Category Archives: పూజలు

శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం –ఉయ్యూరు ధనుర్మాసం సందర్భంగా 10-1-17 –మంగళవారం-ఉదయం -5 -00 గం లకు –శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్ కు ‘’వెన్న’’సువర్చలాంజనేయ స్వామికి నవనీతం అలంకరణ – అరెసెలతో ప్రతేక పూజ’’

శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం –ఉయ్యూరు ధనుర్మాసం సందర్భంగా 10-1-17 –మంగళవారం-ఉదయం -5 -00 గం లకు –శ్రీ ఆంజనేయ స్వామి మూల విరాట్ కు ‘’వెన్న’’సువర్చలాంజనేయ స్వామికి నవనీతం అలంకరణ – అరెసెలతో ప్రతేక పూజ’’ స్వామివారలకు ప్రత్యేక పూజనిర్వహించారు.

ప్రకటనలు

శ్రీ సువర్చలా0జ నేయ శతకం

Inline image 1

భక్త జనావళికి ,,సాహితీ బంధువులకు దీపావళి శుభాకాంక్షలు

 ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసియున్న ”శ్రీ సువర్చలాంజ నేయ స్వామి ”వార్లపై పద్య శతకాన్ని రాయించాలని ఎన్నో ఏళ్ళనుండి ప్రయత్నించాము .కుదర లేదు . ఇప్పడు అవకాశం లభించింది .పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ ,బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త మహా కవి ,ఎన్నో శతకాలను అలవోకగా మహా భక్తి తో ధారాశుద్ధితో రచించిన వారు ,సరసభారతికి ఆప్తులు  డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి  గారిని సుమారు 15  రోజుల క్రితం  ఫోన్ లో సంప్రదించి స్వామిపై శతకం వ్రాయమని కోరగానే తప్పక రాస్తామని వెంటనే బదులిచ్చారు .చాలా సంతోషం వేసింది వారికి ఆలయం తరఫున సరసభారతి తరఫున  కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం .ఈ విషయాన్నిదసరాలలో ఆలయం లో జరిగిన ప్రత్యేక పూజలలో విజయ దశమినాడు శమీ పూజ తరువాత ప్రకటించాం  భక్తులు ఎంతో ఆనంద పడ్డారు .ఇప్పటిదాకా మనం సరస భారతి ప్రచురించిన పుస్తకాలను ఎవరికీ అమ్మలేదు అందరికీ ఉచితంగానే  అందజేసిన సంగతి మీకందరికీ తెలిసిన విషయమే  దీనికి దాతల దాతృత్వమే కారణం .
 ఇప్పుడు ఈ శతక ముద్రణలో భక్తులు ,సాహిత్యాభిమానులు అందరికి అవకాశం కల్పించాలని అనుకొన్నాం .కనుక 100 రూపాయలు ,ఆపై న విరాళం ఇచ్చే భక్తులందరి పేర్లను గోత్రనామాలతో ఈ శతకం లో ముద్రిస్తాము  కనీసం 200 నుంచి 300 మంది భక్తులను ఈ ఈ భక్తి యజ్ఞం లో పాలు పంచుకొనేట్లు చేయాలని సంకల్పం . ముద్రణకు సహకరించాలనుకొనే వారు- విరాళాలను ఆలయ అర్చక స్వాములకు కానీ, నాకు కానీ, చి గబ్బిట రామనాధ బాబుకు కానీ, చి గబ్బిట వెంకట రమణ కు కానీ నవంబర్ 15లోపు అందజేసి  పేర్లు నమోదు చేయించుకోవలసినదిగా ప్రార్ధన .
 శతకం డిసెంబర్ 12 సోమవారం శ్రీ హనుమద్ వ్రతం  నాడు- వ్రతం అనంతరం శ్రీ దక్షిణామూర్తి గారి ప్రవచనం తరువాత స్వామి సమక్షం లో ఆవిసిష్కరింప బడుతుంది . శతక రచయితకు కృతజ్ఞతగా యధా శక్తి సన్మానం జరుగుతుంది ఇది సరసభారతి ప్రచురించే 23 వ పుస్తకం .
 ఈ సదవ కాశాన్ని అందరు గడువు సమయం లోపు  సద్వినియోగం చేసుకొని శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి వార్ల కృపకు పాత్రులు కావలసినది గా మనవి
                                                       గబ్బిట దుర్గా ప్రసాద్
                                        శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయ ధర్మ కర్త
                                               సరసభారతి అధ్యక్షులు .  

సెల్ నంబర్లు 1-99890 66 375
               2- 949252 5471
               3-9241714768
               4-9059445331

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో నవ రాత్రి ఉత్సవాలు

Inline image 1

ఉయ్యూరు  రావి చెట్టు బజారులో వేంచేసి ఉన్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారల దేవాలయం లో 1-10-16శనివారం నుండి 11-10-16 మంగళ వారం వరకు దేవీ నవ రాత్రుల సందర్భం గా ప్రతి రోజూ సాయంత్రం 6- 30 గం లకు స్వామి వారలకు, శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హింప బడుతాయి .ప్రతి రోజూఅమ్మవారికి ప్రత్యేక అలంకారం ఏర్పాటు చేయబడుతుంది.

  8–10-16 శనివారం మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీ పూజా ,9-10-16 ఆదివారం శ్రీదుర్గాష్టమి నాడు శ్రీ దుర్గా పూజా ,10-10-16 సోమవారం మహర్నవమి నాడు మహిషాసుర మర్దిని పూజ ,11-10-16 మంగళవారం విజయ దశమినాడు శ్రీ రాజ రాజేశ్వరి పూజ ,తరువాత శమీ పూజ నిర్వహింప బడుతాయి .భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారల అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా ప్రార్ధన

                                                      గబ్బిట దుర్గా ప్రసాద్
                                                     ఆలయ ధర్మ కర్త
                                                         మరియు భక్త బృందం

19-7 16 మంగళవారం గురు పూర్ణమి నాడు ఉదయం 10 గం లకుఉయ్యూరులో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల దేవాలయం లో ప్రత్యేక శాకంబరీ పూజ చిత్ర విశేషాలు

19-7 16 మంగళవారం గురు పూర్ణమి నాడు ఉదయం 10 గం లకుఉయ్యూరులో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల దేవాలయం లో ప్రత్యేక శాకంబరీ పూజ చిత్ర విశేషాలు

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి ఉత్సవానికి ఆహ్వానం

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి ఉత్సవానికి ఆహ్వానంimage (5)

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో శ్రీ శంకర జయంతి

Inline image 1
11-5-16 బుధవారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం లో సాయంత్రం 6-30గం లకు శ్రీ శంకరాచార్యుల వారికి అష్టోత్తర పూజ, రా త్రి 7గం లకుప్రముఖ గాయని శ్రీమతి వి .శాంతి శ్రీ  గారిచే ”శ్రీ శంకరాచార్య స్తోత్ర గానం ”,నిర్వహింప  బడుతుంది.  ఆస్తిక జనులందరూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన . దుర్గా ప్రసాద్ 

Inline image 2