శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం –8

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం –8

                                          దూర్వాస మహర్షి కధ –2

శివామ్ష తో జన్మించిన దూర్వాసుడు ,అన్ని విద్యలు నేర్చి ,గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేస్తున్నాడు .అప్పుడు దేవ దాసీ తిలోత్తమ ,ఆమె ప్రియుడు  సాహసి అనే వాడు ఈ మహర్షిని గమనించ కుండా రాతి క్రీడలో పాల్గొన్నారు .వారి మాటలు ,చేష్టలు మహర్షి తపస్సు కు భంగం కల్గించాయి .ఆయన కళ్ళు తెరచి ,వారి కామోద్రేకానికి కినిసి ,వారిద్దరిని రాక్షసు లు గా జన్మించ మని శపించాడు .సాహసి ”గర్దభాసురుడు ”గా జన్మించాడు .ఇతడు మహా విష్ణువు చేతిలో మరణం చెండాడు .ఏమైనా భరద్వాజుని ఏకాగ్రత దెబ్బ తిండి .కామ వికారం కల్గి ,పెళ్లి చేసుకోవాలనే కోర్కె పెరిగింది .అదే సమయం లో చ్యవన మహర్షి కుమారుడు ”ఔర్వుడు ”అనే ఆయన ,తన కుమార్తె ”కందళి ”తో అక్కడికి వచ్చి ,మహర్షి మనసు లోని ఆట తెలుసు కోని ,తన కూతురు కందళి నిచ్చి దూర్వాసునికి వివాహం చేశాడు .
కందళి గంప గయ్యాళి .ఆమె ను భరించటం కష్టం గా వుంది ..ఆమె కోపాన్ని భరించ లేక ,ఆమెను వదిలి ,మళ్ళీ తపస్సు కు వెళ్ళాడు .ఆమెకు భర్త ను వదలటం ఇష్టం లేక ,ఆతడిని అనుసరించింది .కొంత దూరం వెళ్ళిన తర్వాత ,దివ్య రూపం లో వున్న ఒక పిల్ల వాడు అక్కడికి వచ్చి మహర్షితో కందలిక ను విడిచి పెట్ట వద్దనీ ,ఆమెయే తగిన అర్ధాంగి అవుతుందని చెప్పి వెళ్లి పోయాడు .కందలిక  తన పేరు మీద కదళీ వృక్ష జాతిని సృష్టించింది.కందళి కడలి గా ,రంభా గా అరటి గా పేరు మారింది . .
దూర్వాస మహర్షి గురించిన మూడో కధ .పూర్వం ”నాభాగుడు ”అనే రాజు వుండే వాడు .ఆయన కుమారుడే అంబరీషుడు .అంబరీషుడు విష్ణు భక్తుడు .ఏకాదశీ వ్రతాన్ని భ క్తీ శ్రర్ధ లతో    చేసే వాడు .ఒక సారి ఏకాదశి ఉపవాసం వుంది ,మర్నాడు ద్వాదశి నాడు పారాయణ చేయటానికి సిద్ధ మైన సమయం లో దూర్వాసుడు ,ఆయనకు అతిధి గా వచ్చి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు .ద్వాదశి ఘడియలు పూర్తి ఆయె సమయం అయినా మహర్షి రాలేదు .అక్కడున్న మార్షుల అనుమతి తో ,కొద్దిగా జలాన్ని తీర్ధం గా త్రాగాడు .తర్వాత దూర్వాసుడు వచ్చి ,జరిగిన దానికి కోప పది తన శిరస్సు లోని ఒక జడ ను పీకి దాన్ని పిశాచిగా మార్చి భక్త అంబరీషుని పైకి పంపాడు .అది అతి భయంకరం గా మీదకు రావటం గ్రహించి ,రాజు ,శ్రీ హరిణి మనసు లో ధ్యానించాడు .వెంటనే విష్ణు చక్రం ఉద్భవించి ,పిశాచాన్ని చంపి ,,దుర్వాసుని చంప టానికి   మీదకు వెళ్ళింది .
భయం తో దుర్వాసుడు పారి పోవటం ప్రారంభించాడు .చక్రం ఆయన్ను వెన్నంటే వెళ్తోంది .మూడు లోకాలూ తిరిగి నా ఎవరూ,దుర్వాసునికి అభయం ఇవ్వ లేదు .చివరికి విష్ణువు ఆజ్ఞా తో మళ్ళీ అమ్బరీశున్నే శరణు వేడాడు .అంబరీషుడు అతన్ని క్షమించాడు .వెంటనే చక్రం అదృశ్య మైంది .భగవంతుని కంటే ,భక్తుడే శక్తి కల వాడు అని ఈ కధ మనకు తెలియ జేస్తుంది .
ద్వాపర యుగం లో కుంతిభోజుడు అనే రాజు దగ్గరకు దుర్వాసుడు వచ్చాడు .ఆయన కుమార్తె కుంటే దేవిని చూసి ,ఆమె భక్తికి మెచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిచాడు .ఆ మంత్రాన్ని ఏ దేవుడిని ఉద్దేశించి జపిస్తే ,ఆయన వల్ల మంచి సంతానం కలుగుతుందని చెప్పాడు .కుంటే దేవి బుద్ధి చాపల్యం తో ఆమంత్ర ప్రభావాన్ని పరీక్షించాలను కొంది .సూర్యుని గురించి ప్రార్ధించింది .ఆయన వరం వల్ల ఆమెకు కర్ణుడు జన్మించాడు కుంతికి వివాహం అయిన తర్వాత ధర్మ దేవత ,వాయుదేవుడు ,ఇంద్రుడు ,అశ్వినీ దేవతలను దుర్వాసుని మంత్రం తో స్మరించి ,క్రమంగా ధర్మ రాజు ,భీముడు ,అర్జునుడు ,నకుల సహ దేవులను కన్నది .వీరే పంచ పాండవులు .కర్ణుడిని నదిలో వదిలి పెడితే ఆతడు సూతుది కి దొరికి అక్కడ పెరిగి కుమారాస్త్ర విద్యా ప్రదర్శన లో తన సామర్ధ్యం రుజువు చేసు కోని ,దుర్యోధనుని మనసు గెల్చి ,అంగ రాజ్యానికి అభిషిక్తుడై ,కౌరవ పక్షం లో ముఖ్యుడైన సంగతి మనకు తెలిసిందే.
దూర్వాసుడు వైష్ణవ ,శాక్తేయాది మహా మంత్రాలన్నీ జపించి నప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది .చివరికి ”శ్రీ హనుమత్సంజీవినీ విద్య ”నేర్చి జపించాడు .అప్పుడు హనుమ ఒకే ముఖం తో 18 భుజాలతో దర్శన మిచ్చాడు .దుర్వాసుడు పరవశించి ఆన్జనేయుడిని భక్తీ తో కీర్తించాడు .చక్కని శ్లోకం తో ఆయన్ను వర్ణించాడు -
”శక్తిం ,పాశం చ కుంతం ,పరశు మపి హలం తోమరం ,ఖేతకం వా
శంఖం చక్రం త్రిశూలం ముసలమపి గడం పట్టాసం ముద్గరం చ
గాండీవం బాణ పద్మం ,ద్వినవ వర భుజైహ్,ఖడ్గ మస్యావదానం
వందేహం వాయుసూనుం ,సురరిపు మధనం ,భక్త రక్షా దురీణం .”
ఈ శ్లోకం విన గానే ,ఆంజనేయుడు మిక్కిలి సంతోషించి దుర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి ,అదృశ్యమైనాడు .అప్పటి నుంచి దుర్వాసుడు ఆంజనేయ మంత్రాన్ని అత్యంత భక్తీ శ్రద్ధ లోతో జపిస్తూ మనశ్శాంతి ని పొందుతూ ,కోపం లేని వాడై ,గంధమాదన పర్వతం ఈదే నివశిస్తూ ,మహా యోగి యై శివుని వలె నిత్య ప్రాతస్మరనుడు అయాడు ..కనుక మానషిక శాంతి లభించాలి అంటే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అనిదుర్వాసుని కధల వల్ల మనకు తెలుస్తోంది .దుర్వాసముని  కధ సమాప్తం.
ఈ సారి ధ్వజ దత్త కధ తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -01 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
http://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

వ్యాఖ్యానించండి

Filed under విశేషాలు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )