వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు -14(చివరి భాగం )

 

        వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు -14(చివరి భాగం )

91-కీసర గుట్ట గా మారిన కేసరి గిరి

రంగా రెడ్డి జిల్లా కీసర గుట్ట క్షేత్రం లో శ్రీ భవానీ రామ లింగేశ్వర స్వామి మహిమాన్వితుడు .రామేశ్వరం లో ప్రతిస్తిన్చాతానికి .హనుమంతుడు రామాజ్నతో కైలాసం నుండి నూటొక్క లింగాలను తెచ్చాడు  . అప్పటికే సైకత లింగాన్ని ముహూర్త సమ యానికి రాముడు ప్రతిస్టించాడు. కోపం వచ్చి తోకతో వాటిని విసిరేశాడు అవి ఈ ప్రాంతపు పర్వతం చుట్తో పది పోయాయి .శ్రీరాముడు హనుమ ను శాంతింప జేసి ఈ ప్రదేశమంతా అతని పేరు మీద ‘’కేసరి గిరి ‘’అని పిలువ బడుతుందని చెప్పాడు .అదే కాల క్రమం లో కీసర గుట్ట అయింది

92—వీసాలిప్పించే బాలాజీ –చిలుకూరు

హైదరాబాద్ దగ్గరున్న చిలుకూరు లో శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలను తీరుస్తాడు కోరిక కోరి పదకొండు, తీరిన తర్వాతా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి బాలాజీ ని దర్శించటం ఇక్కడ రివాజు .ముఖ్యం గా అమెరికా వీసా కోసం ప్రయత్నించేవారు ఇక్కడికొచ్చి స్వామిని దర్శించి సఫల మనోరధులౌతారు.ఇక్కడి బాలాజీ ని అందుకే ‘’వీసా బాలాజీ’’ అంటారు .ఆలయం లో దేనికి రుసుము ఉండదు .అదీ ఇక్కడి ప్రత్యేకత విశేషం విచిత్రం కూడా .చాలా ప్రాచీన ఆలయం

93-మన రాష్ట్రం లో అనంత పద్మ నాభుడు –అనంత గిరి

రంగా రెడ్డి జిల్లా వికారాబాద్ కు దగ్గరలో ఉన్న అనంత గిరి కొండలపై శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం 1300 ఏళ్ళ నాటిది .ముచుకుంద మహర్షి ఇక్కడి గుహలో విశ్రాంతి తీసుకొంటుంటే శ్రీ కృష్ణుని మాయోపాయానికి కాలయవనుడు గుహలో ప్రవేశించి మహర్షికి నిద్రా భంగం చేస్తే ఆయన కంటి మంటకు ఆహుతి అయి నాడు రాక్షసుడు. అందుకే ‘’ముచుకుంద వరదుడు ‘’అని శ్రీ కృష్ణునికి పేరు .మహర్షి శ్రీ కృష్ణుని పాదాలను కడిగిన జలమే ‘’ముచుకుంద ‘’నది గా అంటే మూసీ నదిగా మారింది మార్కండేయ మహర్షి కోరికపై విష్ణువు ఇక్కడ సాల గ్రామ అనంత పద్మ నాభ స్వామిగా వెలిశాడు.ఆలయం ప్రక్కనే ‘’భావ నాశిని ‘’అని పిలువా బడే భాగీరధ గుండం ఉంది గుండా స్నానం పాప సంహారమే కాకుండా ఆయురారోగ్య ప్రదానం కూడా .దేవాలయం దగ్గరే మార్కండేయ తపోవనం ఉంది   .

94- దామ గుండాన్ని దర్శిస్తే యమ గండం ఉండదు

రంగా రెడ్డి జిల్లా పూడూరు కు దగ్గరలో దట్టమైన అటవీ ప్రాంతం లో దామ గుండం దేవాలయం ఉంది ఇక్కడ జాతర విశేషం గా జరుగుతుంది .అందుకే దామ గుండాన్ని దర్శిస్తే యమ గండం ఉడదని భక్తుల అచంచల విశ్వాసం

95-ఆది శేషుడు పడగ పట్టే శ్రీ రాముడు-బంటుమిల్లి

రంగా రెడ్డి జిల్లా బంటుమిల్లి లో శ్రీ రామ దేవాలయం లో ఆది శేషుడు శ్రీ రామునికి పడగ పట్టటం వింత గా ఉంటుంది .ఏ ఇతర రామాలయం లోను కనీ పించని విచిత్రం ఇది .విగ్రహం నుంచి నిరంతరం నీరు స్రవిస్తూన్డటం విశేషం .గుడికి దగ్గర లో  గాడి దోనేల లో కూడా నీరు ఎప్పుడూ ఇంకిపోదు ఇది మరీ విచిత్రం

96-అశ్వినీ దేవతలుగా భావింప బడే సప్త వృక్షాలు –ఎన్కతల

రంగా రెడ్డి జిల్లా ఎన్కతల గ్రామంలో అరుదైన శసీశ్వరాలయం ఉంది   .శంకర భారతీ మహా రాజ్ అనే నాందేడ్ వాసి ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారు .శనైశ్చర విగ్రహాన్ని ప్రతిష్టించి ఆయన ఏడు దేవాలయాలను నిర్మించి ,ఏడు వృక్షాలను నాటించారు ఈ సప్త వ్రుక్షాలనే అశ్వినీ దేవతలు గా భావిస్తారు మానషిక రోగులు సప్త దేవాలయాలను ,సప్త వృక్షాలను 41 రోజులు ప్రదక్షిణాలు చేస్తే మానసి క ప్రశాంతత పొందుతారని విశ్వాసం .అమావాస్య రోజున శనీశ్వరునికి తైలాభిషేకం నిర్వహిస్తారు

97-ఇప్ప చెట్టు మొదలే శ్రీ ముఖ లింగం

శ్రీ కాకుళం జిల్లాలో శ్రీకులానికి ముప్ఫై కిలో మీటర్ల దూరం లో ఉన్న  శ్రీ ముఖ లింగ క్షేత్రం పరమ పవిత్ర మైనదే కాక వింతల తో కూడినదికూడా ..ముఖ లింగం అనే పేరు కు శాసనాధారాలు లేక పోవటం వింత .నగరం అని ,కాలింగ నగరం అని ,నగరపు వాడ ,త్రికలి నగరం పేర్ల తో పిలుస్తారు  శ్రీ ముఖలింగ ఆలయాన్ని మధుకేశ్వరాలయం అనీ అంటారు .ఇక్కడ శివలింగం ఉండక పోవటం విచిత్రం .ఇప్ప చెట్టు మొదలు నరికేస్తే అదే ముఖ లింగం గా ప్రసిద్ధి చెందటం విశేషం .చెట్టు మొదలు పై ,ముఖం ఆకారం కనీ పిస్తుంది కనుక ఆ పేరొచ్చింది .ఆ మొదలే కాల క్రమం లో రాపిడి వల్ల  శివ లింగం ఆకారం దాల్చిందని భావిస్తారు

ఆలయం లో గర్భాలయం కాక ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలున్నాయి. అమ్మవారి పేరు పార్వతీదేవి నామాలలో ఒకటైన ‘’వారాహీ దేవి’’ .అంటే సప్త మాతృకలలో ఒకరు .మిగిలిన పేర్లు బ్రాహ్మి ,మహేశ్వరి, కౌమారి ,,వైష్ణవి, ఇంద్రాణి.,శార్వాణి ఇక్కడి శిల్పాలలో వరాహావతారం వామనావతారాలున్డటం చిత్రం లో విచిత్రం ఇక్కడ భీమేశ్వర అఆలయం లో కుమార స్వామి దక్షిణా మూర్తి చతుర్ముఖ బ్రహ్మ గణపతి ఉన్నారు ,సోమేశ్వరాలయములో గర్భ గుడి మాత్రమె ఉండటం వింత .ముఖ మండపం అనేది లేక పోవటం విచిత్రం అయితే ఎత్తైన శిఖరం మీద బ్రహ్మాండ మైన అతి పెద్ద రాతితో పై కప్పు వేశారు .ఇదంతా ఒకే రాతి తో నిర్మింప బడి  ఉండటం అమితాస్చర్యం కలిగిస్తుంది .ఒక సారెప్పుడో పిడుగు పడి  పై కప్పు రాయి కొంత విరిగి కింద పడిందట .ఈ ముక్కను ఎత్తటానికి యాభై మంది మనుష్యులు ప్రయత్నించినా వాళ్ళవల్ల కాలేదట .మరి  అంత  పెద్ద రాయిని శిఖరం పైకి ఎలా చేర్చి పై కప్పుగా అమర్చారో విపరీతమైన సంభ్రమాన్ని కల్గిస్తుంది .ఆ నాటి శిల్పుల అ నైపుణ్యానికి ఉదాహరణ గా ఇది నిలుస్తుంది .

ఇక్కడే ఏడు నాలుకలతో అగ్ని దేవుని విగ్రహం ,హరిహర దేవుల విగ్రహాలున్నాయి .వీణాపాణి సరస్వతి విగ్రహం ఉంది శ్రీ ముఖ లింగాలయాన్ని ప దవ శతాబ్దిలో కళింగరాజైన కామార్ణవుడు నిర్మించాడు అతని కుమారుడు భీమ వజ్ర హస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడు కామార్ణవుడు రాజ దానిని దంత నగరం నుండి శ్రీ ముఖానికి మార్చాడు .శివ రాత్రికి ఇక్కడ జరిగే ఉత్సవం కలియుగ కైలాసాన్ని గుర్తుకు తెస్తుంది

98-డోలోత్సవం ప్రధాన మైన శ్రీ కూర్మం

శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం లో స్వామికి జరిగే డోలోత్సవం ప్రత్యెక మైనది దీన్ని దర్శించటానికి వేలాది భక్తులు తరలి వస్తారు శ్రీ కూర్మ ఆలయం తూర్పు ముఖం గా ఉంటె స్వామి శ్రీ కూర్మ నాధుడు పడమటి ముఖం గా ఉండటం ఒక వింత .అందుకే తూర్పున ,పడమరా కూడా ధ్వజ స్తంభాలున్నాయి స్వామి పై అచంచల భక్తీ ఉన్న భిల్ల మహా రాజు పశ్చిమాభిముఖం గా ఆశ్రమం లో ఉండేవాడట .అందుకని స్వామి కూడా అదే వైపుకు ఉన్నాడట ఇది విశేషం ఆలయ గోపురం గోడల మీద భాగవత కధలన్నీ శిల్పాలతో చెక్కారు

99-నేల మాలిగ లో ఉన్న లింగం –శ్రీ కూర్మం

శ్రీ కూర్మం లోనే పాతాళ  సిద్దేశ్వర స్వామి ఆలయం ఉంది .సిద్దేశ్వర లింగం నేల  మాళిగ లో ప్రతిస్తింప బడి ఉండటం వింత . అందుకే ఆ పేరొచ్చింది .ఈ చిన్న ఆలయానికి ఎదురుగా రెండు నందులున్డటం విచిత్రం .ఆలయ ఆవరణ లో మరో పెద్ద లింగం ఉండటం విశేషం

100-జింక చర్మం తో  కప్పు బడిన మల్లికాజినుడు

శ్రీ కాకుళం జిల్లా రావి వలస ‘’కార్తీక కైలాసం ‘’గా కీర్తి పొందింది .ఇక్కడి శివలింగం ఇరవై అడుగుల  ఎత్తు ఉండటం ఒక వింత అయితే అది ఆరు బయటే ఉండటం విచిత్రం ..ఈ మధ్యనే రెండస్తుల పైకప్పు నిర్మించారు .లింగానికి ఎదురుగా నంది ,నంది ప్రక్కనే మరో చిన్న లింగం ఉండటం విచిత్రం .సీతా రాములు ఈ లింగాన్ని పూజించి నట్లు ఐతిహ్యం మల్లె పూలతో జింక తోలు (జిన చర్మం )తోశివలింగం  ఎప్పుడూ కప్పబడి ఉండటం వల్ల ‘’మల్లికా జినుడు ‘’అనే పేరొచ్చిందట .క్రమం గా అది మల్లికార్జునుడు అయిందట .1870 లో టెక్కలి జమీందార్ బృందావన హరిశ్చంద్ర జగదేవ్ స్వామికి ఆలయం నిర్మించగా అది కూలి పోయిందట మళ్ళీ కట్టడం ప్రారంభిస్తే స్వామి కలలో కన్పించి తాను ఆరు బయటే ఉంటానని ఆలయ నిర్మాణం చేయ వద్దని చెప్పాడట కార్ర్తీక మాసం లో శివుడు అశ్వత్థ వృక్షం కింద ఉంటాడని భక్తుల నమ్మిక .అందువల్లే రావి వలస ‘’కార్తీక కైలాసం ‘’అనిపించుకోంది  .

సమాప్తం

ఈ ధారా వాహిక కు ప్రస్తుతానికి విరామం .మళ్ళీ కొన్ని రోజుల్లో మరలా ఆలయ వింతలను అంద జేస్తాను ‘

శ్రీ వరలక్ష్మీ వ్రత శుభా కాంక్షల తో

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-13 –ఉయ్యూరు

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.