Category Archives: విశేషాలు

8-5-18మంగళవారం సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో సరస భారతి 123కార్యక్రమంగా డా .శ్రీమతి కొమాండూరి కృష్ణా చే”హనుమద్వైభవం”ప్రసంగం, అనంతరం శ్యామలాంబ భక్తబృందం చే లలితా సహస్ర పారాయణ ,భజన

8-5-18మంగళవారం సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో సరస భారతి 123కార్యక్రమంగా డా .శ్రీమతి కొమాండూరి కృష్ణా చే”హనుమద్వైభవం”ప్రసంగం, అనంతరం శ్యామలాంబ భక్తబృందం చే లలితా సహస్ర పారాయణ ,భజన

https://photos.google.com/share/AF1QipOunJ8HKaJXhVnk0xx6HZDGdMlpcjDEAQcp2yPNNvQ3pJ1eLkxCAClHmpIrg1Bgxw?key=Y3dfWFhTWUxrOUFGV2FibWVfVkp2aTJ3bV9BazBB

 

ప్రకటనలు

శ్రీ హనుమజ్జయంతి సందర్భంగామొదటి రోజు 8-5-18మంగళవారం ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లోఅభిషేకం, మల్లె మొదలైన పుష్పాలతో సహస్రనామ పూజాదికాలు

శ్రీ హనుమజ్జయంతి సందర్భంగామొదటి రోజు 8-5-18మంగళవారం ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లోఅభిషేకం, మల్లె మొదలైన పుష్పాలతో సహస్రనామ పూజాదికాలు

https://photos.google.com/share/AF1QipPtpN_M2c-oIefuUcQcZhU12NAtoxui-tAJNq-SI6pqexEZg7mgpO9u6i_yf1KPyg?key=M01LcUJ1eFo3d245YWE4alBjZTNXeEU5NkNvX2hn

నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో లడ్డూలతో ప్రత్యేక ప్రభాతఃపూజ,

1-1-2017ఆదివారం

గోదాశ్రీ రంగ నాయకులకు కు౦కుమ పూజ , -వీధుల్లో సంక్రాంతి ముగ్గులు ,నగర సంకీర్తన బృందం ,శ్రీ విష్ణ్వాలయం లో అమ్మవార్లు అయ్యవార్లు ,అర్చకస్వామి వేదాంతం మురళీకృష్ణ, బలరామ కృష్ణ ధర్మకర్త గబ్బిట దుర్గాప్రసాద్ , భక్తులు

2017 జనవరి ప్రత్యేక కార్యక్రమాలు శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం –ఉయ్యూరు

2017 జనవరి ప్రత్యేక కార్యక్రమాలు

శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం –ఉయ్యూరు

ధనుర్మాసం లోఉదయం -5-30 గం లకు . నిత్య ప్రాతః పూజ తో పాటు జనవరి నెలలో  ఈ క్రింది ప్రత్యేక కార్యక్రమాలు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం లో నిర్వహింపబడుతున్నాయని తెలియ జేస్తున్నాము .

8-1-2017 –ఆదివారం పుష్య శుద్ధ ఏకాదశి –వైకు౦ఠ(ముక్కోటి )ఏకాదశి సందర్భం గా

ఉదయం -4-30 గం లకు –శ్రీ సువర్చలా౦జనేయ ,శ్రీ గోదా రంగ నాయక స్వామి వారలకు విశేష అర్చన

ఉదయం 5-30గం .లకు ఉస్ట్ర (ఒంటె )వాహనం పై స్వామి వారల ఉత్తర ద్వార దర్శనం

10-1-17 –మంగళవారం-ఉదయం -5 -00 గం లకు –శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్ కు ‘’వెన్న’’(నవనీతం ) తో అభిషేకం

ఉదయం -6 గం లకు –‘’అరిసెలతో’’ స్వామివారలకు ప్రత్యేక పూజ

13-1-17 –శుక్రవారం –భోగి పండుగ సందర్భం గా –ఉదయం 5-30 గం .లకు స్వామివారలకు ప్రత్యేక ‘’శాకంబరీ ‘’(కాయ గూరలతో )పూజ

ఉదయం -10 గం లకు –శ్రీ సువర్చలా౦జనేయ స్వామి ,శ్రీ గోదా రంగనాయక స్వామివారలకు ‘’శాంతి కళ్యాణ మహోత్సవం ‘’

17-1-17 –మంగళవారం సాయంత్రం -6-3- గం లకు –పుష్య బహుళ పంచమి –  సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం , మరియు ‘’అపర త్యాగ రాజు ‘’గాన గ౦ధర్వ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ –సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో అయిదుగురు సంగీత విద్వాంసుల చే’’ స్వర నివాళి ‘’.

Inline image 1 Inline image 2

భక్తులు ,సాహిత్య ,సంగీతాభిమానులు పై కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త

మరియు సరసభారతి అధ్యక్షులు

 


శ్రీ సువర్చలాన్జనేయ శతకం

సాహితీ బంధువులకు నమస్కారం -ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి శతకం రాయిస్తున్నామని పూర్వం తెలియ జేసిన సంగతి గుర్తుండే ఉంటుంది .అనివార్య కారణాలవలన ఆ శతకాన్ని డా తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు రాయటం లేదు దాన్ని ప్రముఖకవి విమర్శకులు విశ్లేషకులు 30ఏళ్లుగా నాకు పరిచయం ఉన్న సాహితీ మూర్తి శ్రీ తుమ్మొజు రామలక్ష్మణాచార్యులు గారు  రాస్తున్నారు .ముందు చెప్పినట్లు ఈ నెల 12 వతేది శ్రీ హనుమద్ వ్రతము రోజున ఆవిష్కరణ జరగటం లేదు కవి మారారుకానుక కొంత సమయం పడుతుంది బహుశా జనవరి లో ఆవిష్కరణ జరుగవచ్చు .ఈ శతకానికి  చాలా ఉత్సాహం గా ముందుకొచ్చి విరాళాలు పంపిన వారందరికీ కృతజ్ఞతలు .ఇంకా ఆసక్తి ఉన్నవారు పంపటానికి అవకాశం ఉంది ఈ శతకం లో దాతల గోత్రనామాలు ప్రచురిస్తామని ముందే తెలియ జేశాను .

 గీర్వాణం -2  ఆవిష్కరణ రోజున స్వామి వార్లపై రెండవ శతకాన్ని కూడా రచింప జేస్తున్నట్లు తెలియజేయటం దానిని మధురకవి బహుగ్రంథకర్త ,శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు రచించటానికి అంగీకరించి రచన చేస్తున్నారని తెలియ జేస్తున్నాము .ఈ శతకాన్ని సరసభారతి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం మాత్రమే ఖర్చు భరించి ముద్రిస్తున్నాము దీనికై ఎవరూ విరాళాలు పంపనక్కరలేదు . ఈ శతకాన్ని ఫిబ్రవరి చివరలో లేక మార్చి మొదటి వారం లో ఆవిష్కరింప జేస్తాము రెండు శతకాల ఆవిష్కరణలు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లోనే నిర్వహిస్తామని తెలియ జేస్తున్నాను -వీటితో సరసభారతి ప్రచురణా స0ఖ్య  24 అవుతుంది -దుర్గాప్రసాద్

ధనుర్మాస ప్రత్యెక పూజా కార్యక్రమాలు

ధనుర్మాస ప్రత్యెక పూజా కార్యక్రమాలు

శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి వారల దేవాలయం –ఉయ్యూరు

ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజనేయ స్వామి వారి దేవాలయం లో ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమాలు  శ్రీ దుర్మిఖి నామ సంవత్సర మార్గశిర బహుళ చవితి 17-12-16 శనివారం (తెల్లవారితే శనివారం )తెల్లవారు ఝామున 5-30 గం .నుండి పుష్య బహుళ విదియ శనివారం 14-1-20 17 వరకు జరుగుతాయి .ప్రతి రోజు ఉదయం 5-15గం.కు స్వామి వారి సుప్రభాతం ,తిరుప్పావై ,5-30 గం నుండి శ్రీ సువర్చలా౦జ నేయ స్వామివారలకు ,శ్రీ గోదా రంగ నాధ స్వాములకు ప్రత్యేక అర్చన నిర్వహింపబడును .ఉదయం 6-30 గం లకు నివేదన హారతి ,మంత్రం పుష్పం ,తీర్ధ ప్రసాద విని యోగం జరుగుతాయి .ఉదయం 6-.45 గం నుండి శ్రీ సుందర కాండ పారాయణ జరుగును .భక్తులు విశేషంగా పాల్గొని స్వామి సేవలో ధన్యులు కావలసినది గా ప్రార్ధన .

1-1-20 17 శనివారం –నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా –ఉదయం 5-30 గం .లకు స్వామి వారలకు ‘’లడ్డూ ‘’లతో ప్రత్యేక  పూజ జరుగుతుంది .పూజానంతరం భక్తులకు లడ్డూ ప్రసాదం అందజేయ బడను.

8-1-17 –ఆదివారం –వైకుంఠ (ముక్కోటి )ఏకాదశి సందర్భం గా ఉదయం 4-30 గం లకే స్వామి వారలకు ప్రత్యేక పూజ నిర్వహింపబడుతుంది .

ఉదయం -5-30 గం లకు స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనం .

10-1-17 –మంగళవారం –ఉదయం 5-30 గం .లకు స్వామి వారలకు ‘’అరిసెల ‘’తో ప్రత్యేక అర్చన జరుగుతుంది .అనంతరం భక్తులకు అరిసె ప్రసాదం అందజేయ బడును .

13-1-17 శుక్రవారం –భోగి పండుగ –ఉదయం 5-30 గం .లకు స్వామి వారలకు ‘’శాకంబరీ పూజ ‘’(వివిధ కాయ గూరలతో ప్రత్యేక అర్చన )జరుగును .

ఉదయం -10 గం లకు –శ్రీ సువర్చ లాంజనేయ ,శ్రీ గోదా రంగ నాధ స్వాములకు శాంతి కల్యాణం నిర్వహింపబడును.

14-1-17-శనివారం –సంక్రాంతి పండుగ –ఉదయం 6- గం లకు స్వామి వారలకు అర్చన .-అనంతరం సంక్రాంతి పురుషుని స్వరూప స్వభావ ఫలితాల వివరణ –శాకంబరీ ప్రసాద వినియోగం

గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మ కర్త

మరియు భక్త బృందం .