దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 109-కెంగల్(ఎర్రరాయి) స్వయంభు ఆంజనేయ దేవాలయం – వందర గుప్పె

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

109-కెంగల్(ఎర్రరాయి) స్వయంభు ఆంజనేయ దేవాలయం – వందర గుప్పె

కర్నాటక రాష్ట్రం చన్న పట్నం జిల్లా  వందర గుప్పె గ్రామం లోని శ్రీ స్వయంభు ఆంజనేయ దేవాలయాన్ని కెంగల్  హనుమంత  దేవాలయం అంటారు .కెంగల్ అంటే  ఎర్ర రాయి అని అర్ధం .అంటే ఈ హనుమ యెర్ర రాతి హనుమంతుడన్నమాట .సాధారణంగా ఆంజనేయ విగ్రహానికి గంధ సిందూరం పూస్తే ఎర్రగా కనిపిస్తాడు .ఇక్కడ స్వయ సిద్ధంగానే ఎర్రరంగు హనుమకు వచ్చింది .

  వ్యాసమహర్షి ఒకప్పుడు ఇక్కడ సంచారం చేస్తుంటే  ఎర్రటి బండరాళ్ళు కనిపించి వాటి మధ్య యెర్రరాయి ఆంజనేయ స్వామి విగ్రహ౦ మీసాలతో ఉండటం  చూసి ఆశ్చర్యపోయి దాన్ని తెప్పించి ప్రతిస్టించాడు .హోయసల రాజులు ఆలయాన్ని నిర్మించారు .ఈ రాజుల తర్వాత దీని ఆలనా పాలనాచూసే వారు లేక క్రమంగా క్రుంగిపోయింది .కెంగల్ హనుమంతప్ప అనే ఆనాటి కర్ణాటక ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని పునరుద్ధ రించాడు .పరమ  హనుమాన్ భక్తుడైన హనుమంతప్పమరణించాక ఆయన పార్ధివ దేహాన్నిఈ కెంగల్ హనుమాన్ దేవాలయం  ప్రక్కనే  సమాధి చేశారు .

  వ్యాసమహర్షిని  సంతోష పరచటానికి హనుమ ఇక్కడ స్వయంభుగా వెలిశాడు   .ఈ హనుమ మహా శక్తి సంపన్నుడుగా భక్తవరదుడుగా సుప్రసిద్ధుడు.ఒకప్పుడు స్వామి ముఖం ఉత్తర వైపు ఉండేది. ఇప్పుడు తూర్పు వైపు కు ఉండటం ఆశ్చర్యం .ఇలా మారినప్పుడు అదృశ్యమైన కన్ను కనిపిస్తుంది .ముఖం ఉత్తరం వైపు ఉన్నప్పుడు స్వామి కుడి వైపు మీసం,  కుడికన్ను మాత్రమె కనిపిస్తాయి .తూర్పు వైపు తిరిగినప్పుడు పూర్తిమీసం ,రెండుకనులూ కనిపిస్తాయి .మకర సంక్రాంతినాడు సూర్య కిరణాలు స్వామి విగ్రహం పై పడటం మరో వింత .కెంగల్ హనుమంత స్వామి దర్శనం బెంగలు ,భయాలు దూరం చేసి మనసులోని కోరికలను తీరుస్తుంది .

 

  

image.png
ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.