దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2(చివరిభాగం ) 442-శ్రీ పంచముచముఖ ఆంజనేయ దేవాలయం –యమునా నగర్ –

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2(చివరిభాగం )

442-శ్రీ పంచముచముఖ ఆంజనేయ దేవాలయం –యమునా నగర్  –

700సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీపంచముఖ ఆంజనేయ దేవాలయం శ్రీ జానకీ దాస్ మహారాజ్ గారి సంకల్పం వలన నిర్మించబడింది .ఉత్తర ప్రదేశ్ యమునానగర్ లో ఆలయం ఉన్నది .ఈ హనుమాన్ ఆయన కలలో కన్పించి  అక్కడే ఉన్న చెట్టు కింద తన విగ్రహం ప్రతిష్ట చేయమని కోరాడు .జానకీ దాస్  అనేక తీర్దాలనుంచి మట్టి తెప్పించి స్వామిని ఇక్కడ ప్రతిస్టించాడు .క్రమంగా దేవాలయం నిర్మింపబడి నిత్య పూజాదికాలు ప్రారంభ మయ్యాయి .ఈ స్వామిని దర్శించినవారి కోరికలు నెరవేరుతాయి .ఇక్కడే రామ దర్బార్, యాగ శాల ,గోశాల కూడా ఉన్నాయి

443-శ్రీ హనుమాన్ టేక్రి మందిర్ –గుణ

మధ్యప్రదేశ్ గుణ లో శ్రీ హనుమాన్ టేక్రి మందిరం  అతి ఎత్తైన ప్రదేశం లో ఉంది ,.టేక్రి సర్కార్ గుణా అనీ పిలుస్తారు .రమణీయ ప్రదేశం లో ఉన్న ఆలయం. దగ్గరలో శివ ,రామాలయాలున్నాయి .

444-జంగిల్ హనుమాన్ దేవాలయం –నిర్మల్

ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ అడవిలో శ్రీ హనుమాన్ దేవాలయం ఉన్నది .దీనినే జంగిల్ హనుమాన్ అంటారు .

445-శ్రీ హనుమాలయం –బారకార్

పశ్చిమ బెంగాల్ అసం సోల్ జిల్లా బారకార్ లో శ్రీ హనుమాలయం ప్రసిద్ధమైనది .ఇక్కడే సిద్దేశ్వర దుర్గా గణేశ దేవాలయాలున్నాయి .వీటిని బెగూనియా దేవాలయాలంటారు .ఒరిస్సా శైలి లో కట్టిన ఆలయాలివి .

446-ప్రాచీన హనుమాలయం –గోవా

1840లో నిర్మించబడిన ఈ హనుమాలయాన్ని ‘’బుడత కీచు ‘’లనే పోర్చుగీస్ వాళ్ళు ధ్వంసం చేస్తే ,ఆతర్వాత అక్కడి హనుమాన్ భక్తుల౦తాకలిసి1843లో  పునర్నిర్మింఛి వెండి విగ్రహం ప్రతిష్టించారు  .మపూసా వర్తకులు నిధి పోగు చేసి నిర్మాణానికి సాయపడ్డారు .భూత ప్రేత పిశాచాలకు భయంకరుడు ఈ హనుమ .

447-శ్రీ హన్మాన్ దేవాలయం –సిల్వసా

దాద్రా నగర్ హవేలీ లోని సిల్వసా లో శ్రీ ఆంజనేయ స్వామి శ్రీరామ సీతాదేవి ల ముందు అభయ ముద్రతో కూర్చుని దర్శనమిస్తాడు .ఇక్కడే స్వామినారాయణ దేవాలయమూ ఉంది

448-శ్రీ హనుమాన్ మందిర్ –ఆగ్రా

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ప్రాచీన లంగర్ కి చౌకిలో అందమైన మార్బుల్ హనుమాన్ విగ్రహం, దేవాలయం కను విందు చేస్తాయి

449-శ్రీ ఉమానంద హనుమాన్ దేవాలయం –పీకాక్ ఐలాండ్

 అస్సాం బ్రహ్మ పుత్రా నది మధ్యలో పీకాక్ ఐలాండ్ లోకామరూప్ లో  శివాలయం లో ఉన్న శివుడిని భయానంద అంటారు .కల్కి పురాణం ప్రకారం ఇక్కడే పరమ శివుడు సృష్టి ప్రారంభం లో భస్మాన్ని చల్లి పార్వతీ దేవికి జ్ఞానోదయం కలిగించాడు .ఇక్కడే మన్మధుడు తపస్సు చేస్తున్న శివునిపై పుష్పబాణాలు వేస్తె, ముక్కంటి కంటి మంటకు మాడి భస్మమైనాడు .అందుకే ఈ పర్వతాన్ని  భస్మాచలం  భస్మ కూటం అంటారు .ఇక్కడే ఊర్వశి కామాఖ్య దేవతలకు అమృతం  అందించిందని కల్కి పురాణం చెప్పింది .ఇదే ఊర్వశి ఐలాండ్ .

   ఇక్కడిఉమానంద  శివుడిని సోమవారం తో కలిసిన అమావాస్యనాడు పూజిస్తేఅంతకంటే అదృష్టం ఇంకోటి లేదు .మాస శివరాత్రి కి అశేష భక్తజనం వస్తారు .ఉమానంద దేవాలయాన్ని 1694లో బార్ ఫుకాన్ గార్గ్య హ౦డీకి అనే ఆయన ఆనాటి అస్సాం రాజులలో బలవీర పరాక్రమాలలో మేటి అయిన  రాజు గదాధర సింగ్ ఆజ్ఞతో నిర్మించాడు .1897 భూకంపానికి ఆలయం ద్వంసమైతే ,ఒక ధనిక వర్తకుడు పునర్నిర్మాణం చేశాడు .కామరూప్ మొగలాయి పాలనలో కొచ్చినప్పుడు ఉమానంద దేవాలయ పూజారులు జహంగీర్ ,ఔరంగ జేబ్ లనుండి భూమి ,నగదు పొందారు .

  ఇక్కడే ఉమాన౦ద  ఆంజనేయస్వామి దేవాలయమూ చరిత్ర ప్రసిద్ధి కేక్కిందే .

450-శ్రీ ఆరుమిలగు కాడు హనుమంత రాయ దేవాలయం –ధరాపురం

తమిళనాడు కోయంబత్తూర్ జిల్లా మెట్టుపాలెం దగ్గర ధరాపురం లో శ్రీ ఆరుమిలగు కాడు హనుమంత రాయ దేవాలయం బహు ప్రాచీనమైనది .క్రీ.శ.600లో నిర్మింపబడింది .ఆలయమండపం లో టేకు పై చెక్కిన నగిషీలు ఈనాటికీ నిత్యనూతనంగా కనిపిస్తాయి.ఈ స్వామిని దర్శిస్తే ఇక చింతా చీకూ ఉండదు .శ్రీ వ్యాసరాయ ప్రతిస్టిత0.విశాలప్రాంగణ౦  లో ఉంటుంది .గోశాల ఉన్నది .అన్ని హంగులు ఉన్న ఆలయం .తప్పక దర్శించి తరించాలి .

 దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవ భాగం  సమాప్తం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-18-ఉయ్యూరు

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.