Category Archives: దేవాలయం

శ్రీ హనుమద్వ్రతం

ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి ఉన్న శ్రీ సువర్చ లాంజనేయ స్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ త్రయోదశి  శ్రీ హనుమద్వ్రతం సందర్భంగా 29-11-17 నుండి 1-12-17 వరకు త్రయా హ్నికం గా కార్యక్రమము నిర్వహింప బడుతోంది .భక్తులు విశేషంగాపూజా కార్యక్రమం లో పాల్గొని స్వామి వారల కృపకు పాత్రులు కావలసినదిగా మనవి

                  కార్య క్రమ వివరాలు
29-11-17 బుధవారం -ఉదయం 5 గం .లకుస్వామి వార్లకు స్నపన ,మన్యుసూక్తమ్ తో అభిషేకం ,నూతన వస్త్ర ధారణ
              ఉదయం -8 గం లకు గంధ సిందూరం ,చేమంతి పూలతో ప్రత్యేక పూజ
30-11-17 -గురువారం -ఉదయం 9 గం లకు -అరటి పండ్లు ,వివిధ ఫలాలతో విశేష అర్చన
1-12-17 శుక్రవారం -శ్రీ హనుమద్వ్రతము
              ఉదయం 9- గం -కు తమలపాకులతో ప్రత్యేక అర్చన అనంతరం
            పంపా కలశ ఆవాహన ,పంపా నదీ పూజ , 13 ముడుల తోరాలకు పూజ  ,  తోరధారణ

    శ్రీ హనుమద్వ్రతము -కథా విశేషాలు -నైవేద్యం, హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం

పూజా కార్యక్రమం లో పాల్గొన దలచిన భక్తులు అర్చక స్వామిని సంప్రదించ గలరు
                           గబ్బిట దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మ కర్త
                             మరియు భక్త బృందం

Inline image 1
ప్రకటనలు

 దర్శనీయ శివాలయాలు-111 –బాఘ్ నాధ దేవాలయం –బాగేశ్వర్

 దర్శనీయ శివాలయాలు-

111 –బాఘ్ నాధ దేవాలయం –బాగేశ్వర్

వ్యాఘ్ర నాద బాఘ్ నాధ అయి ఉంటుంది .వ్యాఘ్రం అంటే పులిరాజు .శివుడు పులి చర్మం ధరిస్తాడు కనుక వ్యాఘ్రేశ్వరుడు .ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధ హిల్ స్టేషన్  ఆల్మోరాకు 90 కిలోమీటర్ల దూరం లో బాగేశ్వార్ దేవాలయం ఉంది.శ్రావణ మాసం లో భక్తులు వచ్చి సందర్శింఛి కాపాడమని వేడుకొనే  క్షేత్రం ఇది .గోమతి ,సరయు నదుల సంగమ స్థాన ప్రదేశం లో  ఈ ఆలయం ఉంటుంది . ఇక్కడే దుర్గా ,దత్తాత్రేయ ,హనుమాన్ ,కాళికా ,గంగామాత ,పంచ౦ ఝు౦కార , తుంగ భైరవ ,విశ్వేశ్వరాలయాలున్నాయి .

112-బాలేశ్వర దేవాలయం –చంపావత్

ఉత్తరాఖండ్ రాష్ట్ర మధ్యభాగం లో పితోరవాత్ జిల్లా  కు 74 కిలో మీటర్లలో చంపావత్ నగరం లో బాలేశ్వర దేవాలయం ఉన్నది .ఈ దేవాలయం అతి ప్రాచీనకాలానికి అంటే క్రీశ 10 -12 శతాబ్దికాల౦ లో నిర్మించబడినట్లు తెలుస్తోంది .స్తంభాలు గోడలు తో కట్టబడింది .ఈ ఆలయ ప్రాంగణం లో రత్నేశ్వర ,చంపావతి దుర్గ ఆలయాలున్నాయి శివ రాత్రినాడు బాలేశ్వర దేవాలయం లో విశేష పూజా కార్యక్రమాలు భారీగా జరుగుతాయి .వేలాది భక్తులు సందర్శించి తరిస్తారు .

113-బిన్సార్ మహాదేవాలయం –చమోలి .

సముద్ర మట్టానికి 2,480  మీటర్ల ఎత్తున  చిక్కని దేవదారు వృక్షారణ్య  భాగం లో ఉత్తరాఖండ్ లోని చమోలీ లో బిన్సార్ మహా దేవాలయం సుందర ప్రకృతిలో ఉంది.ఆలయానికి 19 కిలో మీటర్లలో ఆహా అనిపించే రాణిఖేత్  రైల్వే స్టేషన్ ఉంది.స్థానిక కధనం ప్రకారం ఈ ఆలయం ఒకే ఒక్క రోజులో నిర్మింపబడింది .వైకుంఠ చతుర్దశి నాడు మహిళా భక్తులు ఈ ఆలయం సందర్శించి తమ సంతానానికి మంచిఆరోగ్యం కోసం  తమ కుటుంబానికి  సౌభాగ్యం కోసం పూజలు చేయటం ఇక్కడ విశేషం . పారిశుధ్యానికి కేంద్రంగా ఉంటుంది ఆలయం ,,ప్రాంగణం కూడా .

114-శివ గణనాధ ఆలయం –ఆల్మోరా

సముద్ర మట్టానికి 2,11 6 మీటర్ల ఎత్తులో ఆల్మోరాలో శివగణనాద దేవాలయం ఆల్మోరాకు 47కిలోమీటర్ల దూరం లో ఉంది .కార్తీక పౌర్ణమినాడు బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది .భక్తులు తప్పెట్లు తాళాలతో బాజా భజంత్రీలతో ఆలయం సందర్శిస్తారు

115-జాగేశ్వర దేవాలయం –ఆల్మోరా

2,500ఏళ్ళ అతి ప్రాచీన దేవాలయామే ఆల్మోరాలోని జాగేశ్వర దేవాలయం .వివిధ వంశాలకు చెందిన రాజుల  కాలాలో అభి వృద్ధి చెందిన దేవాలయం .ఆలయ శిల్ప నిర్మాణ ప్రతిభ ఆశ్చర్యం కలిగిస్తుంది .దీనిని అధ్యయనం చేయటానికే చాలా మంది వస్తారు .ఇది ఆలయ కాంప్లెక్స్ గా ఉంటుంది .జోగేశ్వర మహా శివ దేవాలయం తో పాటు,మృత్యుంజయేశ్వర,సూర్య ,చండికా ,కుబేర ,నవ దుర్గ ,నవగ్రహ దేవాలయాలూ ఉన్నాయి

116-మహా మృత్యుంజయ దేవాలయం –జాగేశ్వర్

అతిప్రాచీన మహా శివుని అతి ప్రసిద్ధ దేవాలయం మహా మృత్యుంజయ దేవాలయం .జాగేశ్వర దేవాలయానికి దగ్గరలోనే ఉంటుంది .ఇక్కడి శివలింగం అతి విచిత్రంగా ఉండటం ప్రత్యేకత .శివలింగం లో తెరచి ఉన్న శివ నేత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది .భక్తులు మృత్యుంజయ మంత్రాన్ని భక్తితో పఠిస్తూ  దర్శించి తమకు మృత్యువువలన ,ప్రమాదాలవలన ఇబ్బంది రాకుండా చేయమని ప్రార్ధిస్తారు .

117-ముక్తేశ్వర దేవాలయం –నైనిటాల్

సరస్సుల నగరం అని పిలువబడే నైనిటాల్ కు 51కిలో మీటర్ల దూరం లో ముక్తేశ్వర దేవాలయం ఉన్నది .ఈ ఆలయం ఉత్తరాఖండ్ లో కుమాన్ పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 2,286 మీటర్ల ఎత్తున ఉంది.ఆలయం చుట్టూ బ్రహ్మ విష్ణు ,నంది,గణేశ,పార్వతి విగ్రహాలున్నాయి .ఆలయానికి అతి సమీపం లోనే చౌలీకి జాలీ అనే రాక్ క్లైమ్బింగ్ సైట్ ఉంటుంది .

118 –పాతాళ భువనేశ్వరాలయం –పితోరగడ్

సున్నపురాయి గుహలయమే పాతాళ భువనేశ్వరాలయం .దీన్ని గురించి అనేక విచిత్ర కధలు గాధలు ప్రచారం లో ఉన్నాయి .పితోరగడ్ జిల్లా గంగోలి హాట్ కు 13 కిలోమీటర్లలో 13 50 మీటర్ల ఎత్తులో ఉన్న ఆలయ మిది .ఇక్కడే 33 కోట్ల మంది దేవతలు ఉంటారని విశ్వాసం .ఈ గుహాలయం 160 మీటర్ల పొడవు ,90 మీటర్ల లోతు ఉంటుంది .ఈ గుహాలయం లో లెక్కపెట్టటానికి వీలు లేనన్ని స్టాలిగ్ మైట్ శిలాకృతులు దర్శనమిస్తాయి .ఇక్కడే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి .అందులో కొన్ని –కాలభైరవుని నాలుక ,ఇంద్రుని ఐరావతం ,శివ జటాజూటం వంటివి అన్నమాట .తప్పక చూసి ఆశ్చర్యపోవాల్సిన ఆలయం .

119-సోమేశ్వర దేవాలయం –కౌసాని

ఉత్తరాఖండ్ లో కౌశాని హిల్ స్టేషన్ కు 11 కిలో మీటర్ల దూరం లో అందమైన ప్రక్ర్తి పరిసరాలున్న చిన్న పల్లె కౌశాని లో కౌశాని-ఆల్మోరా రోడ్డుపై సోమేశ్వరాలయం ఉన్నది.ఇక్కడి ప్రజులు దీనిని జ్యోతిర్లి౦గాల లో  ఒకటిగా విశ్వసిస్తారు .7 వశతాబ్ది ఆలయం .

120-త్రిజుగి నారాయణ దేవాలయం –రుద్రప్రయాగ

ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లా త్రిజుగి నారాయణ గ్రామం లో ఉన్న విష్ణు ఆలయమే త్రిజుగి నారాయణ దేవాలయం .ఇక్కడ విష్ణువుతోపాటు శివునీ పూజించటం విశేషం .ఇక్కడే ఉమామహేశ్వర కల్యాణం జరిగిందని అంటారు .ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది అదే ‘’అఖండ ధుని ‘’.అందుకే అఖండ ధుని దేవాలయం అని పిలుస్తారు .ఇక్కడి శివ పార్వతి కల్యాణం నాటి అగ్ని హోత్రం మూడు యుగాలుగా వెలుగుతూనే ఉండటం విశేషం .త్రిజుగి అంటే మూడు యుగాలు .ఆలయానికి దగ్గరలో ఉన్న జలపాతం చుట్టు  ప్రక్కల మూడు సరస్సులను నింపి పంటలకు సహకరిస్తోంది .

   సశేషం

   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-17 –ఉయ్యూరు

వ్యాఘ్రఈశ్వర దేవాలయం

 బాలేశ్వర దేవాలయం

బిన్సర్ మహాదేవాలయం


జాగేశ్వరదేవాలయం

మహామృత్యుజయ దేవాలయం 

ముక్తేశ్వరాలయం 

 పాతాళ భువనేశ్వరాలయం 

33 కోట్ల దేవతలు 

సోమేశ్వరాలయం 

త్రిజగి నారాయణ దేవాలయం 

  అఖండ ధుని 

 దర్శనీయ శివాలయాలు – 102 –అగస్త్యేశ్వరాలయం –రుద్రప్రయాగ

దర్శనీయ శివాలయాలు –

102 –అగస్త్యేశ్వరాలయం –రుద్రప్రయాగ

ఉత్తరాఖండ్ లో రుద్ర ప్రయాగలో ఉన్న అగస్త్యేశ్వరాలయం లో అగస్త్య మహర్షి తపస్సుచేసి శివ పూజ చేసినట్లు పురాణకథనం .

103 –కోటేశ్వరాలయం –రుద్రప్రయాగ

రుద్రప్రయాగలోనే శ్రీ కోటేశ్వరాలయం ఉన్నది ఇక్కడ శివుడే తపస్సు చేసినట్లు పురాణ ౦ లో ఉంది.ఇక్కడే భస్మాసురుడు తీవ్ర తపస్సు చేసి శివుని మెప్పించి వరం పొంది ,తర్వాత  విష్ణు మాయవలన తన నెత్తినే తాను చేయిపెట్టుకొని భస్మమైన ప్రదేశం ఇది ఇది గుహాలయం .

104 –మధ్యమహేశ్వరాలయం –రుద్రప్రయాగ

రుద్రప్రయాగ కు 46కిలోమీటర్ల దూరం లో ఉన్న ఆలయమే మధ్య మహేశ్వరాలయం .పంచ కేదార్ ట్రెక్కింగ్ ప్రదేశాలలో ఇదొకటి .ప్రకృతి అందాల మధ్య కనువిందు చేసే ఆలయం .దీని నిర్మాణ శిల్ప చాతుర్యం అద్భుతమని పిస్తుంది .

105-ఓంకారేశ్వర దేవాలయం –రుద్రప్రయాగ

ఉఖీ మఠ్ లో  ఉన్న ఈ దేవాలయం తుంగనాధ స్వామి మద్మమహేశ్వరునికి  శీతాకాల విశ్రాంతి మందిరం .శీతాకాలం పూర్తీ అవగానే మహా వైభవంగా ఈ దేవుళ్ళను వారి వారి దేవాలయాలకు చేరుస్తారు .

106-విశ్వనాథాలయం-గుప్త కాశి

కాశీలో విశ్వేశ్వరునికి ఎంతటి ఆరాధనా భావం ఉందో ఇక్కడ గుప్తకాశీలో ఈ విశ్వేశ్వరునికి అంతటి పూజ్య భావం ఉంది.ఇక్కడే పార్వతీ పరమేశ్వరులు మొదటిసారి రహస్యంగా అంటే గుప్తంగా కలుసుకొన్నారు .అందుకే గుప్త కాశి అంటారు .ఇక్కడే శివ పార్వతుల కల్యాణం జరిగింది .అంతేకాదు పాండవులు శివునికోసం వెదకటానికి వస్తే కనిపించకుండా ఉన్నప్రదేశం కనుక గుప్తకాశి అయింది .

107-బుఢా కేదార్ దేవాలయం –గర్వాల్

గర్వాల్ జిల్లా లో బుఢాకేదార్ ఆలయం లో శివలింగం ఉత్తర భారత శివాలయ లింగాలలో చాలాపెద్దది .బృహత్ లింగం అన్నమాట . ధర్మ గంగా ,బాల గంగా నదుల సంగమ స్థానం లో ఎత్తైన ప్రదేశం లో ప్రకృతి రామణీయకత మధ్య ఉన్న దేవాలయం ఇది .పాండవులతో సాన్నిహిత్యం ఉన్న ఆలయం అని ఇక్కడి వారు గర్వం గా చెప్పుకొంటారు .

108 –లఖా మండల దేవాలయం –డెహ్రాడూన్

పాండవులను సజీవ దహనం చేయించటానికి దుస్ట  దుర్యోధనుడు ఇక్కడ లాక్షా గృహం అంటే లక్క ఇల్లు కట్టించాడు అదృష్టవశాత్తు వాళ్ళు తప్పించుకొన్నారు .అందుకనే ఈ ఆలయాన్ని దర్శించినవారు  దురదృష్టం  నుండి కాపాడ బడుతారని గొప్ప విశ్వాసం .

109-రామేశ్వర దేవాలయం –ఋషీకేశ్

ఋషీకేశ్ లో గలగలాపారే గంగమ్మతల్లి ఒడ్డునే రాం ఝాలా వంతెన దగ్గర రంగురంగులతో శోభించే రామేశ్వరాలయం ఉన్నది .

110-కమలేశ్వర మహా దేవాలయం-పౌరీ గర్వాల్

ఉత్తరాఖండ్ పౌరీ గర్వాల్ ప్రాంతంలో మంచు తో కప్పబడే హిమ శృంగాల మధ్య తెరై కోట్ ద్వార్ ప్రాంతం లో కమలేశ్వర మహా దేవాలయం ఉన్నది .వసంత సప్తమినాడుమహా దేవ శివునికి  52 రకాల పదార్ధాలు నైవేద్యం పెట్టటం ఇక్కడి ఆచారం .సాధారణంగా శివాలయాలలో ఎక్కడా ఇన్ని రకాల ప్రసాదాలు పెట్టటం చూడం .ఒక్క ప్రసాదం పెట్టటమే గొప్ప . విష్ణ్వాలయం లో ప్రసాదాలకు కొదవ ఉండదు .శివాలయం లో విభూతి తప్ప ఏమీ ఉండదు .అందుకే ఏమీ లేనిదానిని “’అక్కడేముందిరా శివాలయం ‘’అనే సామెత వచ్చింది .రకరకాల భారీ ప్రసాద వినియోగం ఈ ఆలయ ప్రత్యేకత .  సంతానం లేని దంపతులు కార్తీక చతుర్దశినాడు  రాత్రి అంతా ఈ ఆలయం ప్రాంగణం లో చేతిలో మట్టిప్రమిద దీపం తో నిలబడి భక్తితో జాగరణ చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని ఇక్కడి వారి అచంచల విశ్వాసం . సంతానం కోసం ,ప్రసాద వైవిధ్యం కోసం ఈ ఆలయాన్ని దర్శించి తరించాలి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-17- ఉయ్యూరు

కోటేశ్వర దేవాలయం

 

 

మధ్య మహేశ్వర దేవాలయం

 

 

ఓంకారేశ్వర దేవాలయం

,

 

— 

విశ్వనాథాలయం


     బుఢాకేదారేశ్వరాలయం

           లఖామండల్ దేవాలయం 

    రామేశ్వరాలయం 

                 కమలేశ్వరాలయం 

 

14-11-17 కార్తీక మాసం చివరి మంగళవారం సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయ స్వామిదేవాలయం లో సరసభారతి 115 సమావేశంగా శ్రీమతి కామాక్షిగారిచే ”శివానందలహరి ”ధార్మిక ప్రసంగం ,అనంతరం అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

14-11-17 కార్తీక మాసం చివరి మంగళవారం సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయ స్వామిదేవాలయం లో సరసభారతి 115 సమావేశంగా శ్రీమతి కామాక్షిగారిచే ”శివానందలహరి ”ధార్మిక ప్రసంగం ,అనంతరం అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

 

దర్శనీయ శివాయాలు – 95-తుంగ నాథ దేవాలయం –రుద్రప్రయాగ

దర్శనీయ శివాయాలు –

95-తుంగ నాథ దేవాలయం –రుద్రప్రయాగ

గమనిక –దర్శనీయ శివాలయాలు ధారావాహిక చాలా కాలం తర్వాత మళ్ళీ మొదలు పెట్టటం తో వరుస సంఖ్య తప్పింది .తపకేశ్వర దేవాలయం సంఖ్య 94 గా గుర్తించండి . ఇప్పుడు రాసే తు౦గనాథాలయం 95.

ఉత్తరాఖండ్ రాష్ట్రం లో రుద్రప్రయాగ లో ఉన్న తుంగ నాథ దేవాలయ౦ ప్రపంచ ఆలయాలలో  అన్నిటి కంటే ఎత్తు మీదున్న ఆలయం గా భావిస్తారు .అందువలన దీనిని ‘’శిఖర శిరోమణి ఆలయం ‘’అంటారు .రుద్ర ప్రయాగ జిల్లాలోని అత్యంత ఎత్తునఉన్న  ముఖ్య పంచ కేదారనాథ ఆలయాలలోఒకటి .కురు క్షేత్ర సంగ్రామం లో దాయాదులైన కౌరవులను పూర్తిగా సంహరించి శత్రుశేషం లేకుండా చేసిన పాండవులు ముక్తి కోసం పరి తపించారు .హిమాలయాలకు చేరి శివ మహా దేవుని శరణు వేడుకొని విముక్తి మార్గం తెలియ జేయమని కోరాలని  తీవ్రంగా అన్వేషించారు .శివుడు గుప్తకాశి లో వృషభ రూపం  దాల్చి ఉన్నాడని గ్రహించారు .గుప్తకాశిలోని వృషభ రూప శివ దర్శనం కోసం తీవ్రంగా గాలించారు .వీరి అన్వేషణ ఫలించి శివ మహాదేవుని’’ బాహువులు’’ కనిపించాయి ఇక్కడ .అప్పటి నుంచి ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదిగా భావింప బడుతోంది .ఎందరెందరో మహర్షులు, ముని పుంగవులు ఈ తుంగ నాథ దర్శనం తో తరించారు .

96-రుద్రనాథ దేవాలయం –చమోలి

ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ జిల్లా చమోలి లో శ్రీ రుద్ర నాథ దేవాలయం ఉన్నది .ఇక్కడే పాండవులకు శివుడు  ‘’ఎద్దు(వృషభం ) యొక్క మూపుర’’ రూపం లో దర్శన మిచ్చాడు .  శివుని పల్లకీని లూటీ బుగ్యాల్ ,పన్యార్ ల ద్వారా  గోపేశ్వర్ కు మోసుకొంటూ వచ్చి ,అక్కడ ఉన్న’’ పితృధార ‘’వద్ద పితృ దేవతలకు  తర్పణ ,పిండ ప్రదానాలు చేస్తారు .మళ్ళీ ఇక్కడినుంచి డోలీ ని ధలాబ్ని  మైదాన్ గుండా  రుద్రనాథ్ కు చేరుస్తారు

97 –కల్పేశ్వర మహాదేవాలయం –చమోలి-

ఉత్తరాఖండ్ గర్హి హిమాలయాలలో చమోలీ వద్ద అందమైన ప్రకృతి కనువిందు చేసే ఉర్గాం లోయ లో శ్రీ కల్పేశ్వర మహాదేవ ఆలయం ఉన్నది .ఇక్కడే పాండవులకు శివుని’’ తాళాలు’’ లభించాయి .పాండవుల ప్రార్ధన మన్నించిన కల్పేశ్వర మహా దేవ శివుడు వారి పాపాలను క్షమించి ముక్తి మార్గం ఉపదేశించాడు .

98- నీల కంఠ మహాదేవాలయం –ఋషీకేశ్

ఉత్తరాఖండ్ పౌరి-గర్వాల్ జిల్లా ఋషీకేశ్ దగ్గర నీల కంఠ మహా దేవాలయం ఉంది.ఇక్కడే  దేవ రాక్షసులు అమృతం కోసం   క్షీర సాగర  మధనం చేస్తుంటే  వెలువడిన ‘’హాలాహలం ‘’ను దేవదానవుల ప్రార్ధన మన్నించి లోకోపకారం కోసం శివుడు మ్రింగిన ప్రదేశం . దాన్ని ఉదరం లోకి పోనీకుండా లోపలి లోకాలకు నష్టం కలుగ కుండా కంఠంలోనే ఉంచుకొని , కంఠం నీలం రంగుగా మారగా నీల కంఠుడయ్యాడు. గరళం మింగాడు కనుక గరళ కంఠుడు.కేదార్ నాథ్క్షేత్రం నుంచి నీల కంఠ పర్వత శిఖర దర్శనం  అత్యంత ఆనందదాయకం గా నయన మనోహరం గా ఉంటు౦ది .

99 –జగేశ్వర ధాం-ఆల్మోరా

హిమాలయాలలో ఆల్మోరా కు 35 కిలో మీటర్ల దూరం లో జగేశ్వర ధాం పరమ పవిత్ర శివాలయంగా భావింప బడుతోంది .ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ప్రసిద్ధమైనది అంటారు .  ఈ దేవాలయ సముదాయం లో 125 దేవాలయాలున్నాయి .వందలాది శిలా విగ్రహాలున్నాయి .

100-వైద్య నాథ దేవాలయం –బాగేశ్వర్

ఉత్తరాఖండ్ గోమతి నదీ తీరాన ప్రశాంత వాతావరణం లో శ్రీ వైద్య నాథ దేవాలయం ప్రాముఖ్యం సంతరించుకొన్నది .కౌశానికి 16 కిలోమీటర్ల దూరం లో ఉన్నది .

101-గోపీనాథ దేవాలయం –గోపేశ్వర్

ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా గోపేశ్వరం పట్టణం లో శ్రీ గోపీనాథేశ్వర దేవాలయం 9-11 శతాబ్దాల మధ్యకాలం లో నిర్మింపబడిన దేవాలయం .దీనిని కాట్యూరి వంశ రాజులు నిర్మించారు .రుద్రనాథునికి పవిత్ర క్షేత్రం గా దీనిని భావిస్తారు .ఈ ఆలయ శివలింగాన్ని ‘’ఏకానన్ ‘’అంటే ‘’శివుని ముఖంగా’’ భావించి అర్చిస్తారు .ఈ ఆలయం లో మరో విశేషం ఏమిటి అంటే అన్ని శివాలయాలలోశివునికి క్షీరం, జలంతో  అభిషేకం చేసినట్లు ఇక్కడ  చేయరు . ఆ రెండు ఇక్కడ అభిషేకానికి వాడరు అని అర్ధం .ఒక్క బిల్వ దళాలతోనే అభిషేకం ,పూజ నిర్వహించటం ఇక్కడి ప్రత్యేకత .

మన్మధ సంహారం కోసం శివుడు త్రిశూలం వేస్తే, ఆ త్రిశూలం ఇక్కడ దిగబడి పోయిందట . ఆ త్రిశూలం ఏయే లోహ మిశ్రమాలతో తయారు చేయబడిందో తెలియదుకాని ,అప్పటి నుండి ఇప్పటి వరకు అది చెక్కు చెదరలేదు .ఎంతటి పశుబలం ఉపయోగించినా దాన్ని కదిలించలేరు .కాని పరమ భక్తుడెవరైనా దాన్ని తాకితే  ప్రకంపనలు కలిగిస్తుంది. ఇదొక విశేషం ఇక్కడ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-17- ఉయ్యూరు

 

దర్శనీయ శివాలయాలు -90 ద్రోణుని ఆవాసం -తపకేశ్వర మహాదేవాలయం –డెహ్రాడూన్

దర్శనీయ శివాలయాలు -90

ద్రోణుని ఆవాసం -తపకేశ్వర మహాదేవాలయం –డెహ్రాడూన్

భయంకర అరణ్య ప్రదేశం లో సహజ గుహలో ఏర్పడిన మహాదేవ శివలింగం ఉన్న క్షేత్రమే డెహ్రాడూన్ లోని తపకేశ్వర దేవాలయం .గుహ పై భాగం నుండి సంతత అలదార బిన్డురూపంగా శివలింగం పై అభిషేక జాలం గా పడుతూ ఉండటం ఇక్కడి విశేషం .గుహ ప్రక్కనే ప్రవహించే నది నీటి తు౦పురులు  శివలింగం పై పడుతుంటాయి .అద్భుతమైన ప్రకృతి అందాలమధ్య ఉన్న ఈ గుహాలయం భక్తులకు ,యాత్రికులకు కను విందు చేస్తుంది .ఒకప్పుడు ఈ ప్రదేశం లో కౌరవ పందుల విలు విద్యా గురువు ద్రోణాచార్యులు ఉండేవారట.అందువల్లనే ఈ గుహకు ‘’ద్రోణ గుహ ‘’అనే పేరు వచ్చింది .ద్రోణాచార్యుల భార్య కృపి  ఇక్కడే అశ్వత్ధామ కు జన్మనిచ్చిందట .కుమారుడికి పాలుఇవ్వటానికి ఆమె స్తన్యం లో పాలు ఉన్దేవికావత .  ఆవుపాలు ఇచ్చి పొషించే ఆర్ధిక స్తోమత ఆచార్య ద్రోణులకు లేదట .అందుకనే అశ్వత్ధామ శివుని పాలకోసం  ప్రార్ధించే వాడట .బోళా శంకరుడు కనికరించి  గుహ పైబాహగం నుండి పాలధార కారేట్లు చేశాడట  .అక్కడే తర్వాత శివ లింగం ఏర్పాటు చేశారట .

డెహ్రాడూన్ కు కేవలం 6 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ తపకేశ్వర మహా శివాలయాన్ని యాత్రికులు తప్పకుండా వచ్చి దర్శిస్తారు .రెండు కొండల నడుమ ఉన్న ఈ గుహాలయం గొప్ప  టూరిస్ట్ అట్రాక్షన్. ఉత్తరాఖండ్ లోని ఈ క్షేత్ర సందర్శనానికి ఆ రాష్ట్ర ప్రజలు తండోప తండాలుగా వచ్చి దర్శిస్తారు .వారికి అందుబాటులో ఉన్న ఇష్టదైవం తపకేశ్వర మహా దేవుడు . .ద్రోణ గుహలో ఉన్న శివ లింగం పై సహజ సిద్ధ జల బిందువులు అభిషేక జలం గా నిరంతరం జాలువారటం యాత్రిక భక్తులకు మానసిక ఆధ్యాత్మిక భౌతిక ఆనంద దాయకం గా ఉంటుంది .మనసుపులకించి పరవశం కలుగుతుంది .శివ లింగం పై పడిన నీటి బిందువులు ఇట్టే అదృశ్యమై తర్వాత కొద్ది గజాల దూరం లో ప్రవాహంగా దర్శన మివ్వటం మరో ఆశ్చర్య కరమైన విషయం ..

తపకేశ్వర మహాదేవాలయం సమీపం లో సల్ఫర్ కలసిన చల్లని నీటి గుండాలున్నాయి .వీటిలో ముందు పవిత్ర స్నానం చేసి తర్వాత భక్తులు ఆలయం లో శివ మహాదేవుని దర్శిస్తారు .ప్రతి శివరాత్రికి భక్తులు విశేషంగా వచ్చి తపకేశ్వర స్వామిని దర్శించి తరిస్తారు .పెద్ద ఉత్సవమూ నిర్వహిస్తారు .డెహ్రాడూన్ చుట్టుప్రక్కల ప్రజలకు ఇది గొప్ప పిక్నిక్ స్పాట్ . ట్రెక్కింగ్ కు కూడా అనుకూల ప్రదేశం .ఇక్కడున్న నిలువెత్తు హనుమాన్  భారీ విగ్రహం చూసి తీరాల్సిందే. ఉత్సవ సమయాలలో భక్తులకు ప్రసాదంగా మహా రుచికరమైన భాంగ్ కె పకోడా ,భాంగ్ జ్యూస్ ఇస్తారు .

ఈ ఆలయం గర్హి కంటోన్ మెంట్ రోడ్డు మీద డెహ్రాడూన్ ఎయిర్ పోర్ట్ కు 30 కిలో మీటర్ల లో ,డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ కు 8 కిలోమీటర్ల దూరం లో ఉంది.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-17 –కాంప్- మల్లాపూర్ –హైదరాబాద్

 

 


 దర్శనీయ శివాలయాలు -89 మాణిక్య ప్రభు సంస్థాన్ –హుమ్నాబాద్               

దర్శనీయ శివాలయాలు -89

మాణిక్య ప్రభు సంస్థాన్ –హుమ్నాబాద్

శ్రీ దత్త పరంపర

చతుర్ధ దత్తావతారులు  గురుసార్వభౌమ ,భక్త కల్పద్రుమ శ్రీ మాణిక్య ప్రభు సంస్థానం కర్నాటక లో మాణిక్ నగర్ –హుమ్నాబాద్ లో ఉన్నది .త్రిమూర్తి స్వరూపులైన దత్తాత్రేయులు వివిధ రూపాలలో అవతరించి భక్తులను తరింప జేశారు .వారి అవతారమాలికను తెలియ జేసే శ్లోకం –

‘’వందే దత్తవదూతం విధి ,హరి,శివ రూపాత్మకం దేశికాద్యం –శ్రీపాద శ్రీద వాక్యం శ్రిత విపదపహం ,చిద్ఘనైకం ద్వితీయం

తార్తీయం నృసింహం యతి కులతిలకం ,భక్త కార్యామర ద్రుమం –వందే మాణిక్య ప్రభుం ,తమ్ సకల మత గురుం శుద్ధ తత్త్వం చతుర్ధం .

సన్మార్గ నిర్దేశం చేసేవారిని దేశికులు అంటారు సద్గురువులలో సర్వ శ్రేస్టులు శ్రీ దత్తాత్రేయులు .ఆత్మోద్ధరణ మార్గం చూపించిన వారిలో ఆద్యులు .అందుకే వారు దేశికాద్యులు .శరణు అన్నవారి ఆపదలను దూరం చేసే వారు దత్తాత్రేయుల ద్వితీయ అవతారం శ్రీ శ్రీపాద వల్లభులు .యతులలో శ్రేస్టులైన నృసింహ సరస్వతి తృతీయ అవతారం .భక్తుల మనోభీష్టం తీర్చే కల్ప వృక్షం వంటివారు ,సకల మతాలకు ఆడరణీయులు దత్తాత్రేయుల చతుర్ధ అవతార స్వరూపులు శ్రీ మాణిక్య ప్రభువులకు వందనం అని భావం .

 

మాణిక్య ప్రభు సంస్థానం –సేవలు

స్థానికులు మాణిక్ ప్రభు అని గౌరవంగా సంభావించే మాణిక్య ప్రభువు విద్యాదానం లో, అన్నదానం లో సాటిలేని వారనిపించారు .ప్రతి రోజూ వందలాది భక్తులకు అన్నప్రసాదంఅందజేస్తోంది సంస్థానం .వేద రక్షణ కోసం వేద పాఠ శాల నిర్వహిస్తోంది .100 మంది విద్యార్ధులు ఉచితంగా వేద విద్య ఇక్కడ అభ్యసిస్తున్నారు .ఇది 8 సంవత్సర కాల పరిమిత విద్య .ఇక్కడ వేద విద్యలోసుశిక్షితులైన వారు దేశ విదేశాలలో కీర్తి పొందుతున్నారు .వెనుకబడిన తరగతుల విద్యార్ధులకోసం వసతి గృహం నడుపుతున్నారు .అనాధల కోసం మాణిక్యప్రభు అనాధ శరణాలయం ,అందులకోసం మాణిక్య ప్రభు అంధ విద్యాలయం బ్రెయిలీ ట్యూటర్  వంటి ఆధునిక పరికరాలతో నిర్వహిస్తున్నారు .మాణిక్య ప్రభు సంగీత విద్యాలయం లో వందలాది విద్యార్దులు సంగీతం నేర్చి రాణిస్తున్నారు .వీటి నన్నిటిని మాణిక్య ప్రభు శిక్షణ సమితి సమర్ధ వంతంగా నిర్వహిస్తోంది .

గ్రామ స్థాయిలో కూడా విద్యార్ధులకు ఆధునిక విద్య అందజేసే ఉద్దేశ్యం తో మాణిక్ పబ్లిక్ స్కూల్ అనే రెసి డేన్షియల్ విద్యాలయాన్ని శ్రీ సిద్ధ రాజ్ మాణిక్య ప్రభు మహారాజ్ 1972 లో స్థాపించారు .ఈ విద్యాలయం లో విద్య తో పాటు ,సంగీతం  క్రీడలు ,చిత్ర లేఖనం కు కూడా ప్రాధాన్య మిస్తారు .కనుక విద్యార్ధి  సర్వ తోముఖ మైన  ప్రతిభ సాధనకు ఉజ్వల భవితవ్యానికి  ఎంతగానో ఈ విద్యాలయం తోడ్పడుతుంది .క్రీడాంశాలలో భాగం గా ‘’మాణిక్య ప్రభుసరోవర్’’అనే స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు  .ఇన్ని సత్కార్యాలకు స్పూర్తి దాత శ్రీ మాణిక్య ప్రభు జీవిత విశేషాలను తెలుసుకొందాం .

శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్

నిజాంపాలనలో హైదరాబాద్-కర్నాటక ప్రాంతం లో ప్రస్తుతం కర్నాటక రాష్ట్రం లో బసవ కళ్యాణ్ తాలూకా లాడవంతి గ్రామం లో దైవ భక్తి పరాయణులైన మనోహర నాయిక్ –బయమ్మదంపతులకు 1817 మార్గ శిర శుక్ల చతుర్దశి అంటే దత్తాత్రేయ జయంతి నాడు శ్రీ మాణిక్య ప్రభువు జన్మించారు .వీరి తలిదంద్రులకు శ్రీరామనవమి నాడు దత్తత్రేయులు స్వప్నంలో దర్శనమిచ్చి తాము వారి కుమారులుగా జన్మిస్తామని ముందే తెలియ జేశారు .

మాణిక్ గారి బాల్యం కళ్యాణ్ లో మేనమామ గారింట గడచింది .పరిసర అరణ్యాలలో మిత్రులతో ఆడుకోవటం గోవిందుడు అనే స్నేహితుడు మరణిస్తే బ్రతికించటం ,సంతానం లేని భీమాబాయికి 8 గవ్వలు ఇచ్చి సంతాన ప్రాప్తి కలిగించటం బాల్య క్రీడలుగా మాణిక్ ప్రభు చేసి  ఆశ్చర్య పరచారు .వీటివలన దైవాంశ సంభూతులుఅనే నమ్మకం ప్రజలలో కలిగింది .ఏ పనీ చేయకుండా తిరుగుతున్న మేనల్లుడిని మేనమామ 16 వ ఏట మందలిస్తే ,గోచీ గుడ్డతో ఇల్లు వదిలి తీర్ధ ,క్షేత్ర సందర్శనం చేస్తూ అనేకమంది శిష్యులకు ప్రేరణ కలిగించి ప్రసిద్ధ గురువులుగా పేరుపొందారు .

హుమ్నాబాద్ లో సంస్థాన స్థాపన

ఒక సారి పల్లకి లో మాణిక్ ప్రభును  శిష్యులు మోసుకొని వస్తూండగా హుమ్నాబాద్ దగ్గర రెండు చెట్ల మధ్య పల్లకి ఇరుక్కు పోయి ఆగి పోయింది .ఆ ప్రదేశమే తమ శాశ్వత ఆవాస క్షేత్రం గా దైవం నిర్ణయించాడని భావించి అక్కడే పర్ణశాల తయారు చేయించి ఉండిపోయారు .ఈ ప్రదేశం విరజా –గురుగంగా నదులపవిత్ర  సంగమ క్షేత్రం .అప్పుడు ఘోర అరణ్యం, కారడవి .నిర్జన ప్రదేశం .ప్రభు రాకతో జనసమ్మర్దం పెరిగింది .క్రమంగా ‘’మాణిక్ నగర్ ‘’గా సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం గా  రూపు దాల్చింది.ఇక్కడే స్థిరం గా ఉన్న శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ భక్తుల మనోభీస్టాలు  నెరవేరుస్తూ ,అందరి అభిమానంసాధించారు .1865 మార్గ శిర శుద్ధ ఏకాదశి –ముక్కోటి ఏకాదశి –గీతాజయంతి నాడు 48 వ ఏటనే సంజీవినీ మహా సమాధిలో లీనమయ్యారు .

ఆజన్మ బ్రహ్మ చారి అయిన మాణిక్ ప్రభు మధుకరి అంటే భిక్షాటనం  చేస్తూ దానినే మహా ప్రసాదం గా భుజించేవారు .’’రాజయోగి’’ గా కీర్తి గడించారు .వారిసంస్థాన  వైభవం కనుల పండువుగా ఉండటం చేత ‘’రాజాధిరాజ ‘’అని  కీర్తించబడే వారు .ఎందరెందరో పండితులుకవులు కళా కారులు మాణిక్ ప్రభు దార్బార్ లో తమ విద్యను ప్రదర్శించి విశేష గౌరవ సత్కారాలు పొందేవారు . బీద ప్రజలకు ,అనాధలకు లెక్కలేనంత ధనాన్ని మాణిక్ ప్రభు దానం చేశారు.

షిర్డీ బాబా ,అక్కల్ కోట్ ప్రభు ల దర్శనం

మాణిక్ ప్రభు సమకాలికులే శ్రీ షిర్డీ సాయిబాబా ,స్వామి సమర్ధఅనే అక్కల్ కోట మహారాజ్ మొదలైన ప్రముఖులు .వీరందరితో  మాణిక్ ప్రభుకు గాఢమైన  మైత్రీ బంధం ఉండేది .షిర్డీ సాయి షిర్డీ కి చేరకముందు 13 ఏళ్ళ వయసులోఫకీరు వేషం లో  మాణిక్ ప్రభు దర్శనానికి వచ్చారు .ప్రభు సోదరుడు తాత్యా  మహారాజ్  ద్రవ్యం ఎంత వేసినా కూడా బాబా చేతిలోని ‘’లోటా’’ (డబ్బా ) నిండలేదు .సోదరుడిని మందలించి ప్రభు ఆ డబ్బాలో 5 ఖర్జూర కాయలు వేయగానే అది నిండిపోయింది .అప్పుడు బాబా తనకు ప్రభు ప్రసాదమైన అయిదు ఖర్జూర పండ్లు చాలునని వాటిని తీసుకొని లోటాను బోర్లి౦చగా  దాంట్లో ఉన్నదానికంటే ఎన్నో రెట్ల ద్రవ్యం కుప్పగా పడింది . .       అక్కల్ కోట్ ప్రభు సమర్ధ కూడా మాణిక్ ప్రభు దర్శనానికి వచ్చి  ఆధ్యాత్మిక  చర్చలను రహస్యంగా జరిపేవారు .అక్కల్ మహారాజు తాముకూడా ఇక్కడే ఉంటామని అంటే ‘’ఒక వృక్షం నీడన మరో వృక్షం పెరుగదు ‘’అని చెప్పి అక్కల్ కోట్ లో స్థావరం ఏర్పాటు చేసుకోమని హితవు చెప్పారు .

సర్వ మత సమాదరణం

‘’ఏకం సత్ విప్రా  బహుధా వదంతి ‘’అనే ఉపనిషత్ వాక్యం ఆధారంగా మాణిక్ ప్రభు హిందూ ముస్లిం సిఖ్ మొదలైన మతాలవారినీ సమాదరించి అందరిహృదయాలలోస్తిర స్థానం పొందారు .అన్నిమతాలవారు మాణిక్ ప్రభులో తమ ఇష్ట దైవాన్నిదర్శిన్చిఅనుభూతికి లోనయ్యేవారు .

మహా సంస్థాన వారసులు

మాణిక్ ప్రభుఅనంతరం ఆయన సోదరుని కుమారుడు శ్రీ మనోహర మాణిక్ ప్రభు ,తరువాత శ్రీ మార్తాండ మాణిక్ ప్రభుపీఠాధి పతులయ్యారు .ప్రభు సంప్రదాయాన్ని ఆ సేతు హిమాచల పర్యంతం వ్యాపింప జేశారు .పిమ్మట మార్తాండ మాణిక్ సోదరి కుమారుడు శ్రీ శంకర్ మాణిక్య ప్రభు ,తర్వాత ఆయన పుత్రుడు శ్రీ సిద్ధ రాజ మాణిక్ ప్రభు పీఠాధిపతులయ్యారు .వీరంతా సంస్థానంద్వారా విద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవలు విస్తృతంగా చేశారు .సిద్ధరాజ్ 2009లో సిద్ధిపొందగా షస్టమ పీఠాధిపతిగాశ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు కొనసాగుతున్నారు .సంస్థానం సర్వతోముఖాభి వృద్ధి చెందుతోంది .జ్ఞానభాస్కరులైన వీరి తత్వ జ్ఞానానికి గుల్బర్గా యూని వర్సిటి డాక్టరేట్ బిరుదునిచ్చి సత్కరించింది .

విశేష కార్యక్రమాలు

మాణిక్య ప్రభు ప్రారంభించింన దాన విద్యాది దానాలు నిరంతరం అవిచ్చిన్నంగా కొనసాగుతున్నాయి .మార్తాండ మాణిక్ ,శంకర మాణిక్ ప్రభుల పుణ్య తిధుల రోజుఫాల్గుణ మాసం లో  ‘’వేదాంత సప్తాహం ‘’అనే వేదాంత ,సంగీత ఉత్సవం ప్రతి ఏడాది నిర్వహిస్తారు .మార్గ శిరమాసం లో వచ్చే మాణిక్ ప్రభు-దత్త జయంతిని పెద్ద ఎత్తున చేస్తారు .5 రోజులు విశేష పూజ ఉంటుంది .,చివరి రెండు రోజులైన పౌర్ణమి పాడ్యమి, నాడు వేలాది మందిభక్తులు మాణిక్ ప్రభు సిద్ధి పొందిన సమాధిని దర్శించి పునీతులై ,’’భండారు ఖానా ‘’లో అన్నప్రసాదం స్వీకరిస్తారు .దర్బార్ హాల్ లో కళాకారులుతమ విద్యను సేవా దృక్పధం తో  ప్రదర్శిస్తారు .

మాణిక్ ప్రభుసమాధి

మాణిక్ ప్రభు దివ్య సమాధి రధాకార మందిరం లో పాలరాతితో నిర్మించబడింది . ఆధ్యాత్మిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుంది .

వసతి సౌకర్యాలు

భక్తుల ,యాత్రికుల సౌకర్యం కోసం మార్తాండ విలాస్ ,మాణిక్ విహార్ ,శంకర కృప మొదలైన అతిధి గృహాలను సంస్థాన్ నిర్వహిస్తోంది .ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మహా ప్రసాదం అందజేస్తారు.

మాణిక్ ప్రభు ద్విశత జయంతి

2017  మార్గ శిర శుద్ధ చతుర్దశి –దత్త జయంతికి శ్రీ మాణిక్య ప్రభు జన్మించి 200 సంవత్సరాలు అవుతున్నందున’’ద్విశత జయంతి ‘’ని  భారీగా ఉత్సవాలు ,వేదాంత, సంగీత సభలు నిర్వహిస్తున్నారు .అందరు తప్పక దర్శించి స్పూర్తి పొందాల్సిన క్షేత్రం శ్రీ మాణిక్య ప్రభు క్షేత్రం .”సంతత ధార-శివ లింగం ”ను ఇక్కడ నెలకొల్పే ప్రయత్నాలు వేగవంతంగా జరుగుతున్నాయి .

ప్రభు సంస్థాన్ కు దారేదీ ?

హైదరాబాద్ నుంచి  బొంబాయి జాతీయ రహదారిపై 160 కిలో మీటర్ల దూరం లో ఉన్న హుమ్నాబాద్ కు  ఒక కిలో మీటరు దూరం లో మాణిక్ ప్రభు సంస్థాన్ ఉన్నది .బీదర్ ,గుల్బర్గా, సోలాపూర్ లనుంచి బస్ సౌకర్యం ఉంది.  హైదరాబాద్ –ముంబాయ్ రైల్ మార్గం లో గుల్బర్గా స్టేషన్ లో దిగి, బస్ పై 65 కిలోమీటర్ల దూరం లో ఉన్న సంస్థాన్ కు చేరుకో వచ్చు .

మరో క్షేత్రం లో మళ్ళీ కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-17- కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

 

,

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్