో భీష్టా లను నేర వేరుస్తాడు .
”ఆంజనేయ పాహిమాం -ఆంజనేయ రక్షమాం-ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్ష మాం-ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్ష మాం ”
”సువర్చ లాధిష్టిత వామ భాగం -నిరస్త కందర్ప సురూప దర్పణం –భాను ప్రభం ,రాఘవ కార్య దక్షం -అస్మత్కులేశం ,శ్రీ హానూ మంత మీడే”.
”హనుమా, నంజనా సూను,వాయుపుత్రో ,మహా బలహ -రామేష్టహ ,ఫల్గున సఖః ,పింగాక్షో ,అమిత విక్రమః
ఉదధి క్రమణశ్చైవ ,సీతా శోక వినాశనః ,లక్ష్మణ ప్రాణ దాతాచ ,సుగ్రీవస్య దర్పహా ,ద్వాదశైతాని నామాని కపీంద్రస్య
మహాత్మనః -స్వాప కాలే పతేన్నిత్యం ,యాత్రా కాలే విశేషతః ,-తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ”.
”అతులిత బలదామం ,స్వర్ణ శైలాభి దేహం- దనుజ  వర క్రుశానుం జ్ఞానినా మగ్ర గణ్యం- సకల గుణ నిధానం ,వానరా ణా మధీశం–రఘు పతి ప్రియ భక్తం వాత జాతం నమామి ”
”సుందరే సుందరే రామః సుందరే సుందరీ కధా –సుందరే సుందరీ సీతా ,సుందరే సుందరం వనం
సుందరే ,సుందరం కావ్యం ,సుందరే సుమ్దరః కపిహ్ -సుందరే సుందరం మంత్రం సుందరే కిం నసుందరం ”
”గోష్పదీకృత వారాశిం మశకీ కృత రాక్షసం -రామాయణ మహా మాలా రత్నం వందే అ నిలాత్మజం ”
”ఒక భూతంబున కుద్భ వించి ,మరి ఇంకో దాని పై కేగి -,ఇంకొక దానిన్ దరి ఈడ్చి ,వేరొకట రక్షో దేశమున్ గాల్చి ,-వేరొక
భూతంబు తనూజ గుర్తెరిగి పెరుమ్గాంచి -,భూత ప్రపంచక రూపాత్మకుడైన మారుతి సమస్తా రాధ్య దైవంబగున్ ”
శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
”వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే –పూర్వా భాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూ మతే
కరుణారస పూర్ణాయ,ఫలా పూప ప్రియాయచ -మాణిక్య హార కం థాయ మంగళం శ్రీ హానూ మతే
సువర్చలా కళత్రాయ,చతుర్భుజ ధరాయచ -ఉష్ట్రా రూధాయ వీరాయ ,మంగళం శ్రీ హానూ మతే
దివ్య మంగళ దేహాయ ,పీతాంబర ధరాయచ -తప్త కాంచన వర్ణాయ  మంగళం శ్రీ హానూ మతే
భక్త రక్షణ శీలాయ ,జానకీ శోక హారిణే-జ్వలత్పావక నేత్రాయ ,మంగళం శ్రీ హానూ మతే
పంపా తీర విహారాయ ,సౌమిత్రి ప్రాణ దాయినే -సృష్టి కారణ భూతాయ ,మంగళం శ్రీ హనూమతే
రంభా వన విహారాయ ,గంధ మాదన వాసినే –సర్వ లోకైక నాధాయ ,మంగళం శ్రీ హనూమతే
‘ పంచానన భీమాయ ,కాలనేమి హరాయచ –కౌండిన్య గోత్ర జాతాయ మంగళం శ్రీ హానూ మతే ”’.
శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం సర్వం సంపూర్ణం –ఓం శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ —
            మనవి –-ఈ యాభై వ ఎపిసోడ్ తో” శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం ”కదా కధనం పూర్తీ అయింది .మీ అందరి సహకారం తో విజయ వంత మైంది .ఇంతటి మహా రచన ను శ్రీ సువర్చ లాంజనేయ స్వామి అనుగ్రహం తో పూర్తీ చేయ గలిగాను .సుమారు ఆరు నెలల నుండి అందజేస్తున్న దారా వాహిక ఇది .మరో మంచి రచన ప్రారంభించే దాకా ,ప్రస్తుతం తాత్కాలిక విరామం .
దీనికి ముందు ”శ్రీ హనుమ కదానిధి ”అనే నలభై రెండు కధలను”నెట్లో ” రాసిన సంగతి మీకు తెలుసు . కధానిధిని, శ్రీ మతి మాధవి అనే మా అమ్మాయి అమెరికా స్నేహితురాలు ఆమె కుటుంబం,  మరికొందరు దాతల విరాళాలతో పుస్తక రూపం గా తెచ్చి ఏప్రిల్ ఒకటి శ్రీ రామ నవమి నాడు  ఉయ్యూరు లోని మాశ్రీ  సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో ఆవిష్కరించి, అందరికి ఉచితం గా అంద జేసిన న సంగతి కూడా మీ కు తెలుసు .ఇదంతా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల కరుణా కటాక్షం .
ఇప్పుడు ”శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం ”అనే ఈ యాభై కదల సంపుటిని కూడా భగవద్ అనుగ్రహం తో, పుస్తక రూపం లోకి తీసుకొని రావాలని భావిస్తున్నాము .దీనితో” సరస భారతి” ప్రచురణలు” పదికి ‘‘చేరు కొంటాయి .సరస భారతి ప్రచురించిన పుస్తకా లన్నిటిని, అందరికి ఉచితం గానే, దాతల సహకారం తో అంద జేస్తున్న సంగతి మీకందరికి గుర్తు ఉండి ఉంటుంది .ఈ పుస్తకాన్ని కూడా అలాగే వదాన్యులైన దాతల సహకారం తో ఉచితం గానే అందజేయాలనే మా సంకల్పం .కనుక ఆసక్తి ఉన్న వదాన్యులు ”స్పాన్సర్లు ”గా ముందుకు వచ్చి ,ఈ సాహితీ యజ్ఞానికి తోడ్పడ వలసిందిగా అర్దిస్తున్నాం .
మంగళం మహాత్ 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-8-12-కాంప్–అమెరికా

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం — 49 శ్రీ హనుమంతుని వేదాంతం కధ

  శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం — 49
                                                                                       శ్రీ హనుమంతుని వేదాంతం కధ 
ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .–”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః –ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్  ” –రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .
”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః –యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః –శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం –భోగశ్చ  ,మోక్షశ్చ ,కరస్త యేవ ”–అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు .
  చిటికెల భాగవతం
అయోధ్యలో ఉన్నంత కాలం శ్రీ రామునికి సర్వ సేవలు హనుమంతుడే చేశాడు .ఇది చూసి సీత ,లక్ష్మణుడు ,భరత శత్రుఘ్నులు చాలా బాధ పడు తున్నారు . వారికి రాముని సేవలు చేసే అవకాశమే రావటం లేదు .రాత్రి వేళల్లో సీతా దేవి చేయాల్సిన సేవలకు హనుమ అడ్డం వస్తున్నాడు .వీరంతా కలిసి ఆలోచించి ,ఒక ప్రణాళిక సిద్ధం చేసు కొన్నారు .అన్ని సపర్యలు తామే చేసే టట్లు హనుమ కు మాత్రం అతి చిన్నది అయిన ఒక పని అప్ప గించారు .అదే చిటికెల కార్య క్రమం .ఆ పని నైనా తనకు ఉంచి నందుకు పరమానంద పడ్డాడు మారుతి .అందరికి అంగీకార మైన పరిష్కారం లభించింది .
ఆ రోజు హనుమ శ్రీ రాముడిని తదేకం గా చూస్తూ కూర్చున్నాడు .పగలంతా గడిచి పోయింది .సీతా దేవి శ్రీ రాముని గది లోకి ప్రవేశించింది .హనుమ బయటకు వచ్చేశాడు .తలుపులు మూసేశారు దంపతులు .రాముడు ఎప్పుడు ఆవ లిస్తాడో తెలీదు అందుకని హనుమ విడువ కుండా ”చిటికెలు ”వేస్తూనే ఉన్నాడు .రాముడికి ఆవులింతలు వచ్చి, ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు .పధకం బెడిసి కొట్టింది .మళ్ళీ అంతా సమావేశ మై సేవలన్నీ ఆంజనేయుడే చేయాలి అని నిర్ణ యించారు .ఈ విషయాన్ని హనుమ కు తెలియ జేశారు .అప్పుడు చిటికెలు వేయటం మానేశాడు మారుతి .దానితో శ్రీ రాముడు నిద్రకు ఉపక్రమించాడు .ఇదీ చిటికెల భాగవతం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –20-8-12-కాంప్–అమెరికా
https://suvarchalaanjaneyaswami.wordpress.com

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –48 హనుమ భోజన కధ

  శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –48   
                                               హనుమ భోజన కధ 

సీతా సాధ్వి కి హనుమ మీద అమిత పుత్ర వాత్సల్యం ఉంది .తనను మళ్ళీ శ్రీ రాముని సన్నిధికి చేర్చినది మారుతి యే ననే నమ్మకం ఆమెది .ఆ సంజీవ రాయుడే లేక పోతే తన దుర్గతికి నిష్కృతి ఉండేది కాదను కొనేది .ఇప్పుడు ఆమె అయోధ్యా నగరానికి మహా రాణి .పుత్ర వాత్సల్యం తో అతన్ని విందుకు ఆహ్వా నించ దలచి శ్రీ రామునికి తెలిపింది .దానికి రాముడు  ”సీతా ! ఆంజనేయునికి తృప్తిగా భోజనం పెట్ట గలవా .అతడు రుద్రుడు .బాగా ఆలోచించి ఏర్పాట్లు చేసుకో ”అని ముందే హెచ్చరించాడు .జానకీ దేవి హనుమ ను మహా వీరుని గా ,అధ్యాత్మ చింతనా పరుని గా భావించింది కాని ,రుద్రాంశ సంభూతుడు అన్న విషయాన్ని మరిచి పోయింది .
ఏర్పాట్లన్నీ చక్కగా చేసింది .నోరూరించే పిండి వంటలు తయారు చేసింది .హనుమ ను ఆహ్వానించింది .అతడు సమయానికి వచ్చాడు .విస్తరి ముందు హాయిగా కూర్చున్నాడు .అన్ని పదార్ధాను సీతా దేవి యే వడ్డించింది .వడ్డిం చినవి ,వడ్డించి నట్లు తినేస్తున్నాడు మారుతి .ఒకే పదార్ధాన్ని అనేక సారులు అడిగి వడ్డింప జేసుకొని లాగించేస్తున్నాడు .వండిన వన్నీ ”స్వాహా ”చేశేశాడు .దిక్కు తోచ లేదు సీతమ్మకు .తృప్తి గా తిన కుండా హనుమ విస్తరి   ముందు నుంచి లేచే సూచన ఆమెకు కనిపించ లేదు .అప్పుడు ఆమె కు తన భర్త, హనుమ రుద్రావతారం అని చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చింది .వెంటనే మనస్సు లో శ్రీ రాముని ధ్యానించి,నమస్కరించింది .హనుమ వెనుక నుంచొని శివ పంచాక్షరి ”ఓం నమశ్శివాయ ”ను జపిస్తూ శివున్ని కాసేపు ధ్యానించింది .మహా రుద్రావతారు డైన శివాత్మజుడైన హనుమ తన రుద్రా రూపాన్ని సీతా మాతకు చూపించి ,కడుపు నిండిన వాడి లాగా జుర్రున త్రేపుతూ ,విస్తరి ముందు నుంచి లేచాడు . .ఆంజనేయుని  శివావతారాన్ని  అప్పుడామెదర్శించి ఆనందించింది .,అప్పటి దాకా హనుమ పై ఉన్న సాధారణ దృష్టి మారి పోయి, విశేష గౌరవ దృష్టి తో చూడటం మొదలు పెట్టింది .
                      అవిసె చెట్టు ప్రసాదం 
సీతా రాములు శత కంథరాక్షస సంహారం చేసి,అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఏకాదశీ పర్వదినం .ఏకాదశీ వ్రతాన్నిశ్రద్ధతో  నిర్వహించి ,మర్నాడు ద్వాదశి పారాయణ చేశారు .ద్వాదశి ఘడియలు దాటి పోకుండా విందు భోజనానికి ఏర్పాట్లు జరిగాయి .రాముని సోదరులు ,అనేక మంది రాజులూ ,విభీషణుడు మున్నగు వారు ,సుగ్రీవాదులు అందరు ఉచిత స్తానాల్లో భోజనాలకు కూర్చున్నారు .అందరికి బంగారు ఆకులలో వడ్డన జరిగింది .భోజనం తిన టానికి ముందు అందరు పరిశేచనం (నీటిని విస్తరి చుట్టూ మంత్ర పూతం గా తిప్పటం )చేస్తున్నారు .అప్పుడు హనుమ ఒక్క ఉదుటున శ్రీ రాముని సమీ పించి నమస్కరించి ,”రాజా రామా ! భక్త పరాదీనా !ఈ దాసుడిది ఒక విన్నపం ఉంది .ఆలించు .మొదట గా మీరు భోజనం చేసిన తరువాత మా వానర జాతి అంతా మీ ప్రసాదం గా భుజించ టానికి అనుజ్న నివ్వండి .”అని ప్రార్ధించాడు .ఇందులో ఏదో అంత రార్ధం ఉండి  ఉంటుందని ,లేక పోతే ఇలాంటి కోరిక కోరడని గ్రహించాడు రాముడు .”సరే అలానే కానిద్దాం ”అన్నాడు రామాదులు ,మహర్షులు తృప్తిగా భోజనం చేశారు .
హనుమ, శ్రీ రాముని బంగారు విస్తరి లో తినగా మిగిలిన  పదార్ధాలతోఒక ముద్ద ను ఒక గిన్నె లో ఉంచుకొని ,  ,దాన్ని దగ్గర లో ఉన్న ఒక అవిసె చెట్టు దగ్గరకు చేరి కింద ఉంచాడు .అవిసె పూలను కోసి, ఒక చోట చేర్చాడు .హనుమ ఎంచేస్తాడో చూడటానికి రాముని తో సహా అందరు కుతూహల పడుతున్నారు .అప్పుడు మారుతి సుగ్రీవాది వానర వీరు లందరినీ తన దగ్గరకు రమ్మని ఆహ్వానించాడు .వారంతా బిల బిల లాడుతూ చేరుకొన్నారు .శ్రీ రాముని ప్రసాదం అని చెప్పి ఆ గిన్నే లోని దానిని ఒక ముద్ద గా చేసి దానితో పాటు అవిసె పువ్వును ఒక్కక్క వానరుని చేతి లో ఉంచాడు .  దానిని ”రామార్పణం ”అని అనుకొంటూ కళ్ళకు అద్దుకొని ప్రసాదం గా భుజించమని కోరాడు .అందరు హనుమ చెప్పి నట్లే చేశారు .అందరు తిన్న తరువాత మారుతి, తాను కూడా దాన్ని అవిసె పువ్వు తో సహా ప్రసాదం గా కళ్ళకు అద్దు  కొని తిన్నాడు .ఇంత మంది వానరులకు ఆ కాస్త ప్రసాదమే,ఆ కాసిని అవిసె పూలే  అవ్యయం గా సరిపోయాయి .
అప్పుడు శ్రీ రాముడు హనుమ చెంత కు చేరి ” వాయు నందనా !ఇప్పుడు నువ్వు చేసిన ఈ కృత్యం వల్ల ద్వాదశి పారాయణ సమగ్రం గా ,సంతృప్తి గా సంపూర్ణం అయింది .ద్వాదశి వ్రతానికి గొప్ప సార్ధకత లభించింది .కనుక ఇప్పటి నుడి ప్రతి నెలలో వచ్చే రెండు ద్వాదశి తిధులలో ఈ అవిసె వృక్షానికి చెందిన పూలను ,కాయలను ,పత్రా లను భోజన పదార్ధాలుగా ఉపయోగించిన వారికి సకల సుఖ శాంతులు లభిస్తాయి వారందరూ నాకు అత్యంత ఆత్మీయులవుతారు .”అని వరం ఇచ్చాడు .అప్పటి నుండి అవిసె చెట్టు విష్ణు ప్రీతీ కరమైనది గా భావిస్తున్నారు .దాని ఆకులు కాయలు పూలను భక్తీ తో ద్వాదశి నాడు భుజిస్తారు .అవిసె కు ”అగస్త్య  ”అనే పేరు ఉంది .ఆకాశం లో అగస్త్య నక్షత్ర దర్శనం నాడు అవిసె బాగా పూస్తుంది .అవిసె ను ”అగిసే” అనీ కొన్ని చోట్ల పిలుస్తారు .అవిసె చెట్టు మహాత్మ్యాన్ని అందరికి తీలియ జేసిన ఘనత హనుమదే .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –13-8-12-కాంప్–అమెరికా

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –47 గంధ సింధూర విశేషం

 శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –47
  గంధ సింధూర విశేషం 
.శ్రీ రామ పాద సేవా దురంధరుడు , రామ భక్తీ సామ్రాజ్యాధి పతి అయినశ్రీ  హను మంతుడు అయోధ్య లో శ్రీ రామ పట్టాభి షెకాన్ని పరమ వైభవం గా జరి పించాడు .రామ పరభువు సీతా మాతను ప్రేమించి నంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరం గా ఉంచుతున్నాడని మనసు లో భావించాడు .రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు .తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్ధం కావటం లేదు .తన కంటే సీతా మాత లో అధికం గా ఏముంది ?ఆమెనే అంత ఆత్మీయం గా దగ్గరే ఉచుకోవటానికి కారణ మేమిటో ఆ ఆజనం బ్రహ్మ చారికి ఏమీ తెలియక తల్ల డిల్లు తున్నాడు .జానకీ దేవి పాపిడి లో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది .ఆ యెర్ర బొట్టు కు రాముడు ఆకర్షితు దయాదేమో నని అనుమానం వచ్చింది .ఆ సిన్దూరమే తన కొంప ముంచి శ్రీరాముడిని సీతా దేవికి అతి సమీపం గా ఉంచుతోందని భ్రమ పడ్డాడు .శ్రీ రామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించ లేని దుర్భర వేదన కు గురి అయాడు .దీని సంగతేమిటో తేల్చు కోవాలని శ్రీ రాముడి దగ్గరకే ,వెళ్లి చేతులు జోడించి ”రామయ తండ్రీ !మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిట లో సింధూరం ఉంది .దానికి కారణం ఏమిటో వివరించండి ”అని ప్రార్ధించాడు .
శ్రీ రామ ప్రభువు చిరు నవ్వు నవ్వి ,భక్త హనుమాన్ ను సమీపానికి రమ్మని ”భక్తా ఆంజనేయా !సీతా దేవి నుదుట సింధూర బొట్టు పెట్టు కోవటానికి కారణం ఉంది .శివ ధనుర్భంగం చేసి ,జానకిని వివాహ మాడిన శుభ సమయం లో ఆమె పాపిట మీద  సిన్దూరాన్ని నేను ఉంచాను .అప్పటి నుండి ఆమె సిన్దూరాన్ని పాపిటలో ధరిస్తోంది .దాని వల్ల నేను సీత కు వశుడను అయ్యాను .మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సిన్దూరమే కారణం ”అని వివరించి చెప్పాడు .
ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు .ఇక ఆలస్యం చెయ్య లేదు .వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి గంధ సిన్దూరాన్ని తీసుకొని ,నువ్వుల నూనె తో కలిపి ,తన ఒళ్లంతా పూసేసు కొన్నాడు .ఇలా చేస్తే  ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తనవాశం అవుతాడని భావించాడు .వెంటనే హుటాహుటిన శ్రీ రామ దర్శనం చేసి నమస్కరించి ”ప్రభూసీతా రామా !చిటికెడు సిన్దూరానికే సీతా మాతకు వశమై పోయావు .మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను .మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా ?”అని అమాయకం గా అయినా మనసు లోని మాటను ధైర్యం గానే చెప్పాడు .సీతా రాముడు నవ్వి ఆనందం తో ‘హనుమా !ఈ రోజు మంగళ వారం .నాకు ప్రీతీ కలిగించాలని శరీరం అంతా సిన్దూరాన్ని ధరించావు కనుక ,నీకు మంగళ వారం భక్తీ తో గంధ సింధూరం తో పూజ చేసి ,దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు .ఈ వరాన్ని నేను నీ కు అనుగ్రహించిన వరం గా గ్రహించు .”అని హనుమ కు మనశ్శాంతి ని చేకూర్చాడు  .అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళ వారం నాడు గంధ సింధూరం తో పూజ చేసి దానిని నువ్వుల నూనె తో కలిపి నుదుట బొట్టు పెట్టు కొనే ఆచారం లోకం లో ప్రారంభ మైంది .ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనె తో కలిపినా లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది .,అభిషేకం చేసిన తర్వాతా ఈ లేపనాన్ని పూస్తారు .సిందూర పూజ హనుమ కు అత్యంత ప్రీతీ కరం .అందులోను మంగళ వారం రోజున మరీ ఇష్టం .ఇదీ సింధూరం కధా విశేషం .
సింధూరం గురించి ఇంకో కధ కూడా ప్రచారం లో ఉంది .ఇది ఆంజనేయుని తొమ్మిది అవతారాలలోమొదటిది విజయుని చరిత్రకు సంబంధించినది .ఆ విజయుడే పాండవ మధ్యముడయినఅర్జునుడు . ధర్మ రాజు చేసిన రాజ సూయ యాగం లో దక్షిణ దేశాలను జయించటానికి అర్జునుడు సైన్యం తో బయల్దేరాడు .దక్షిణ సముద్రాన్ని చేరి ,అక్కడ శ్రీ రాముడు లంకకు కట్టిన వారధిని చూసి పరిహాసం గా నవ్వాడు .అక్కడే ఉన్న హనుమకు కోపం వచ్చింది ఇద్దరికీ వాగ్వాదం పెరిగింది .ప్రతిజ్ఞలు చేసుకొన్నారు పంతాలకు పోయి .అప్పుడు శ్రీ కృష్ణుడు అక్కడికి వచ్చాడు .కిరీటి బాణాలతో సేతువు ను నిర్మించాడు .దాని కింద ఎవ్వరికీ తెలీకుండా కృష్ణుడు తాబేలు ర రూపం లో ఉంది సేతువు విరిగి పోకుండా కాపాడు తున్నాడు .హనుమ ఒక్క సారి సేతువు పైకెక్కి కాళ్ళతో చిందర వందర చేస్తూ తొక్కు తున్నాడు .సేతువు యే మాత్రం వంగ కుండా  శిధిలం కాకుండా నిలబడి ఉంది హనుమ అంతటి బలాధ్యుని పాద ఘట్టనానికి తట్టు కొని నిల బడింది .ఆంజనేయుడు ఓటమిని అంగీకరించాడు .అర్జునుడు విజయ గర్వం తో విర్ర వీగాడు .కృష్ణుడు నీటి నుండి బయటకు వచ్చాడు .ఒళ్లంతా రక్తం కారుతోంది .పార్ధుని తో సహా అందరు భయ పడ్డారు .అప్పుడు పరమాత్మ ”అర్జునా ! ఈ జయం నీది కాదు .ఆన్జనేయుడిది .నేను వారధి కింద వీపు పెట్టి మోయక పోతే  అది హనుమ ఒక్క లంఘనానికే విరిగి ముక్కలయ్యేది .నీ పరువు కాపాడ టానికి నేత్తురువోడే  టట్లు తట్లు శ్రమించాను .బాధ భరించాను .హనుమ కు నేను రాముడిగా ,కృష్ణుడిగా ఉంటున్నానని తెలియదు పాపం .”అన్నాడు అర్జునుడు సిగ్గుపడి తన తప్పుకు పశ్చాత్తాప పడి హనుమ ను ఆశ్రయించాడు .హనుమ శ్రీ కృష్ణుని శ్రీ రాముని గా గ్రహించి ,ఆయన వీపుకు అంటిన రక్తాన్ని అంతటిని తన శరీరానికి పట్టించు కొన్నాడు .క్షమాపణ కోరాడు .అప్పటి నుండి ఆంజనేయునికి సింధూర పూజ వ్యాప్తి లో ఉందని తెలుస్తోంది .అర్జునుని రధం మీద జెండా పై హనుమ ఉండి మహా భారతయుద్ధం లో   ఆతని విజయానికి కారకుడ వుతానని అనుగ్రహించాడు  .దాన్నే ”కపి ధ్వజం ”అంటారు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –6-8-12-కాంప్–అమెరికా

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –46 కుమ్భినీ పాలుని కధ

 శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –46
                                                               కుమ్భినీ పాలుని కధ 
శ్రీ రామ చంద్రుని పరి పాలనా కాలం లో దక్షిణ భాగం లో ధర్మా రాన్యం అంటే ఈ నాటి కర్నాటక లో రాక్షసుల చేత ధ్వంసం చెయ్య బడ్డ గ్రామా లను రాముడు పునర్నిర్మించి వాస యోగ్యం చేయించాడు .ఆ గ్రామాలకు ”మండల నగరం ”అనే దాన్ని ప్రధాన కేంద్రం గా చేశాడు .అక్కడ వేద వేద్యులు సత్కర్మా చారణులు పండితులు జ్ఞాన నిష్టులు అనేక మంది ఉండే వారు దానికి ధర్మ కర్త గా ఆంజనేయుడిని నియమించాడు .శ్రీ రాముని తరఫున హనుమ వారిని చక్క గా కాపాడుతున్నాడు .ప్రజలకందరికి మంచి రక్షణ కల్పించాడు .కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు .గొప్ప ధర్మ వ్యవస్తనేర్పరచి ,దాని దిన దినాభి వృద్ధి కి కృషి చేశాడు .కలి కాలం ప్రవేశించ గానే ,దాని పరి పాలనాన్ని అక్కడి వారి కే వదిలి గంధ మాదన పర్వతం చేరి శ్రీ రాముని పై ధ్యానం చేస్తూ గడుపు తున్నాడు .
కలియుగం లో ”కన్యా కుబ్జం ”అనే పట్టణాన్ని రాజధాని గా చేసుకొని ,”ఆ  మందుడు ”అనే రాజు పాలిస్తున్నాడు .అతనికి ”మాయ”అనే భార్య ఉంది .వారికి ”రత్న గంగ ”అనే కూతురు జన్మించింది .ఆమెను అల్లారు ముద్దు గా పెంచుతూ ,సర్వ విద్యా విశారద ను చేశారు .ఆమె కు పెండ్లీడు వచ్చింది .వరాన్వేషణ చేస్తున్నారు .వీరి పురోహితుడు ”ధర్మ సఖుడు ”.ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ రాజుకు చాలా సంతోషం కల్గిస్తున్నాడు .ఒక రాజు ఆయనతో ”మహాత్మా !కలి ప్రవేశించింది .కల్మషం అంతటా వ్యాపించి పోయింది .”అన్నాడు .రాజు కలి కల్మషమంటే ఏమిటి ?అని అడిగాడు .ఆయన దానికి అర్ధం అసత్య ప్రచారం అని చెప్పి ”కలి కాలం లో అబద్ధం చెప్పే వారు ,వేదాన్ని దూషించే వారు ,హింసను పెంచే వారు ,ధర్మాన్ని వాడి లేసి అర్ధ ,కామాలను మాత్రమె ఆశ్ర యించే వారు ఎక్కువై పోతారు .విశ్వాస హీనులు ,కామ పరాయణులు ,దైవ చింతన లేని వారు ,డామ్బికులు ,వేష దారులు ,పాశందులు ,ప్రజా వంచకులు ,అసూయా పరులు ,మూర్ఖులు పెరిగి పోతారు .వీటి వల్ల ఆ అధర్మాలన్ని రాజుకు సంక్ర మిస్తాయి .మీరు ధర్మ పరులు కనుక భారాన్ని దేవుడి మీద వేయండి .మన చిరంజీవి కి మంచి వరుని తో త్వర లోనే వివాహం అవుతుంది ”అని చెప్పాడు .
కొంత కాలానికి బ్రహ్మా వర్తాన్ని పాలించే కుమ్భినీ పాలుడు అనే రాజుకు రత్న గంగ నిచ్చి వివాహం చేశాడు .కుమ్భినీ పాలుడు ,భార్య తో కలిసి ధర్మారణ్యానికి వెళ్లి అక్కడ తన రాజ్యాన్ని స్తాపించాడు .కుమ్భినీ పాలకుడు క్రమంగా వేద మార్గానికి దూరమై జైన మతాన్ని అవలంబించాడు .అప్పటి దాకా బ్రాహ్మణులు వేద విద్యా వ్యాప్తికి సత్కర్మా చరణకు యజ్న యాగాలకు ఇవ్వ బడిన అగ్రహారాలనాన్ని టినీ లాగేసు కొన్నాడు .జైనులను అక్కడ అ దికారులను గా నియ మించాడు .వాళ్ళు యజ్న యాగాలు చేసే వారిని హింసించి శిక్షించే వారు .జైనుల వేధింపు విపరీతమై వారికేమీ దిక్కు తోచలేదు .దుష్టులకు రాజ బలం తోడైంది .ఇక భరించ లేక అందరు కలిసి కన్యా కుబ్జ రాజు అయిన ”ఆమందుడు  రాజు ”కు తమ గోడు విన్న వించు కొన్నారు .తాము అతి ప్రాఛీ న కాలం నుండి అక్కడ ఉంటున్నామని ,త్రేతాయుగం లో శ్రీ రాముడు ”మహోదరం ”తో పాటు మరి కొన్ని అగ్రహారాలను తమకు ఇచ్చాడని ,తమ అల్లుడు కుమ్భినీ పాలుడు దుర్మార్గం గా వాటిని లాగేసుకొని ,హింసిస్తున్నాడని దేవతా రాదన యజ్న యాగాదులను నిషేధించాడని పూర్వ జీవితం కోన సాగించటం దుర్భరం గా ఉందని ,మళ్ళీ తమ దైవ కార్య నిర్వహణకు ,తమ వృత్తులను కోన సాగించు కోవటానికి వెంటనే చర్య తీసుకో మని విన్న వించారు .
రాజు వారంతా చెప్పింది సావధానం గా ఆలకించాడు .అల్లుడు కుంభీ పాలుడికి కబురు చేసి లాక్కున్న భూముల నన్నిటిని బ్రాహ్మణులకు ఇచ్చి వేయమని వేద విద్య కు ఆటంకం కలిగించవద్దని హితవు చెప్పి రాజ పత్రం ఇచ్చి వారిని పంపాడు . వారందరూ కుమ్భినీ పాలుడికి రాజ పత్రం ఇచ్చారు . .ఇది అల్లుడికి కోపం తెప్పించింది .మొండిగా ”మీకు యే రాముడు భూముల్ని ఇచ్చాడో ఆ రామున్నే రమ్మనండి ఆయన తో బాటు ”తోకాయన్ను ”కూడా తీసుకొని రండి ..అప్పుడు ఆయన చెప్పింది విని తగిన ట్లు చేస్తా ”అని భీష్మించాడు .పాపం కొంత మంది బ్రాహ్మణులు రాజుకు ఎదురు తిరగ లేక జైన మతాన్ని తీసుకొని ,రాజుకు లోబడి జీవిస్తున్నారు .మిగిలిన వారు తమను రక్షించ గలిగేది వాయు సుతుడైన హనుమ ఒక్కడే నని గ్రహించి ,శరణు కోరుతూ ధ్యానించ సాగారు .భక్త సులభుడైన మారుతి వెంటనే ప్రత్యక్ష మైవారికి ఆనందం కల్గించాడు .వారు ఆయన్ను ప్రస్తుతి చేశారు .తమ బాధ ను వెల్ల బోసుకొన్నారు .వారిని రక్షించాలనే ఉద్దేశ్యం తో మనసు కరిగి ,తన ఎడమ బాహువు నుండి ఒక వెంట్రుకను ,కుడి చేతి నుండి ఇంకో రోమాన్నితీసి  ,ఒక భూర్జర పత్రం లో భద్రం గా ఉంచి దాన్ని బ్రాహ్మణుల కిచ్చి ,రాజు దగ్గరకు వెళ్లి తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి పంపించాడు .ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే -ఒక రోమాన్ని సింహ ద్వారం మీద ఉంచండి .అప్పుడు భయంకర మైన అగ్ని జ్వాలలు ఏర్పడి రాజ సౌధాన్ని ,పట్టణాన్ని కాల్చేస్తాయి మీ గ్రామాలను మీ కిచ్చేసి, రక్షించమని రాజు ప్రార్ధిస్తే కుడి చేతి రోమాన్ని విసరండి . .అప్పుడు అంతా యదా స్తితి లోకి వస్తుంది అని చెప్పి పంపాడు .అక్కడ మూడు రోజులున్దమని ,ఆకలి దప్పుల తో బాధ పడుతున్నారు కనుక తానిచ్చే ఫలాలను ఆర గించమని చెప్పి ,అదృశ్య మైనాడు .
బ్రాహ్మణులు హనుమంతుని పూజ చేసి ,ప్రసాదం తీసుకొని స్వస్థత చెందారు మారుతి వారికోసం విశ్రాంతి గృహం నిర్మించాడు .మూడు రోజులు అందులో ఉండి ,నాలుగవ రోజు న వారి అగ్రహారాలకు శిలాగ్రుం చేర్చింది . మర్నాడు వారంతా రాజు దగ్గరకు వెళ్లి హనుమ చెప్పి నట్లు అడిగారు .దానిని మన్నిన్చాకుండా అవమానించాడు .హనుమ ఎడమ చేతి వెంట్రుకను ద్వారం మీద ఉంచారు .పట్టణం అంతా అంటుకొని భస్మీ భూతమైంది . ఆర్త నాదాలు పట్నం అన్తావ్యాపించాయి .జైనులందరూ పారి పోయారు .బ్రాహ్మణుల ప్రభావాన్ని గమనించి ,రాజు భయ పడి వారి అగ్రహారాలను వారికిచ్చి వేశాడు .వారు కుడి చేతి రోమాన్ని విసరేశారు .దానితో పట్నం మామూలు అయింది .రాజు కూడా బుద్ధి తెచ్చుకొని ,శ్రీ రాముని భక్తుడు గా మారి  వేదాను సారం గా ప్రవర్తించాడు ధర్మ సంస్తాపకుడై ,విష్ణు ధ్యాన రతుడై ప్రజలను కన్న బిడ్డల్లా పాలించాడు .ధర్మారణ్యాన్ని నిజమైన ధర్మా రణ్యం గా పాలిచాడు .త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన హనుమను అందరు భక్తీ శ్రద్ధలతో పూజిస్తూ సుఖాలను పొంది ,చివరకు కై వల్యం చేరారు .
సశేషం –మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –30-7-12-కాంప్ –అమెరికా

ఆంజనేయ స్వామి మహాత్మ్యం — 45 శ్రీ హనుమత్కేశ్వరం

 ఆంజనేయ స్వామి మహాత్మ్యం — 45
                                                     శ్రీ హనుమత్కేశ్వరం

                   రాముడు రాజ్య పాలన చేస్తున్న కాలం లో ఒక సారి అగస్త్యుడు మున్నగు మహర్షులు వచ్చి సందర్శించారు .వారందరికి తగిన విధం లో స్వాగతించి ,ఉచితాసనాలపై కూర్చో బెట్టి ,అగస్త్య మహర్షి తో ”శంకరుడు- హనుమంతుడు వీరిద్దరిలో ఎవరు అధికులు ?వాళ్ళిద్దరి సాహసాలను మనం తెలుసు కోవటం యెట్లా ?”అని శ్రీ రాముడు ప్రశ్నించాడు .అప్పుడు అగస్త్య ముని ”విజయ భాస్కరా రామా !విను .శంకరుడే హను మంతుడు .వాయు వర ప్రసాది .వాయువు లాగా అంతటా సంచ రించే నేర్పున్న వాడు .అందులో సందేహం లేదు .నీకు అనుమానం వస్తే పరీక్షించ వచ్చు ”అన్నాడు .
శ్రీ రాముడు మారుతి ని ఆప్యాయం గా పిలిచి ,”హనుమా ! ఇప్పుడే లంకకు వెళ్లి ,విభీషణుడి దగ్గరున్న ”మౌక్తిక లింగం ”ను తీసుకొని రావాలి .”అని ఆజ్ఞా పించాడు .హనుమ మారు మాట చెప్ప కుండా ,రామాదులకు నమస్కరించి ,తండ్రి వాయుదేవునికి వందనం చేసి ,రివ్వున వీచిన గాలిలాగా పల్లెలు ,పట్టణాలు ,కొండలు ,కోనలు అన్ని దాటుకుంటూ దక్షిణ సముద్రాన్ని అవలీలగా లంఘించి ,లంకలో ప్రవేశించాడు .అక్కడున్న రాక్షస వీరు లందరూ ఇంత హటాత్తు గా హనుమ రావటం చూసి ఆశ్చర్య పోయారు .సరాసరి మహా రాజు విభీషణుని కొలువు చేరాడు .విభీషణుడు మారుతి ని గౌరవించాడు .వచ్చిన కారణం తెలుప మన్నాడు .శ్రీ రాముని ఆజ్న ను వినిపించాడు హనుమ .రాజు ఎంతో సంతోషించి తాను ప్రతిష్టించిన చోటు కు వెళ్లి అక్కడున్న ఆరు శివ లింగాలను చూపించాడు .అందులో మౌక్తిక లింగాన్ని ఆంజనేయుడి చేతికిస్తూ ”హనుమా ! దీనిని నా అన్న రావణుడు కుబేరుడి నుండి తెచ్చాడు .కుబేరుడికి దాన్ని సాక్షాత్తు శివుడే ఇచ్చాడు .ఆ లింగాన్ని కుబేరుడు పూజించి ,నవ నిదు ల తో కూడిన రాజ్యానికి రాజు ఆవ గలిగాడు .రావణుడు దీన్ని పొంది లంకా సామ్రాజ్యాధి పతి అయ్యాడు .దీన్ని నేను శ్రీ రామ చంద్రునికి సభక్తికం గా సమర్పిం చానని చెప్పు ”అని లింగాన్ని ఇచ్చేశాడు .
హనుమ భక్తిగా ఆ మౌక్తిక లింగానికి నమస్కరించి ,గ్రహించాడు .విభీషణుడి దగ్గర వీడ్కోలు తీసుకొని అయోధ్య కు బయల్దేరాడు .ఆకాశం లో ఎగురుతూ ,ఏడవ రోజున అవంతీ నగర ప్రాంతం లో ఉన్న పర్వతం  మీదకు చేరాడు .లింగాన్ని అక్కడ ఉంచి ”,రుద్ర సరస్సు” లో స్నానం చ సి ,అర్ఘ్యాదులు సమర్పించి ,మళ్ళీ ఆ పర్వతం దగ్గరకు చేరాడు .అప్పుడు మౌక్తిక లింగం చిన్న పర్వతం అంత గా పెరిగి ఉండటం చూసి ఆశ్చర్య పోయాడు .దానికి కదిలించటానికి విశ్వ ప్రయత్నం చేసి ,విఫలుడైనాడు .అప్పుడు ఉమా పతి పరమేశ్వరుడు ప్రత్యక్ష మై ”హనుమా !విచార పడకు .నువ్వు దుఖిస్తే ,లోకం అంతా చింతా క్రాంత మవుతుంది .నువ్వు సంతోషం గా ఉంటె ప్రపంచం నవ్వుతుంది .ఈ లింగం ఇక్కడే ఉండాలని భాగ వంతుని భావన గా కన్పిస్తోంది .ఈ పర్వతం చాలా పవిత్ర మైనది .ఇక్కడ రుద్ర సరస్సు ఉండటం మరీ విశేషం .మౌక్తిక లింగం ఇక్కడ ఉండటం వల్ల దివ్యులైన దేవ గణం రుషి గణం దీనిని సేవించే పరమాద్భుత మైన అవకాశం కలుగు తుంది .దీన్ని వారందరూ ”శ్రీ హనుమత్కేశ్వరం ”అనే పేరు తో పిలుస్తారు .ఆ పేరు తో ఇది ప్రశస్తి పొందుతుంది . మానవు లందరూ ఈ హనుమత్కేశ్వర లింగాన్ని భక్తీ శ్రద్ధ లతో పూజించి ధన్య మవుతుంది .ఇక్కడ జరిగిన విషయాల నన్నిటిని శ్రీ రామ చంద్రునికి నా మాట గా చెప్పు .ఆయన దానిని అర్ధం చేసుకోగలదు ”అని దీవించి పంపాడు శివుడు .
అలాగే సూటిగా అయోధ్య చేరి శ్రీ రామునికి అన్నీ సవిరం గా వివ రించాడు .శ్రీ రాముడు ,అగస్త్య మహర్షి  మొదలైన వారంతా హనుమ ను ఆశీర్వ దించారు .ఈ కద లో మనకు తెలిసిన్దేమిటి ?ఎవరి కైనా కర్మ ఫలం అనుభ విన్చాల్సిందే .శ్రీ రాముడు ,నారాయణుడు ,శంకరుడు ,హనుమంతుడు ,ఎవరైనా దుష్ట రాక్షస సంహారం చేసి నందున తపస్సు చేయాల్సి వచ్చింది .అలాంటి మహాను భావులే పాపాలకు భయ పడి నప్పుడు ,సామాన్య మాన వుల సంగతి వేరే చెప్పాలా ?అందుకే అనుభవం ఉన్న వారు అందరు చెప్పే మాట లు వినాలి -మనసు చేత ,వాక్కు చేత ,క్రియల చేత ,ఇతరులకు బాధ కలుగ కుండా నడచు కోవాలి .అప్పుడు అదే తపస్సు అవుతుంది .శ్రీ రామ హనుమదాదుల చర్యలు సర్వ కాలలో ,సర్వ మానవులకు శిరో ధార్యం .ఆదర్శ ప్రాయం .మనందరి నడక శుభదాయకం గా ఉంటె దేశానికి శాంతి శుభాలు కలుగు తాయి .
సశేషం —మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –23-7-12.- కాంప్–అమెరికా .